Home News భారత విచ్చినకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – శ్రీ అరవింద రావు, మాజీ పోలీసు...

భారత విచ్చినకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – శ్రీ అరవింద రావు, మాజీ పోలీసు డిజిపి

0
SHARE

సాంస్కృతిక ఏకత్వ భావనతో ఉన్న భారత దేశాన్ని 1947 తరువాత మరొక్కసారి ముక్కలు చేయడానికి విదేశీ శక్తులు ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు, చైనా ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా క్రైస్తవ సంస్థలను ఆధారంగా చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేస్తున్న పుస్తకం బ్రేకింగ్ ఇండియా (Breaking India) అని, దీన్నీ ప్రతి ఒక్కరి చదివి దేశ వ్యతిరేక శక్తుల ఆగడాలను అడ్డుకోవాలని శ్రీ కె అరవింద రావు, మాజీ పోలీస్ డి జి పి, కోరారు.

 

ఒకటిన్నర రోజుల పాటు (నవంబర్ 3 & 4) భారతీయ సాహిత్య పరిషత్, ప్రజ్ఞ భారతి & సమాచార భారతి అద్వర్యంలో రాజీవ్ మోల్హోత్ర , అరవింద్ నిలకందన్ కలిసి రాసిన బ్రేకింగ్ ఇండియా పుస్తకం పై హైదరాబాద్ నగరంలోని కాచిగుడ లో ఉన్న భద్రుక కళాశాలలో జరిగిన కార్యశాలలో అరవింద రావు గారు ఒక ప్రధాన వక్తగా పాల్గొన్నారు.

నవంబర్ 3 సాయంత్రం ప్రారంబం అయిన ఈ కర్యశాలలో, 19 అద్యాయాలతో ఇంగ్లీష్ లో ఉన్న బ్రేకింగ్ ఇండియా పుస్తకంలోని మొదటి 4 అధ్యాయాలను అరవింద రావు గారు పరిచయం చేశారు. ఇందులో ఆర్య అనే పదాన్ని ఒక జాతి సమానార్ధకంగా దురేద్దేశ పూర్వకంగా మార్చడం, రాజకీయ సామ్రాజ్య, వలస వాడ రాజ్యాల విస్తరణకు, వాటిని బానిస దేశాలుగా మార్చడానికి క్రైస్తవ మతాన్ని అనుకూలంగా మలచుకోవడ లాంటి విషయల పై మాట్లాడారు.  మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న కాలంలోనే క్రైస్తవ సంస్థలు, చర్చ్ లు ఎలాంటి కుటిల బుద్ధితో మన సమాజంలోని బలహీనతలను పెంచిన విధానం. దేశాన్ని శాశ్విత వలస రాజ్యాంగ మార్చి, హిందువుల అస్తిత్వాన్ని పూర్తిగా ద్వంసం చేసి క్రైస్తవాన్ని నెలకొల్పడానికి  దేశ స్వతంత్రం తరువాత కూడా జరుగుతున్నాయి అని హెచ్చరిస్తూ, అలాంటి శత్రువులను గుర్తించి సమాజం తగు రీతిలో స్పందించాలని అరవింద రావు గారు కోరారు.

నవంబర్ 4 నాడు ఉదయం తిరిగి ప్రారంబం అయిన ఈ కార్యశాలలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రాకా సుధాకర్ రావు గారు బ్రేకింగ్ ఇండియా (Breaking India) పుస్తకంలోని 5,6,7,8,9, 10 అధ్యాయాలను పరిచయం చేశారు. వీటిలో ఉన్న జాతుల కల్పన, ముఖ్యంగా ద్రావిడ జాతి,  శ్రీలంకలోని ఎల్టిటి మిలిటెంట్ ద్రావిడ ఉద్యమాలు, తమిళనాడు ద్రావిడ రాజకీయాలు, వాటికి చర్చ్ కు  ఉన్న బహిరంగ, అంతర్గత సంబందాలు పై వివరించారు.  “ద్రావిడ” పదాన్ని స్థిరపరచడానికి తగిన సాహిత్యం రాయడం, చర్చ్ ద్వార ఆర్థిక సహాయ సహకారాలు పై సుధాకర్ రావు గారు మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో చర్చ్ ద్వార ఉద్దేశ పూర్వకంగా భౌగోళిక పరంగా వాడుకలో ఉన్న ద్రావిడ పదాన్ని ఒక జాతి పదంగా ఎలా మార్చి, ద్రావిడ రాజకీయాలను ఏ విధంగా సృష్టించారో వివరించారు. బ్రిటిష్ వాళ్ళు ప్రధానంగా చర్చ్ కేంద్రంగా చేసుకొని యునివర్సిటీలలో ఏకంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వాటిని యూరోప్, అమెరిక విశ్వ విద్యాలయాలతో సంబందాలు ఏర్పరుచుకోవడం. పరిశోధన అను ముసుగులో భారత్ దేశాన్ని విడగోట్టడానికి సమాజంలో కులం ఆధారంగా విభజించడానికి గత 200 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలు. వాటికి సహకరించిన క్రైస్తవ సంస్థలను, రాజకీయ శక్తులని ఈ పుస్తకంలో పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటికి మన సంస్కృతికి వ్యతిరేకంగా, హిందువుల ఆచార వ్యవహారాలను కించ పరచాలనే ఉద్దేశం తో పరిశోధనలు జరుగుతున్నాయని నేటి సమాజం  అలంటి దేశ వ్యతిరేక శక్తులను గుర్తించాలని సుధాకర్ రావు గారు కోరారు.

