Home Telugu Articles బానిసగా బ్రతికేకంటే వీరుడిగా మరణించడమే మేలు..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-4)

బానిసగా బ్రతికేకంటే వీరుడిగా మరణించడమే మేలు..(హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-4)

0
SHARE

ఆ తర్వాత నారాయణబాబు తన లక్ష్యసిద్ధికోసం అనేక మార్గాలు అన్వేషించసాగాడు. ఒకసారి నయాపూల్ దగ్గర నిజాం కారులో వెడుతుండగా చూశాడు. రోజూ సాయంత్రం నిజాం అన్ని కట్టుదిట్టాలతో నగరంలో నుండి కారులో వెళుతుండేవాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిజాంను తుదముట్టించాలని నారాయణబాబు నిశ్చయించుకున్నాడు. నిజాం హత్యవల్ల అతని ఇద్దరి కొడుకుల్లో ఘర్షణ రేగవచ్చు. హిందువుల మూకుమ్మడి హత్యా ప్రయత్నాలు సాగితే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవచ్చునని నారాయణబాబు అంచనా. ఏమైఆ తర్వాత నారాయణబాబు తన లక్ష్యసిద్ధికోసం అనేక మార్గాలు అన్వేషించసాగాడు. ఒకసారి నయాపూల్ దగ్గర నిజాం కారులో వెడుతుండగా చూశాడు. రోజూ సాయంత్రం నిజాం అన్ని కట్టుదిట్టాలతో నగరంలో నుండి కారులో వెళుతుండేవాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిజాంను తుదముట్టించాలని నారాయణబాబు నిశ్చయించుకున్నాడు. నిజాం హత్యవల్ల అతని ఇద్దరి కొడుకుల్లో ఘర్షణ రేగవచ్చు. హిందువుల మూకుమ్మడి హత్యా ప్రయత్నాలు సాగితే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకోవచ్చునని నారాయణబాబు అంచనా. ఏమైనా బానిసగా బ్రతికేకంటే వీరుడిగా మరణించడమే మేలని భావించాడు. నా బానిసగా బ్రతికేకంటే వీరుడిగా మరణించడమే మేలని భావించాడు.

తనలాగే ఆలోచిస్తున్న మరో బృందంతో పరిచయమైంది. అందులో ముఖ్యులు దేవయ్య, భీష్మదేవ్ ప్రయత్నించగా చివరికి రెడ్డి పోచ్‌నాథ్ ద్వారా ఒక చేతిబాంబు లభించింది. ఆర్యసమాజ్ నాయకులు పండిత నరేంద్రజీ శత్రువుల్ని ఎదుర్కోవడానికి ఆర్యసమాజ్ కార్యకర్తలకు కొన్ని బాంబులు పంచారు. కాని అవి కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే. ఆ రోజుల్లోనే షోలాపూర్‌లో కీ.శే. రాజగోపాల్ నిర్వాసితుల శిబిరం నిర్వహిస్తుండేవాడు. అక్కడికి శ్రీ కొండా లక్ష్మణ్ సహాయంతో వెళ్ళి మూడు బాంబులు, రెండు రివాల్వర్లు సంపాదించుకుని నారాయణబాబు హైద్రాబాద్ తిరిగి వచ్చాడు.

రక్తంతో ప్రతిజ్ఞ

మిత్రులంతా కలసి నిజాంపై దాడిచేసే పథకాన్ని, తేదీ, సమయం కూడా నిర్ణయించుకున్నారు. మొదట నారాయణబాబు నిజాంపై బాంబు విసరాలని, ఒకవేళ తప్పి ముందుకు వెళ్ళిపోతే గంగారామ్, జగదీష్‌లు దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. అన్ని విధాలా ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకొని ముగ్గురు మిత్రులు రక్తంతో ప్రతిజ్ఞాపత్రాలపై సంతకాలు చేశారు. ప్రతిరోజులాగానే ఆ సాయంకాలం నిజాం సవారి బయలుదేరింది.

