Home News 8 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

8 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

0
SHARE

– ప్రశాంత్ పోల్

ఆగస్ట్ 8.. శ్రావణ షష్టి.. శుక్రవారం.. ఉదయం 5.45 గం.లకు గాంధీగారి రైలు పాట్నాకు దగ్గరగా ఉంది. ఆయన కిటికీ దగ్గర కూర్చుని ఉన్నారు. వాతావరణం చాలా ఆహ్లాదరకంగా ఉంది.

గాంధీగారు ఎంతటి ప్రతికూల పరిస్థితిలోనైనా ఉత్సాహంగానే ఉంటారుకానీ ఇప్పుడు ఎందుకో విచారంగా ఉన్నారు. ఆయనకు జ్ఞాపకం వచ్చింది.. సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఆయన్ని, నెహ్రూని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. క్రిప్స్ మిషన్ విఫలమైన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేయాలనుకున్నారు. దానికి సంబంధించిన ఒక సమావేశం 8 ఆగస్ట్,1942న ముంబైలో ఏర్పాటు చేశారు. అందులోనే గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది పలికారు. దానితో ఆయన్ని అరెస్ట్ చేశారు. అయిదేళ్లనాటి ఆ రోజు..ఇప్పుడు ఈ రోజు…ఆ రోజున స్వాతంత్ర్యం వస్తుందని ఎవరికి నమ్మకం లేదు. అయినా సర్వత్ర ఉత్సాహపూరిత వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు మరో వారం రోజుల్లో దేశానికి స్వాతంత్ర్యం లభించనుంది ..అయినా సందడి, ఉత్సాహం లేవు. ఎందుకని?

గత మూడు, నాలుగు రోజులుగా లాహోర్, వాఘా శరణార్ధి శిబిరాలలో హిందువుల దుస్థితి చూసి ఆయన కలత చెందారు. హిందువులు వారి ఇళ్ళు, వాకిళ్ళు వదిలి ఎందుకు పారిపోతున్నారో ఆయనకు అర్ధం కావడం లేదు. ‘’ముస్లింలకు వాళ్ళడిగిన పాకిస్థాన్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు హిందువులకు కీడు ఎందుకు చేస్తారు? హిందువులు పారిపోవలసిన అవసరం లేదు. నేను లాహోర్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నా శేష జీవితం పాకిస్థాన్ లోనే గడుపుతాను.’’ ఇలా సాగాయి గాంధీజీ ఆలోచనలు.

ఈ ఆలోచనలనుంచి బయటకు వచ్చిన తరువాత ఆయనకు కాస్త ఊరట లభించింది. రైలు పాట్నా వైపుగా పోతోంది. జేజేలతో గాంధీగారికి స్వాగతం పలకడానికి జనం సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో కూడా ఇదివరకటి ఉత్సాహం,సందడి లేవు. అంతా మొక్కుబడిగా, లాంఛనంగా జరుగుతున్నట్లుంది.

—–0—–

ఉదయం 6.గం.లు. అప్పటికి హైదారాబాద్ వీధుల్లో జనసంచారం అంతగా ప్రారంభం కాలేదు. ఉక్కపోత వేడితో కూడిన వాతావరణం ఉంది. అంబర్ పేట్ లో ఉన్న విశ్వవిద్యాలయ హాస్టల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ విశ్వవిద్యాలయం 40 సంవత్సరాలకు పూర్వం 1918 సం|| లో మీర్ ఒస్మాన్ అలీ అనే హైదరాబాద్ నవాబుచే స్థాపించబడినది. దాని వలన ఇక్కడ ప్రారంభం నుండే ఉర్దు మరియు ఇస్లాం ప్రభావం ప్రస్పుటంగానే వుండేది. గత కొన్ని రోజులుగా ఇక్కడ వాతావరణం కలుషితం అయినది ఎందుకంటే హైదరాబాదు ని భారతదేశం లో కలపడం నిజామ్ కు ఇష్టం లేదు.

ఈ మాటనే ఊతం గా తీసుకొని రజాకార్లు మరియు ముస్లిం గూండాలు విశ్వవిద్యాలయం లో హిందూ విద్యార్ధులను బెదిరంచడం మొదలు పెట్టారు. విశ్వవిద్యాలయం లో ఉన్న కొద్దిమంది విద్యార్ధినులు కూడా ఒక నెలనుండి అక్కడికి రావడం మానేశారు. కానీ ఛాత్రావాసం లో ఉన్న వారికి ఏమీ చేయలేని పరిస్థితి.