ప్రముఖ రచయిత శ్రీ భాస్కర యోగి  బ్రేకింగ్ ఇండియా పుస్తకంలోని 11, 12, 13 అద్యయలపై ప్రసింగించారు. వీటిలో పేర్కొన్న భారత  దేశం పై విదేశీయుల ద్రుష్టి, ఆఫ్రో దళిత ఉద్యమాలు, దళిత చైతన్యం, దళిత సాహిత్యం సృష్టి లాంటి అంశాలపై ప్రసంగించారు.

శ్రీ భాస్కర్ యోగి

మన దేశంలో దళితులు అనే పదాన్ని ఎలా సృష్టించారు అని, దాన్ని అందరు ఉపయోగించేలా ఏ విధంగా ప్రచారం చేశారు అని వివరించరు. హిందూ సమాజాన్ని విడగొట్టడానికి కొన్ని బలహీనతలను ఆసరా చేసుకొని మనుషుల మద్య చీలికలు ఏర్పరిచి, వాటిని బలపరచడానికి చర్చ్ కేంద్రంగా విసృతమైన సాహిత్యాన్ని రాసి , సామాన్య ప్రజలను గంధర గోళ పరిచారు. ఇలాంటి విచ్చిన్నకర సిద్దాంతాన్ని బల పరచడానికి, స్థిర పరచడానికి చర్చ్, క్రైస్తవ సంస్థలు, విదేశీ విశ్వవిద్యాలయాలు ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని కృత్రిమంగా కలిపించి నేటికి దానికి ప్రచారం కల్పిస్తున్నారు అని పుస్తకంలో పేర్కొన్న వివిధ అంశాలను వివరించారు. దాంతో పాటు సమాజంలో కులం ఆధారంగా సంస్థలను ఏర్పాటు చేసి, ఒక కులం వారికి ఇంకో కులం వారికి సంబంధాలు లేవు అని, ఒక వేల ఉన్నా అవి కేవలం ఆధిపత్య ధోరణి తో నని ఒక రకమైన అత్యాచార సాహిత్యాన్ని ఎలాంటి అంశాలని, వార్తలను ఆధారంగా చేసుకొని కల్పిస్తున్నారు అని విశదీకరించారు.

సమాచార భారతి కార్యదర్శి శ్రీ ఎన్ అయుష్ గారు బ్రేకింగ్ ఇండియా పుస్తకంలోని 14, 15 అద్యయలపై మాట్లాడారు. అందులో ప్రధానంగా ఉన్న వామపక్ష రాజకీయాలకు అమెరిక ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు. ఇస్లాం కేంద్రంగా ప్రపంచాన్ని పరిచయం చేయడం, ప్రత్యక్షంగా అమెరిక ప్రభుత్వం కనుసనుల్లో అక్కడి కేంద్ర నిఘా సంస్థలు భారత దేశంలోని చర్చ్, వివిధ స్వచ్చంద సంస్థల రూపంలో దేశ రాజకీయాలను, హిందువుల సంస్కృతిని ఒక ప్రణాళిక బద్ధంగా నిర్వీర్యం చేస్తూన్న సంఘటలను, వాటి వెనుక ఉన్న విదేశీయులను వారు చేస్తున్న కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రదర్శన ద్వార సూక్ష్మంగా వివరించారు. క్రైస్తవ మత ప్రచారానికి  విద్య ముసుగులో విద్యార్థుల్లో దేశ వ్యతిరేక ఆలోచనలు, కార్యకలాపాలు నిర్వహించడం గురుంచి విస్తృతంగా వివరించారు.

శ్రీ అయుష్

ప్రముఖ రచయిత, మేధావి శ్రీ ఖండవెల్లి సత్యదేవ ప్రసాద్ గారు  బ్రేకింగ్ ఇండియా పుస్తకంలోని 16, 17, 18, 19 అద్యయలపై మాట్లాడారు. ఈ అధ్యాయాల్లో ఉన్న ప్రధాన అంశాలు, బ్రిటన్ తో సహా ఇతర యూరప్ దేశాలు  చేస్తున్న రాజకీయ సాంస్కృతిక జోక్యాలు, చర్చ్ పాత్ర, వాటి కుట్రలు కుతంత్రాల పై వివరించారు. క్రైస్తవ సంస్థల కేంద్రంగా ఒక పరిశోధనాత్మక సంస్థలు ఏర్పాటు చేయడం.  ఇక్కడి ప్రజల స్థితిగతులపై దుష్ట బుద్ధితో పరిశోధనలు చేయడం, వీటిని ఆధారంగా చేసుకొని మావోయిస్టుల, ఇస్లామిక్ జిహదిలు, వేర్పాటు వాదులను సృష్టించి రక్షణ కల్పిస్తున్న చర్చ్ పాత్ర ల గురుంచి వివరించారు.

ఈ కార్యక్రమంలోని ప్రముఖంగా శ్రీ కసిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ ముదిగొండ శివ ప్రసాద్, సి బి సి ప్రసాద్, గిరిధర్ మామిడి, ప్రజ్ఞ భారతి చైర్మన్ పద్మ శ్రీ అవార్డు గ్రహీత త్రిపురనేని హనుమాన్ చౌదరి, ఎస్ ఎస్టి రిజర్వేషన్ పరిరక్షణ సమితి అద్యక్షులు శ్రీ కర్నే శ్రీశైలం, శివ శక్తి సంస్థాపకులు శ్రీ కరుణాకర్, శ్రీ సత్యనారాయణ మూర్తి, రామకృష్ణ, పారిశ్రామికవేత్త సుశీల గారు, ప్రజ్ఞ భారతి మరియు సాహిత్య పరిషత్, సమాచార భారతి సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here