Home News సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

0
SHARE

డా భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి వేడుకలు సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో జహీరాబాద్ మరియు ఖమ్మం జిల్లా కొత్తూర్, ద్వంసలాపూర్ గ్రామాలలో ఘనంగా జరిగాయి.

శ్రీ రామ నవమి మరియు అంబేడ్కర్ జయంతి ఈ సంవత్సరం 14 నాడు యాదృచ్ఛికంగా ఒకే రోజు రావటం,అలాగే ఇద్దరి జీవితాల్లో సమరసతా భావాలు వెల్లివిరియటం కూడా యాదృచ్ఛికమే. ముఖ్య అతిథిగా విచ్చెసిన బర్డీపూర్ ఆశ్రమ స్వామీజీ సిద్దెశ్వర భారతి మాట్లాడుతూ ‘డా అంబేడ్కర్ తన తల్లిదండ్రుల ద్వారా అందిన ఆధ్యాత్మిక భావాలతో ఉన్నత వ్యక్తిత్వాన్ని సాధించాడని’ పెర్కొన్నారు.

ఎస్ సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు కర్న శ్రీ శైలం ప్రసంగిస్తూ ‘ హిందువులలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో వుంచి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తే, మతం మారి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు ఆ రిజర్వేషను ఫలాలు దోచుకుంటునందువల్లే అంబేద్కర్ ఆశించిన లక్ష్యం నెరవేరటం లేదన్నారు.

సమరసతా రాష్ట్ర అధ్యక్షులు డా వంశ తిలక్ తన ప్రసంగంలో కమ్యునిష్టులు దళిత ముసుగు ధరించి అంబేడ్కరిస్టులు గా అవతారం ఎత్తి ఎస్ సి లను మోసగిస్తూన్నారని, అయితే అంబేడ్కర్ తన జీవితంలో కమ్యునిష్టులను ఎప్పుడూ నమ్మలేదని ,పందుల్లా పొట్ట మెపటం కాదు, ధార్మిక విలువల ద్వారా మనసును వికసింప చేసుకోవాలని అంబేడ్కర్ ఆశించారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ డా అంబేద్కర్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని కోరారు. అప్పాల ప్రసాద్ ప్రసంగిస్తూ డా. అంబేడ్కర్ ఒక హిందూ ప్రొటెస్టెంట్ నాయకుడని, హిందూ సాంఘిక వ్యవస్ట లోని చెత్త ను ఊడ్చి, మానసిక విప్లవం ద్వారా స్వచ్చమైన హిందూ సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప మహనీయుడని, ఆర్యులు బయట నుండి రాలేదని,ఆర్య శబ్దం గుణ వాచకమని,జాతి వాచకం కాదనే విషయం వేదాలు చదివితే తెలిసిందని, పురాణ ఇతిహాసాలలొ ఎక్కడా అంటరానితనం లేదని,మధ్యలో ఒక వెయ్యి సంవత్సరాల నుండి వచ్చిన దురాచారమని,అది తొలగడానికి అంబేడ్కర్ తన జీవితాన్ని అంకితం చేసారని, స్వేచ్చ,సమానత,సోదర భావాల ద్వారానే భారతీయులు ఏకత్వం తో కలిసి జీవించ గలరని భావించి రాజ్యాంగంలో సమత ను చట్టబద్దం చేసిన మహనీయుడని పేర్కొన్నారు.

న్యాయవాది గోపాల్, భాజాపా నాయకులు జగన్ పాల్గొన్నారు. జహీరాబాద్,మొగడం పల్లి,కోహిర్,న్యాల్కల్ మండలాల లోని 40 గ్రామాల నుండి 400మంది హాజరయ్యారు. ప్రారంభం లో మాచునుర్ గ్రామ యువకులచే కోలాట ప్రదర్సన జరిగింది.

ఖమ్మం జిల్లా కొత్తూర్ గ్రామం లో జరిగిన కార్యక్రమానికి కుటుంబ సమెతంగా 350 మంది పాల్గొన్నారు.

ఖమ్మం లో జరిగిన కార్యక్రమం