Home News భార్య సహాయంతో బాలికపై 6 నెలలుగా అత్యాచారం.. ముస్లిం మతపెద్దల రాజీ ప్రయత్నం!

భార్య సహాయంతో బాలికపై 6 నెలలుగా అత్యాచారం.. ముస్లిం మతపెద్దల రాజీ ప్రయత్నం!

0
SHARE

గుంటూరులో దారుణ ఘటనవెలుగులోకి వచ్చింది. తాడేపల్లి మండలం కొలనుకొండలో ఉర్దూ హోమ్ ట్యూషన్ పాఠాలు చెప్పే మైనర్ బాలికపై అదే అదే గ్రామానికి చెందిన సయ్యద్ ఖాసీంవలి అనే వ్యక్తి గత 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

న్యూస్ 18 తెలుగు కధనం ప్రకారం.. పాఠాలు చెప్పేందుకు ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపిన సయ్యద్ ఖాసీంవలి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకి పొక్కటంతో ముస్లిం మత పెద్దల సహాయంతో రాజీ చేసేందుకు ప్రయత్నించారు.

ఈక్రమంలో మైనర్ బాలికను గుంటూరు జిల్లా ఎడ్లపాడు హాస్టల్ కు తరలించారు. అయినప్పటికీ కొద్దీ రోజుల అనంతరం సయ్యద్ ఖాసీం తన భార్య సహకారంతో బాలికను హాస్టల్ నుంచి మరల ఇంటికి పిలిపించి 3 రోజులుగా తన నివాసంలో బంధించి భార్య సహకరంతోనే అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here