Home Telugu Articles ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం – గోరక్షణ కోసం సాధువుల అపూర్వ బలిదానం

ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం – గోరక్షణ కోసం సాధువుల అపూర్వ బలిదానం

0
SHARE

7 నవంబర్ 1966, కార్తీక శుక్ల అష్టమి, గోపాష్టమీ రోజు ఢిల్లీలో పార్లమెంటు భవనం సాక్షిగా, నిరాయుధులైన, పూజింప తగిన హిందూ సాధువులపై, గోమాత భక్తులైన హిందువుల పై కాల్పులు జరిపింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం. భాష్పవాయు ప్రయోగం, లాఠీఛార్జి అనేక రకాలైన దాడి జరిపింది. ప్రత్యక్ష సాక్షులు, ఆ క్రూరమైన దాడికి గురైనవారి  లెక్క ప్రకారం 5000 మందిదాకా మరణించినట్టు అంచనా. కానీ ప్రభుత్వ మాత్రం 250 నుంచి 375 మంది మరణించారని చెప్పింది. ఈ పోలీసు చర్య తరువాత అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న గోభక్తుల దేహలను చీకట్లో అమానుషంగా లారీల్లో వేసి ఊరి చివర పడేసి వచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కొన ఊపిరితో ఎవరైనా ఉన్నారేమోనని కూడా చూడలేదు. ఇంత నరమేధం ఎందుకు జరిగింది, ఆ సాధువులు చేసిన అంత “పెద్ద” నేరం ఏమిటీ అంటే ” గోవధ నిరోధక చట్టం” కోసం శాంతియుతంగా నిరసన తెల్పటం.

హిందూ ధర్మం లోగోమాతప్రాముఖ్యత

ప్రాచీన కాలం నుంచి హిందూ సమాజంలో “గోమాత” ఒక ఆరాధ్య దైవం. హిందూ సమాజం ఆవును ఒక జంతువుగా ఎప్పుడూ పరిగణించలేదు. ముప్పై మూడు కోట్ల హిందూ దేవుళ్ళు కొలువుండే ఒక పవిత్ర ప్రాణి గానే కొలిచారు.  ఒక్క గోపూజ, గోసేవ ద్వారా సకల పుణ్యాలు కలుగుతాయని మోక్షం పొందవచ్చని హిందూవుల  విశ్వాసం.  పవిత్ర వేదాలు, స్మ్రతులు, పురాణాలలో ఈ విషయం విస్పష్టం గా చెప్పబడింది. మొదటి జైన తీర్థంకరుడు ఆదినాధుని ‘వృషభ’ అని కీర్తించటం కూడా గమనార్హం. హిందూ జీవన విధానంలో గోమాతను విడదీయలేం.  అనాది కాలం నుండీ హిందూ సమాజంలో గోరక్షణ అతి ముఖ్యమైన సామాజిక బాధ్యత. చరిత్ర పురుషుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కౌమార వయస్సులోనే గోమాతను ఈడ్చుకు వెళ్తున్న కసాయి సాయిబు చేతులు నరికేశారు. ఆయన అడుగు జాడల్లోనే ఆయన కుమారుడు శంభాజి కూడా 1683 లో గోమాతను చంపిన ఒక కసాయి సాయిబుకు మరణశిక్ష అమలుపరిచారు. ఇక మన రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలు, పరిపాలనా విధాన సూత్రాలలోను గోసంరక్షణ కు తగిన ప్రాధాన్యత ఇచ్చారు.

ఉదారవాదుల నీచబుద్ధి

భారతీయ హిందూ సమాజంలో, రాజ్యాంగంలో గోమాతకు ఇంత విలువ ఇచ్చినా ఇక్కడ గోవులను, గోభక్తులను హేళనచేసి, నీచంగా చూడటం విచిత్రం. విదేశీయుడైన ఫుర్కాన్ ఖాన్ లాంటి వారు హిందూ సమాజాన్ని వెక్కిరించే విధంగా గోమూత్రం గురించి ఆవాకులు చవాకులు వాగగలిగాడు. మన దేశం లోనే IPS ఆఫీసర్ గా బాధ్యతాయుత పదవిలో ఉన్న అస్లాం ఖాన్ గోమాతను, హిందూమతాన్ని దుర్భాషలాడి స్వేచ్ఛ గా తిరుగుతున్నాడు.

జాతీయ వాదులతో తర్కంలో ఓడి పోతున్నాము అనిపించిన ప్రతీసారీ ఈ `ఉదారవాదులు’  ‘గోమూత్రం’,    ‘ గోభక్తులు’  అనే  వ్యంగ్యాస్త్రాలను వదలడం  మొదలు పెడతారు. ఈ వ్యర్ధ , సంకుచిత వాదన ఇప్పటిది కాదు స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి నడుస్తున్నదే.

1966 హిందూ నరమేధం

53 సంవత్సరాల క్రితం హిందూ సమాజం మొత్తం రాజ్యాంగం లో ఇచ్చిన సంరక్షణ మేరకు ” గోవధ నిరోధక చట్టం” కావాలి అంటూ ఉద్యమించారు. శంకరాచార్యుల వంటి పీఠాచార్యుల ఉపవాస దీక్షకు కూడా ఉపక్రమించారు.  నిరసన పతాక స్థాయికి చేరింది. 1966 నవంబర్  7న పార్లమెంటు భవనం ముందు భారీ ప్రదర్శన జరిగింది.

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ” గోహత్యా నిషేదానికి” ఒప్పుకోలేదు. పది వేల మందికి పైగా ఉన్న సాధువులు, గోరక్షక హిందువులు పార్లమెంట్ లోపలకి ప్రవేశించటానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడమేకాక వారి పై ఎదురు దాడి జరిపారు. లాఠీలతో.  రాడ్లతో ఇష్టంవచ్చినట్లు చితకబాదారు.  భాష్పవాయువు ప్రయోగించారు.  తుపాకులతో కాల్పులు జరిపారు. ఎంతోమంది సాధువులు, సన్యాసులను పొట్టన పెట్టుకున్నారు.

శంకరాచార్య నిరంజనదేవతీర్థుల వారు, హరిహరానందుల వారు, కరపత్రీస్వామీజీ, మహాత్మా రామచంద్ర వీర్ మొదలైనవారు ఈ నరమేధానికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష  చేపట్టారు. దాదాపు 166 రోజుల పాటు ఆ దీక్ష కొనసాగింది. అప్పటి గృహమంత్రి,  యష్వంతరావ్ బల్వంతరావ్ చవాన్ ( 14 నవంబర్ 1966 నుండీ 27జూన్ 1970) పార్లమెంటు లో ” గోవధ నిరోధక చట్టం”  ప్రవేశ పెడతామని నమ్మబలికి దీక్షా విరమణ చేయించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడేకాదు ఆ తరువాత ఎప్పటికీ  సాధువులకిచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు.