Home News జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగ అవగాహన సదస్సు’

జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగ అవగాహన సదస్సు’

0
SHARE

నవంబర్ 26 భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోసిగి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగ అవగాహన సదస్సు’ జరిగింది. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షులు పోకల లక్ష్మణ్ సభాధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వంశ తిలక్ గారు మరియు ముఖ్య వక్త శ్రీ అప్పాల ప్రసాద్ గారు హాజరయ్యారు. శ్రీ అప్పాల ప్రసాద్ గారు మాట్లాడుతూ “సుమారు 300 మంది రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుండగా.. డా అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించి అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం, బడుగు వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని, అంబేడ్కర్ మహాశయున్ని కులం రొచ్చులోకి లాగకుండా అందరి వాడుగా ప్రచారం చేయాలని కోరారు. ఉన్నత చదువులు చదివి గొప్ప వ్యక్తిత్వంతో జీవిస్తూ డా. అంబేద్కర్ తాను మొదట, ఆ తరువాత కూడా భారతీయునిగా ఉండాలని కలలు కన్నారని అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు. దేశంలోని విభిన్న కులాలు ఉన్నప్పటికీ వారి మధ్య సోదరభావం వెల్లివిరవాలని ఆకాంక్షించారు. స్వేఛ్ఛ లేకుండా సమానత్వం, సమానత్వంతో లేకుండా స్వేచ్ఛ, అలాగే సోదరభావం లేకుండా ఈ రెండూ కూడా సాధించబడవని, అంతే కాకుండా వీటికి న్యాయం కూడా తోడై ఒకదానికొకటి పరస్పరం సమన్వయంతో కలిసి ప్రజలకు అందినప్పుడే ఆదర్శ సమాజం ఏర్పడుతుందని అన్నారు. 

కుల వ్యవస్థ, సామాజిక సామరస్యతపై ఆరెస్సెస్ దృష్టికోణం 

విద్యార్థులు, యువతీ యువకులు పాశ్చాత్య అలవాట్లకు లోను కాకుండా కష్టపడి చదివి సమాజం లోని పేద వారికి సేవ చేయాలని, తల్లిదండ్రులు, గురువుల పట్ల అలాగే వివిధ కులాల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి అని వారు పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం – భారతదేశ సమైక్యతకు ఈ నాలుగు మూల స్తంభాలుగా భారత రాజ్యాంగ నిర్మాణం జరిగిందని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షులు డా వంశ తిలక్ తెలియ చేశారు. 
కార్యక్రమంలో కోస్గి తహసిల్దార్ రామకోఠి గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిబీ. వెంకటేష్, తాలూకా కన్వీనర్ తిమ్మగళ్ళ కృష్ణయ్య,కోసిగి మండల కన్వీనర్ డి.చెన్నప్ప, కొటకోండ కనకయ్య, దమ్యి అంజియ్య, పోకల మొగులప్ప, దూళ్ళకాడి బిక్షపతి, దోబ్బలి రాములు, బోడ ఎల్లప్ప మరియు స్కాలర్స్, ప్రజ్ఞ అంబేద్కర్ ప్యారమెడికాల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.