ఇంత లోనే వసతి గృహం లోని విద్యార్థులకు రహస్య సమాచారం అందినది . అది ఏమంటే ముస్లింలు హిందు విద్యార్ధులను తరమికొట్టడానికి ఆయుధాలతో దాడికి సిద్దం గా ఉన్నారని . దాంతో వాళ్ళు రాత్రి అంతా స్థిమితం గా నిద్ర పోలేక పోయారు. వాళ్ళకు ఎప్పుడు ఈ పరిసరాలను విడిచి పారిపోవలసిన స్థితి వస్తుందో అనే ఆందోళన కలిగింది. ముందు రోజు అంతా మామూలు గానే జరిగినది కానీ 8 ఆగష్టున హిందూ విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఉండటానికి మానసికం గా సిద్ధం గా లేరు. అందుకని వారందరూ ఒకే మాట మీద ఉండి ఉ. 6 గంటలకు నిశ్శబ్దంగా నిర్మానుష్యం గా ఉన్న వేళ అక్కడి నుండి దాక్కుంటూ బయలుదేరారు.

ముంబై లో దాదర్ లోని ‘సావర్కర్ సదన్’ లో అందరూ చాలా హడావిడిగా ఉన్నారు ఎందుకంటే సావర్కర్ గారు మొదటిసారి విమానం లో కొద్దిరోజులకోసం దిల్లీ కి ప్రయాణం కానున్నారు. కానీ సావర్కర్ కి ఏ రకమైన ఉత్సాహం లేదు సరికదా మనసులో చాలా బాధగా వుంది. వారి బాధకి కారణం – ఆయనకి దేశాన్ని ముక్కలుగా విభజించడం ఇష్టం లేదు. దానికి వారు తన జీవితాన్నే అర్పించారు. కానీ కాంగ్రెస్ అసమర్ధత, చేతగాని, బలహీన నాయకత్వమే దేశ విభజనకు కారణం అయ్యింది. సావర్కర్ చాలా బాధపడుతున్నారు. పూర్వ,పశ్చిమ భారతదేశం నుండి హిందువుల మరియు సిక్కుల మరణహొమం, లక్షలలో హిందువుల పునరావాసం, ఇవన్నీ వారికి చాలా భయంకరమైన విషయాలుగా అనిపించాయి.

పై విషయాలను చర్చించడానికి దిల్లి లో హిందూ మహాసభ సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రముఖ హిందూ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు ఈ సమావేశం లో మంచి తీర్మానాలు జరుగుతున్నాయ్ అని సావర్కర్ గారి ఆలోచన. వారి విమానం ఉ. 11 గంటలకు దాదర్ నుండి జూహు దగ్గరే కావున వారి ప్రయాణానికి ఇంకా కొంచం సమయం ఉంది.

అకోలా నిజామ్ పాలన హద్దుకు చేరువలో విదర్భకు ఒక పెద్ద పట్టణం అక్కడ పత్తి గిడ్డంగులు. పత్తి పంటవల్ల ధనికులు ఎక్కువగా ఉన్న ఊరు అది. ఆ ఊరిలో అందరూ కంగారుగా ఉన్నారు. దేశానికి ఒక వారం రోజులలో స్వాతంత్రం రానుంది కానీ – ఈ మరాఠిల స్థితి గతులు ఎలా వుంటాయో ? మరాఠీల ప్రదేశం లేదా ప్రాంతం ఎలా ఉంటుంది ? వంటి విషయాలను చర్చించడానికి అలానే నిర్ణయించడానికి పశ్చిమ మహారాష్ట్ర మరియు విదర్భలోని పెద్ద పెద్ద నాయకులు సమావేశం కానున్నారు. మరాఠీల విషయం గురించి ధనుంజయ రావు గాడ్గిల్ గారి సూచనలు నిన్నటి నుండి చర్చిస్తున్నారు. స్థానిక నేతలు పంజాబ్ రావు దేశ్ ముఖ్, బృజలాల్ బియాని, శేష్ రావు వాద్ ఖేడే, బాపూజీ ఆణే తో పాటు ఇంకా శంకర్ రావ్ దేవ్, పండరీనాథ్ పాటిల్, పూనంచంద్ రాంకా, శ్రీమన్నారాయణ్ అగ్రవాల్, రామ్ రావ్ దేశ్ ముఖ్, దా.వి గోఖలే, గోపాల్ రావ్ ఖేడ్కర్, ద.వా పాతార్, ప్రమీల తాయి ఓక్ వంటి నాయకులు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ రకంగా మరాఠీల భవితవ్యం నిర్ణయించడానికి మొత్తం 16 మంది నాయకులు అకోలా లో సమావేశం అయ్యారు. నిన్న చర్చ చాలానే జరిగింది. విధర్భ వాళ్ళకి ప్రత్యేక విధర్భ కావాలి ,కానీ పశ్చిమ మహారాష్ట్ర నాయకుల కి సంయుక్త మహారాష్ట్రనే కోరుకుంటున్నారు .ఇన్ని విభిన్నమైన ఆలోచనల్లో౦చి ఏకగ్రీవంగా అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని ఆశ.

