Home News 12 ఏళ్ల బాలికపై అత్యాచారం: ఇస్లామిక్ మత బోధకుడు అరెస్ట్

12 ఏళ్ల బాలికపై అత్యాచారం: ఇస్లామిక్ మత బోధకుడు అరెస్ట్

0
SHARE

12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదర్సా (ఇస్లామిక్ పాఠశాల) ఉపాధ్యాయుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్        చేశారు.

మీరట్ సమీపంలోని ఖేరి కలాన్ గ్రామంలోని మదరసాలో ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు, ఇస్లామిక్ మతబోధకుడు మౌలానా జావేద్ ను అరెస్ట్ చేసారు. 

అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు జావేద్ కు స్థానిక కోర్టు రిమాండ్ విధించింది. జావేద్ పై ఇప్పటికే పోస్కో చట్టం కింద కేసు నమోదుకాగా, జాతీయ భద్రతా చట్టానికి సంబంధించిన సెక్షన్లు కూడా నమోదయ్యే అవకాశం ఉందని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అనంత్ దేవ్ సూచనప్రాయంగా వెల్లడించారు. వైద్య రిపోర్టులు రాగానే వెంటనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. నిందితుడి దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు.

Source: ANI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here