Home News ఆర్మీ చీఫ్‌ రాజకీయాలు మాట్లాడలేదు

ఆర్మీ చీఫ్‌ రాజకీయాలు మాట్లాడలేదు

0
SHARE

ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాటల్లో రాజకీయాలు, మతపరమైన ఉద్దేశాలు లేవని ఆర్మీ స్పష్టం చేసింది. జనరల్ బిపిన్ రావత్ కేవలం ఈశాన్య భారతదేశంలో జనాభా సమ్మేళనం, అభివృద్ది గురించి మాత్రమే మాట్లాడారని పేర్కొంది.

ఢిల్లీలో డీఆర్‌డీఓ భవన్‌లో బుధవారం జరిగిన ఓ సెమినార్‌లో జనరల్ బిపిన్ రావత్ మాట్లాడారు. పాకిస్థాన్ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోందని ఆరోపించారు. అస్సాంలోని చాలా జిల్లాల్లో ముస్లిం జనాభా పెరుగుతోందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు ముస్లింలు అక్రమంగా వలసలు వస్తున్నారన్నారు. ఇదంతా పాకిస్థాన్ ఆడుతున్న క్రీడ అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చైనా మద్దతిస్తోందని తెలిపారు. ఈ ప్రాంతంలో అలజడి సృష్టించడానికే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు.

అస్సాంలోని చాలా జిల్లాల్లో అక్రమ ముస్లిం వలసదారులు వస్తున్నారని, వీరి కారణంగా బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ముస్లిం రాజకీయ పార్టీ ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ బలం పుంజుకుంటోందని, బీజేపీ కన్నా వేగంగా ఈ పార్టీ ఎదుగుతోందని అన్నారు.

‘‘ఏఐయూడీఎఫ్ అనే పార్టీ ఉంది. దీన్ని పరిశీలిస్తే, బీజేపీ ఇన్నేళ్ళలో ఎదిగినదాని కన్నా ఎక్కువగా ఈ పార్టీ ఎదుగుతోంది’’ అని జనరల్ బిపిన్ రావత్ అన్నారు.

ఈ వ్యాఖ్యల్లో రాజకీయాలు, మతపరమైన ఉద్దేశాలేవీ లేవని ఇండియన్ ఆర్మీ గురువారం ప్రకటించింది.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)