లక్నో శాసనసభా భవనం – సమయం – మధ్య. 12 గం||..

సంయుక్త ప్రాంత శాసనసభ సమావేశం జరుగుతుంది సం|| గోవింద్ వల్లభ్ అధ్యక్షతన శాసనసభలో ఒక బిల్లును ప్రవేశ పెడుతున్నారు. ఆయన బాధ ఆర్తితో అంటున్న మాటలు – బ్రిటిష్ వాళ్ళు గత 150 సం|| లుగా మన సంస్కృతి తోపాటు మన నదులు,పల్లెల పేర్లు కూడా భ్రష్టు పట్టించారు. కావున స్వాతంత్రం తో పాటే మనం ఈ మార్చబడిన నదులు మరియు గ్రామాల పేర్లు కూడా మార్చుకోవలెను. ఉదా- బ్రిటిష్ వాళ్ళు గంగను గాంజెస్, యమునను జమునా, మధురను ముత్తరా అని. బ్రిటీష్ పాలనలో ఏ ఏ పేర్లు మార్చబడినాయో వాటి జాబితా కూడా విడుదల చేయబడింది. ఇకముందు అన్నీ ప్రభుత్వ కార్యకలాపాల్లో వాటి మూల పేర్లనే వాడతారు.

ఈ తీర్మానాన్ని సభలో అందరూ బల్ల తట్టిమరీ స్వాగతించారు. బానిసత్వ గుర్తులను తుడిపి వేసే పనిని శాసన సభ ప్రారంభించింది.

ఈ హడావిడి లో ఒక చిన్న ముఖ్యమైన సంఘటన చోటు చేసుకుంటోంది అది ఏమనగా – మహారాష్ట్రలోని కోంకణ్ ప్రాంతం లోని రత్నగిరి జిల్లాలో సంగమేశ్వర్ దగ్గర ‘లేరమే’ అనే గ్రామం లో ఒక మరాఠీ బడి ప్రారంభం కానుంది. సమయం ఉ 11 గం||కు గ్రామస్తులు సరస్వతి దేవి పటానికి పూల దండ వేసి ఈ పాఠశాల ను ప్రారంభించారు.

స్థలం – ఢిల్లీ సమయం మ. 12 గం|| కు ఆగష్టు నెల అయినా మండే ఎండలు ,వైస్ రాయ్ హౌస్ ఎదుట పెద్ద వాకిలి లో జోధ్ పూర్ సంస్థానానికి చెందిన ఒక విలాస వంతమైన నల్ల కారు వచ్చి ఆగినది. ఆ కారులో వచ్చిన ఆయన కదంబీ శేషాచారి వెంకటాచారి .ఆయన కోసం దర్బారు వచ్చి కారు తలుపు తీస్తాడు. వెంకటాచారి గారు జోధ్ పూర్ దీవానానికి దీవాన్ లేదా ప్రధాన మంత్రి.

సి. యస్. వెంకటాచారి గారి మాతృభాష కన్నడం. ఈయన ఒక ఇండియన్ సివిల్ సర్వెంట్. జోధ్ పూర్ సంస్థానానికి చెందిన ముఖ్యమైన నిర్ణయాలు వీరి సలహా తోనే తీసుకోవడం జరుగుతుంది. అందుకే లోర్డ్ మౌంట్ బెటన్ 400 ఎకరాల విశాలమైన రాజప్రాసాదం లో వెంకటాచారి గారిని విందుకు పిలిచాడు. భోజనం రాచ మర్యాదలతో జరుగుతుంది. జోధ్ పూర్ లాంటి విశాలమైన సంపన్నమైన సంస్థానం ఎప్పుడూ బ్రిటిష్ వారిని సమర్ధించింది. అందుకే ఆ సంస్థానానికి ప్రతినిధి గా వెంకటాచారి గారికి ఈ గౌరవం. జోధ్ పూర్ సంస్థానాన్ని భారత దేశం లో విలీనం చెయ్యడమే ,మౌంట్ బెటన్ వెంకటాచారి కి ఆతిధ్యం ఇవ్వడం వెనక ఉద్దేశం.

