Home News గుంటూరులో ‘లవ్ జిహాద్’ – 15 మందిపై కేసు నమోదు

గుంటూరులో ‘లవ్ జిహాద్’ – 15 మందిపై కేసు నమోదు

0
SHARE

గుంటూరు అర్బన్ పరిధిలోని జరిగిన లవ్ జిహాద్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. జైన్ సామాజిక వర్గానికి చెందిన యువతి శిల్పా జైన్ కుటుంబం గుంటూరు పట్టణంలోని బ్రహ్మంగారి మందిరం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాబాయ్ సంరక్షణలో ఉంటున్న యువతిపై బంగారం షాపులో పాలిష్ చేసుకునే స్థానిక యువకుడు ఖాజాఖాన్ కన్నేశాడు. ఆమెను ప్రేమ పేరుతో ప్రలోభపెట్టాడు. పెళ్ళి చేసుకునేందుకు మతం మారాలంటూ మాయమాటలు చెప్పిన ఖాజాఖాన్, ఈనెల 14న తన అనుచరుల సహాయంతో యువతిని గుర్తుతెలియని మసీదుకి తీసుకెళ్లి  ఇస్లాం మతంలోకి మార్చాడు. అనంతరం ఆమె పేరును ఫాతిమా ఖాన్ గా మార్చివేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై శిల్పా జైన్ సోదరి డింపుల్ జైన్ గుంటూరు అర్బన్ పరిధిలోని లాలాపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ సోదరిని ప్రలోభపెట్టి బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకున్నట్టు తమ ఫిర్యాదులో వివరించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తే మొత్తం తమ కుటుంబాన్ని చంపుతామని, అంతేకాకుండా పెళ్ళి చేసుకున్న యువతిని దుబాయి అమ్మేస్తామని స్థానిక ముస్లిం రౌడీలు తమను బెదిరిస్తున్నట్టు డింపుల్ తన ఫిర్యాదులో పేర్కొంది. 

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఖాజాఖాన్ సహా ఘటనతో ప్రమేయం ఉన్న 15 మంది ముస్లిము సామాజిక వర్గానికి చెందిన వారిపై ఐపీసీ 363, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.