Home News అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ అరెస్టు

అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ అరెస్టు

0
SHARE

లాహోర్‌: అంతర్జాతీయ ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్‌ సయీద్‌ అరెస్టయ్యాడు. లాహోర్‌ నగరంలో హఫీజ్ సయీద్‌ను పంజాబ్(పాకిస్థాన్) తీవ్రవాద కార్యకలాపాల నిరోధక శాఖకు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి అతడిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు హఫీజ్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు పాక్‌ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందించే విషయమై ఇటీవల పాక్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ దేశం హఫీజ్ సయీద్‌తో పాటు అతడి అనుచరులపై 23 కేసులు నమోదు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఐదు ట్రస్టుల ద్వారా నిధులు సేకరించినట్లు ఆరోపణలు రావడంతో వీరిపై కేసులు నమోదు చేశారు.

లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా కొనసాగుతున్న జమాత్‌ ఉద్‌ దవా ఆధ్వర్యంలోని ఉగ్రవాదులు 2008 నవంబరులో ముంబయిలో మారణహోమం సృష్టించారు. ఈ ఉగ్రవాద దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి హఫీస్‌ జయీద్‌ సూత్రధారి. దీంతో ఐక్యరాజ్యసమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఉగ్రవాదసంస్థను కూడా నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. హఫీజ్ సయీద్ మీద సయీద్‌పై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించింది.

Source: Eenadu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here