భారతదేశం నుండి వెళ్లిపోయేటప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు పరిష్కరించాలి. భోజనానంతరం కొన్ని రాజకీయ విషయాల పై చర్చించారు అందులో వెంకటాచారి గారు జోధ్ పూర్ సంస్థానాన్ని భారతదేశం లో విలీనం చెయ్యడానికి సుముఖంగా ఉన్నట్టు తెలిపారు.

ఈ విషయం బ్రిటన్ మరియు భారతదేశానికి కూడా చాలా శుభ సూచకం .గత కొంత కాలంగా జిన్నా జోధ్ పూర్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపమని చాలా రకాలుగా ప్రలోభ పెడుతున్నాడు. భోపాల్ నవాబు మరియు ఆయన సలహాదారుడు జఫ్ఫరుల్లా ఖాన్, ఇద్దరు జోధ్ పూర్, కఛ్, ఉదయ్ పూర్ మరియు బడోద, సంస్థానాల మహారాజులను కలిసి పాకిస్తాన్ లో కలపడం వల్ల వచ్చే లాభాలను తెలిపాడు. జిన్నా భోపాల్ నవాబు ద్వారా జోధ్ పూర్ మహారాజుకి తెలిపిన విషయం ఏమంటే వాళ్ళు కనుక ఆగష్టు 15 లోగా వాళ్ళ సంస్థానానికి స్వాతంత్రం ప్రకటించినా వాళ్ళకి ఈ సదుపాయాలు కలుగజేస్తాము –

కరాచీ ఓడ రేవు లోని అన్నీ సదుపాయాలపై జోధ్ పూర్ కి హక్కు వుంటుంది.

జోధ్ పూర్ కి పాకిస్తాన్ ఆయుధాలు పంపుతుంది.

జోధ్ పూర్ – హైదరాబాద్{సింధ్} రైలు మార్గం పై జోధ్ పూర్ కే హక్కు వుంటుంది.

జోధ్ పూర్ లో కరువు వస్తే పాకిస్తాన్ ఆహారాన్ని సరఫరా చేస్తుంది.

పై ఒప్పందాలు ఒట్టివేనని జోధ్ పూర్ సంస్థానం మేధావి వెంకటాచారి కి అర్ధమైయ్యింది. అందువలన వారే స్వయంగా భారతదేశం లో కలవడం వలన కలిగే ప్రయోజనాన్ని జోధ్ పూర్ మహారాజాగారికి తెలిపి సమస్యకి పరిష్కారం చూపించారు.

హైదరాబాద్ దక్కన్ – నిజాంల రాజధాని హైదరాబాద్ – ఉదయం నుండే ఊళ్ళో వాతావరణం అంతా గంభీరం గా వుంది. ఉదయాన్నే 300 మంది హిందూ విధ్యార్ధులు ఉస్మానియా విశ్వవిద్యాలయ వసతి గృహాలను విడిచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయారు. ఈ విషయం పై రజాకార్లు కోపంగా ఉన్నారు. దాని తిరుగుబాటు చర్యగా వాళ్ళు నగరం లో ఉన్న అందరు హిందూ వ్యాపారుల పై దాడులు చయ్యడం ప్రారంభించారు. వరంగల్ నుంచి వచ్చిన వార్తలు ఇంకా చింతలు రేపాయి. మొత్తం వరంగల్ జిల్లా లో అన్నీ హిందూ నాయకుల ఇళ్ల పై ముస్లిం గూండాలు రాళ్ళు విసిరారు. హిందువుల దుకాణాలు, ఇళ్ళు దోపిడీకి అగ్నికి గురి అయినాయి. ఈ ఘటన పై విచారించడానికి హైదరాబాద్ లో మధ్యాహ్నం ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో నగరం లోని పలువురు హిందూ వ్యాపారస్థులు సమావేశం ఏర్పాటు చేశారు. వారు వైస్ రాయ్ లార్డ్ మౌంట్ బెటన్ , నెహ్రూ కి ఒక సుదీర్ఘమైన టెలిగ్రామ్ ని తయారు చేశారు –

భారతదేశానికి నడిబొడ్డున ఉన్న నిజాం సంస్థానం లోని హిందువులకు రక్షణ లేదు వారిని ఆదుకునే నాధుడూ లేడు.

