Home News క్రైస్తవ వసతిగృహంలో మతమార్పిళ్లు..  25 మంది చిన్నారులను రక్షించిన అధికారులు

క్రైస్తవ వసతిగృహంలో మతమార్పిళ్లు..  25 మంది చిన్నారులను రక్షించిన అధికారులు

0
SHARE

హర్యానా అంబాలాలోని కళారహేలి ప్రాంతంలో ఒక క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న ‘మెర్సీ హోం’ అనే బాలల వసతి గృహం నుండి 25 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వీరిని తీసుకువచ్చిన వసతి గృహ నిర్వాహకులు చిన్నారులను మతమార్పిడికి గురిచేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు.

జువైనల్ జస్టిస్ చట్టానికి విరుద్ధంగా ఈ ‘మెర్సీ హోం’ నిర్వహిస్తున్నట్టు జిల్లా బాల సంరక్షణ శాఖ అధికారిని బల్జీత్ కౌర్ వివరించారు. ‘మెర్సీ హోమ్’లో 3 నుండి 17 ఏళ్ల వయసుగల చిన్నారులు ఉన్నట్టు గుర్తించామని, బాలబాలికలందరినీ ఒకే గదిలో ఉంచుతున్న విషయాన్నీ ఆమె గుర్తించినట్టు తెలిపారు.
బాలబాలికలలో ప్రతి ఒక్కరి పేరునా చివరలో ఆశ్రమ నిర్వాహకుడు ఫిలిప్ మసిహ్  చివరి పేరు ‘మసిహ్’ చేర్చి, వారిని మనసులను ప్రలోభపెట్టి మతం మారుస్తున్న విషయం జిల్లా పోలీసు, బాలల సంరక్షణ శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొందరు పిల్లలకు తల్లిదండ్రులు ఉన్న విషయాన్నీ పోలీసులు కనుగొన్నారు.
కాపాడబడిన చిన్నారులను వైద్య పరీక్షల నిమిత్తం అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో గల సివిల్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పంచకుల మరియు యమునానగర్ ప్రాంతాల్లో గల ప్రభుత్వ వసతి గృహాలకు తరలించారు.
గతంలో 2014 సంవత్సరంలో కూడా ఈ ‘మెర్సీ హోం’ మీద జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ దాడులు నిర్వహించింది. ఆ సందర్భంగా 15 మంది చిన్నారులు పట్టే గదిలో 50 మందిని ఉంచుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా తమ ‘మెర్సీ హోం’ వసతిగృహం మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని, తాము క్రైస్తవులం అయినందునే తమపై ఆరోపణలు చేస్తున్నట్టు నిర్వహకులు ఫిలిప్ మసిహ్, ఆయన భార్య నరేందర్ కౌర్ ఫిలిప్ వ్యాఖ్యానించారు.
Source: VSK Bharat