Home Sewa భాగ్యనగర్ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు

భాగ్యనగర్ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు

0
SHARE

గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారి వర్షాల కారణంగా  భాగ్యనగర్ (హైదరాబాద్ )నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధం లో చిక్కుక్కున్నాయి. నగరంలోని చిన్న, పెద్ద చెరువులు, కుంటలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి.

వర్షం కారణంగా ఆల్వాల్ ప్రాంతం లో 10 కాలనీలలో మోకాళ్ళ లోతు వరదనీరు  చేరుకుంది. సికింద్రాబాద్, ఆల్వాల్ లో నివసించే స్థానిక 40 మంది స్వయం సేవకులు వరద సహాయక చర్యలలో పాల్గొన్నారు. 2000 కు పైగా ఆహార పొట్లాలను, తాగు నీటిని ఉదయం 9 నుండి సాయత్రం 6 గంటలవరకు ఇంటిటికి తిరుగుతూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

alwal-swayamsevaks-2

alwal-swayamsevaks

 

15 మంది స్వయంసేవకలు ఆల్వాల్ మెయిన్ రోడ్ లోని ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఉదయం నుండి సాయత్రం వరకు ట్రాఫిక్ పోలీసు వారికి తోడ్పడ్డారు.

నిజాంపేట్ గ్రామంలోని అపార్ట్ మెంట్ లలోని  పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినవి. స్థానిక 150 మంది స్వయంసేవకులు 3000 బస్తాలలో మట్టిని నింపి వరద నీటితో పొంగి పొర్లుతున్న నిజాంపేట చెరువు కట్ట కు గండి పడకుండా, తగిన చర్యలు తీసుకున్నారు.

rss-sewa-operations-in-hyderabad

rss-sewa-operations-in-hyderabad-7

rss-sewa-operations-in-hyderabad-10

rss-sewa-operations-in-hyderabad-3