తాత్యారావ్ సావర్కర్ ది ఇది తొలి విమాన యానం ,వారితో మరో 4 హిందూ మహాసభ కార్యకర్తలూ ఉన్నారు. వారి విమానం ఢిల్లీ లో వెలింగ్టన్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.30 ని||కు చేరింది. అక్కడ హిందూ మహాసభ అసంఖ్యాక కార్యకర్తలు “వీర సావర్కర్ అమర్ రహే” “వందేమాతరం” అని గట్టిగా ఉత్సాహంగా నినాదాలు చేసి విమానాశ్రయాన్ని హోరెత్తించారు. కార్యకర్తల నుండి పూల మాలలు స్వీకరిస్తూ వారు బయటకు వచ్చేశారు. వారు వారికి కేటాయించిన కారు లో కూర్చుంటే మిగిలిన కార్యకర్తలు వేరే కర్లల్లో, మోటర్ సైకల్ మీద ఊరేగింపుగా దేవాలయ వీధులలో ఉన్న “ హిందూ మహాసభ భవన్” కు బయలుదేరారు.

భారతదేశం లో సమయం మ|| 3 గం|| లండన్ లో ఉదయం 10.30 ని|| , లండన్ మధ్యభాగం లో ఉన్న షెఫర్డ్ బుష్ గురుద్వారా లోసిక్కుల నాయకులు సమావేశం అయ్యారు. ఇంగ్లాండ్ లో ఉన్న సిక్కుల సముదాయం వారు భారత దేశం లో జరుగుతున్న హింసా పూర్వకమైన ఘటనలు పై చాలా ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ పంజాబ్ లో ఒక బంధువు చెల్లిని ఒక ముస్లిం గూండా ఎత్తుకు పోయారు మరోవైపు వేరోక బంధువుని నడిరోడ్డు పై పట్టపగలు నరికేశారు. దేశ విభజన సరిహద్దులపై ఇంకా స్పష్టత రాలేదు ఎవరు ఎక్కడ ఉండాలో తెలియని స్థితి. పంజాబ్ విభజన బాధ ఇంగ్లాండ్ లోని సిక్కులను పీడిస్తోంది.

దీని కోసం మొత్తం పంజాబ్ ని భారత దేశం లో కలిపేయ్యడమే ఏకైక మార్గం అలాగే ,సిక్కులు – ముస్లిం జనాభాని ఎక్కడి వారిని అక్కడ సర్దుబాటు చెయ్యడం. కానీ గాంధీ – నెహ్రూ ఈ విషయం పై చాలా పట్టుదల తో ఉన్నారు. నెహ్రూ సిక్కులను “బార్డర్ కమీషన్” ని విశ్వసించమని కోరారు. వీరిద్దరి మాటలు ఇంగ్లాండ్ లో ఉన్న సిక్కులకు ఆగ్రహం కలిగించాయి. అందువలన ఈ రోజు సిక్కు నాయకులు లండన్ లో ఉన్న గురుద్వారా కి వచ్చి 10, డౌనింగ్ స్ట్రీట్ లో ఉన్న ప్రధానమంత్రి ఎటిల్లి కి ఒక వినతి పత్రాన్ని ఇవ్వ బోతున్నారు – పంజాబ్ ను విభజించకుండా మొత్తం పంజాబ్ ని భారతదేశం లో విలీనం చెయ్యండి –

లండన్ లోనూ వేసవి చాలా తీవ్రం గా ఉంది సరిగ్గా ఉ|| 11.30 ని|| కు సిక్కు నాయకుల ప్రతినిధులు ప్రధానమంత్రి ఎటలీ ని కలవడానికి ఆయన నివాసానికి బయలుదేరారు పంజాబ్ లో ఆగ్నేయంగ ఉన్న ప్రాంతాలు శ్రావణ మాస ప్రభావం లేకుండా తీవ్రమైన వేడిగా ఉన్నాయి చెదురు- మదురు చినుకు తప్ప వర్షం జాడ లేదు.

