Home News నకిలీ ధ్రువ పత్రాలతో పట్టుబడిన బంగ్లాదేశ్ జాతీయుడు

నకిలీ ధ్రువ పత్రాలతో పట్టుబడిన బంగ్లాదేశ్ జాతీయుడు

0
SHARE

అక్రమంగా భారత్‌లోకి చొరబడి,  హైదరాబాద్‌లో నివసిస్తూ  నకిలీ ఓటరు ఐడి, ఆధార్ కార్డు, సిమ్ కార్డును పొందిన బంగ్లాదేశ్ జాతీయుడు మొహద్ రఫీక్‌ను ఆదివారం హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ పత్రాలను పొందడానికి రఫీక్‌కు సహాయం చేసిన మీర్ మౌజామ్ అలీ ఖాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

బంగ్లాదేశ్‌లోని తుంబ్రూ బజార్‌కు చెందిన రఫీక్, భవాని నగర్‌ లోని ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడని,  అలాగే ఖాన్ మీ సేవా కేంద్రం ఉన్న జిరాక్స్ షాపులో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. తాను పనిచేసిన దుకాణం చిరునామాతో  ధ్రువ పత్రాలు పొందటానికి రఫీక్ కు, ఖాన్ సహాయం చేశాడు. అయితే హైదరాబాద్‌కు మారడానికి ముందు రఫీక్ ఢిల్లీలో నివసించాడని పోలీసులు వివరించారు.

source: TOI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here