ఫిరోజ్ పూర్, ఫరీద్ కోట్, ముక్తనర్,భటిండా, మోగా – ఈ ప్రాంతం లో భూమి అంతా బీటలు విచ్చి ఉంది బావులలో నీరు ఎండి పోయింది. చెట్లు ఎండిపోయాయి. పశువులు – పక్షులు ప్రాణాలు వీడి పోతున్నాయి. ఈ కష్టాలకు తోడుగా వాయువ్య పంజాబ్ ప్రాంతం నుంచి హిందూ – సిక్కు శరణార్ధులు గుంపులు- గుంపులుగా నిరంతరం రోజూ వస్తున్నారు. వారు వారి ధన మాన బాంధవ్యాలను అన్నిటిని పోగొట్టుకొని గుంపులు – గుంపులుగా వస్తున్నారు.

ఎవరి పరపాటు వల్ల ఇదంతా జరుగుతుంది ?
వీరసావర్కర్ ముంబై నుండి ఢిల్లీ విమానం లో వెళ్తున్నప్పుడు ,హైదరాబాద్ లో నిజాం అలాగే వరంగల్ లో రజాకార్ల వేధింపులు జరుగుతున్నప్పుడు ఢిల్లీ లో వైస్ రాయ్ హౌస్ లో జోధ్ పూర్ దీవాన్ , మౌంట్ బాటన్ మధ్య భోజనం చర్చ ముగింపు సమయం. మరోవైపు పాట్నా విశ్వవిద్యాలయ సభాగృహం లో గాంధీ గారు విద్యార్ధులతో సంభాషణ జరుపుతున్నారు విద్యార్ధులు దాడి చేసేందుకు సిద్దం గా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు విద్యార్ధులను శంతిపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఉదయం ప్రార్ధనలో గాంధీ గారు చెప్పిన మాట వాళ్ళు మళ్ళీ నెమ్మదిగా విద్యార్ధులకు చెప్తున్నారు – “ 15 ఆగష్టు అంటే స్వాతంత్ర దినం ఉపవాసం ఉండి జరపాలి రాట్నం పై నూలు ఒలకాలి, కళాశాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలి. దక్షిణ ఆఫ్రికా లో తెల్లవాళ్లు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు అక్కడ భారతీయులని ద్వేషిస్తున్నారు అందువలన మనం అంతర్జాతీయస్థాయి లో వ్యతిరేకించాలి.”

గాంధీగారు భారత పాకిస్తాన్ విభజన కి సంబందించిన విషయం పై ప్రవచనం ఇస్తారు అనే ఆశ తో విధ్యార్ధులు అక్కడ సమావేశం అయ్యారు కానీ వారికి నిరాశే మిగిలింది.

కలకత్తా లో భయంకరమైన ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని ఆదోంళనలనేకంటే మారణహోమం అంటే సరిపోతుంది. ఎందుకంటే దాడులు ఏకపక్షమే వారికి ఎదురు తిరిగేవారేలేరు. హిందువుల ప్రాంతాలలో ముస్లిం గూండాలు దారుణమైన దాడులు జరుపుతున్నారు. అక్కడి హిందువులకు దాదాపు ఒక సంవత్సరం క్రితం 14 ఆగష్టు 1946 “డైరెక్ట్ యాక్షన్ డే” నాటి చేదు అనుభవాలు వేధిస్తున్నాయి. ఆ రోజు ముస్లిం లీగ్ గూండాలు కలకత్తా నడి రోడ్లపై హిందువులను దారుణం గా చంపేశారు.

ఇప్పుడు ఒక ఏడాది తరవాత మళ్ళీ అదే పరిస్థితి వచ్చినట్టు అనిపిస్తుంది. పాత కలకత్తా ప్రాంతం లో హిందువుల దుకాణాలను దోచుకోవడానికి అలాగే చంపడానికి వచ్చిన ముస్లిం గుండాలను ఆపడానికి పోలీసు అధికారులు ఒక రక్షణ గోడను కట్టారు కానీ పోలీసు అధికారులపైనా బాంబుదాడులు జరుపుతున్నారు. డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎస్.ఎచ్. ఘోష్, చౌధరి మరియు ఎఫ్.ఏం. జర్మన్ వంటి ముగ్గురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా కొన ఊపిరి తో ఉన్నారు. పాత కలకత్తా లో మధ్యాహ్నమే 6 గురు హిందువులు చనిపోగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బెంగాల్ ప్రముఖ పాలకుడు సహారా వర్దీ పాలనలో ముస్లిం ఆందోళన కారులను అదుపు లోకి తీసుకొక పోగా వారిని సత్కరిస్తారేమో అని సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ చక్రవర్తి రాజగోపాలచారి గారు కూడా ఈ విషయం పై ఏమైనా చర్య తీసుకుంటారా లేదా అనేది అనుమానమే.

8 ఆగష్టు సూర్యాస్తమయ సమయం – కలకత్తా అంతా అట్టుడికిపోతుంది హైదరాబాద్, వరంగల్ మరియు నిజాం పాలనలో ఉన్న గ్రామాలలో హిందువుల ఇళ్ళు దుకాణాల పై ముస్లిం గూండాలు దాడులు జరుపుతూనే ఉన్నారు. మరో వైపు ఢిల్లీ లో హిందూ మహాసభ భవనం లో దేశం మొత్తం నుండి నాయకులు సావర్కర్ తో సలహాలు సంప్రదింపులు జరుపుతున్నారు, ఇప్పుడే తాత్య రావ్ పండిత్,మదన్ మోహన్ మాలవీయ మధ్య జరిగిన సుదీర్ఘమైన సమావేశం ముగిసింది.

మరో పక్క అటు పూర్వ దిశ మహారాష్ట్ర లోని అకోలా పట్టణం లో విదర్భ పశ్చిమ మహారాష్ట్ర నాయకుల మధ్య “అకోలా ఒప్పందం” కుదిరింది ఒప్పందం ప్రకారం ఉమ్మడి మహారాష్ట్ర రెండు ప్రాంతాలుగా ఉంటాయి – 1. పశ్చిమ మహారాష్ట్ర 2. మహా విదర్భ. ఈ రెండిటికి వేరు వేరు శాసనసభ. మంత్రి మండలి, హై కోర్ట్ ఉంటాయి కానీ మొత్తం ప్రాంతానికి ఒకరే గవర్నర్, ఒకటే సర్విస్ కమీషన్ ఉంటుందని నిర్ణయించారు. అందువల్ల చీకటి పడుతున్న కొద్ది అకోలా లో మరాఠీ ల నాయకత్వం ఆతిధ్యం ఇవ్వడానికి సిద్ధపడుతోంది.

కరాచీ లో తన తాత్కాలిక నివాసం లో బారిస్టర్ మహమ్మద్ అలీ జిన్నా 11 ఆగష్టున పాకిస్తాన్ పార్లమెంట్ లో తను ఇవ్వబోయే ఉపన్యాసానికి తయారు అయినారు. ఇక వారు నిద్రించుతారు. గాంధీ గారు కలకత్తా కి బయలుదేరారు. బయట కొద్దిగా వర్షం పడుతుంది. గాంధీగారు ఎక్కిన బోగీ ఒకటి రెండు చోట్ల కారుతోంది. రైలుకిటికీ లోనుండి వస్తున్న గాలికి చలివేస్తుంది అందుకని మను కిటికీ మూసేసింది.

ఢిల్లి వైస్ రాయ్ గ్రంథాలయంలో ఇంకా దీపాలు వెలుగుతున్నాయి. మౌంట్ బెటెన్ తన సువిశాలమైన టేబుల్ మీద ఈరోజు మొత్తం రిపోర్ట్. లండన్ లో భారత సెక్రెటరీ కొరకు రాస్తున్నారు ఈ రోజు సమయం లేక డిక్టేషన్ ఇవ్వలేదు రేపు సెక్రెటరీ ఈ రిపోర్ట్ ని టైప్ చేసి లండన్ పంపుతాడు.

8 ఆగష్టు శుక్రవారం రోజు గడిచిపోవస్తుంది. ఈ అఖండ భారతదేశం లోని పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంకా మేల్కొనే ఉన్నారు. సింధ్, పెషావర్ పర్వత ప్రాంతాలు, పంజాబ్,బెంగాల్ మరియు నిజాం ప్రాంతం లోని లక్షల మంది హిందువులకి నిద్ర కరువైనది. సరిగ్గా వచ్చే శుక్రవారం ఈ అఖండ భారతదేశం 3 ముక్కలు కానుంది 2 దేశాలు ఏర్పాటు కానున్నాయి.

క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:

7 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
5 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
4గస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?
1 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

This article was first published in 2019