కింగ్ కోఠి నుండి కారు బయలుదేరి ఆల్‌సెంట్సు స్కూలు దగ్గరికి రాగానే పక్కనే నిలుచున్న గుంపులోంచి సూటులో ఉన్న యువకుడు సరాసరిన కారు దగ్గరకు పరుగెత్తి బాంబును బలంగా కారుకు విసిరికొట్టాడు. బాంబు కారు తలుపుకు తాకి రోడ్డుమీద పడి పేలింది. నారాయణబాబు వెంటనే రెండో బాంబు తీసివేసేలోగానే అక్కడి జనం, పోలీసులు వచ్చి విరుచుకుపడ్డారు. అందరూ కలిసి విపరీతంగా కొట్టగా నారాయణబాబు ముఖం రక్తసిక్తమైంది. “నేరస్తుడు చస్తే మిగతావాళ్ళు తప్పించుకుపోతారు” అని ఒక ఇన్‌స్పెక్టర్ హెచ్చరించగా నారాయణబాబు ప్రాణాలతో మిగాలాడు. ఈలోగా నిజాం కారును డ్రైవర్ చాకచక్యంగా వెనక్కు తిప్పి కింగ్ కోఠికి తీసుకుపోయాడు. బాంబుపేలుడు చప్పుడు విన్న నారాయణబాబు సహచరులు, తలపెట్టిన పని విజయవంతమైనదని తలచి తప్పించుకుని పారిపోయారు.

చిత్రహింసలు

4 డిసెంబర్, 1947 నాటి రాత్రి 8 గంటలకు హైద్రాబాద్ రేడియో ప్రత్యేక ప్రసారంలో నిజాంపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ప్రకటిస్తూ “అల్లా దయవల్ల హజరత్ క్షేమంగా ఉన్నార”నే వార్తను ప్రసారం చేసింది. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో నారాయణబాబును నిర్భంధించి అమానుషంగా కొట్టారు. కుట్ర వివరాలు చెప్పమని కిరాతంగా హింసించి, దాహం వేస్తే ఉచ్చపోసి తాగమన్నారు. ఈ హింసవల్ల స్పృహతప్పిపోయినా ఊరుకోలేదు. నిజాం మంత్రి లాయవేతీ ప్రత్యేకంగా వచ్చి నారాయణబాబును ప్రశ్నించాడు. దాహం అంటే నీళ్ళు ఇప్పించాడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే నేరస్థుడు చావకూడదని తాఖీదుచేసి వెళ్ళిపోయాడు. మూడురోజులదాకా చేతులు పైకి విరిచికట్టి మోకాళ్ళపై తీవ్రంగా బాదారు. ఆ బాధను భరిస్తూ తన పేరు “బాబు” అని, తాను తప్ప ఈ కుట్రలో మరెవ్వరూ లేరని నారాయణబాబు స్పష్టంగా చెప్పాడు.

పోలీసులు నారాయణబాబు సహచరుల్లో గంగారామ్‌ను పాలమ్‌కోల్ గ్రాంలో పట్టుకోగలిగారు. జగదీష్ తప్పించుకొని వెళ్ళిపోగలిగాడు. బాలకృష్ణ తండ్రిని అరెస్టు చేశారు. బాలకృష్ణ మాత్రం చిక్కలేదు. బాంబు విసిరిన చోట ఒక సైకిలు ఆధారంగా ఈ ఆచూకీ తీయగలిగారు. పదిహేనురోజుల్లో  చాలా చురుకుగా నారాయణబాబు, గంగారాంలపై నేరవిచారణ జరిగింది. ఫౌజుదారి, బల్డా, సెషన్ హైకోర్టు చివరకు జుడీషియల్ కమిటీలో కూడా విచారణ జరిగింది. ప్రతిచోట ఇద్దరు వీరులు ఒకేమాటను స్పష్టం చేశారు. “మా భారత మాతృభూమికి నిజాం పరమద్రోహి, నిస్సందేహంగా నిజాంను హత్యచేయాలనే మా ప్రయత్నం. జనాల్ని జాగృతం చేయాలనేది మా రెండో ఉద్దేశ్యం. మేము మా కర్తవ్యాన్ని నిర్వహించాం”.

ఒకసారి సెషన్స్‌కోర్టులో విచారణ జరుగుతుండగా రాంలాల్ కిషన్ అనే న్యాయవాది వీరిద్దరికీ నేరాన్ని అంగీకరించవద్దని సలహా ఇచ్చాడు. కాని నారాయణబాబు నిరాకరిస్తూ ఇలా అన్నాడు, “మా బలిదానంవల్ల ప్రజలు మేల్కొంటారు. మా  ప్రాణాలకోసం ప్రయత్నించకండి”. చివరకు నారాయణబాబుకు మరణశిక్ష, గంగారాంకు యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. తన ధర్మాన్ని నెరవేర్చాననే తృప్తితో నారాయణబాబు జైల్లో మృత్యుచ్ఛాయలలో సైతం నిర్విచారంగా గడుపుతున్నాడు. జుడీషియల్ కమిటీ హైద్రాబాద్, ప్రీవికౌన్నిల్ నిర్ణయం కాగానే నిజాం సంతకంలో మరణశిక్ష అమలులోకి రావలసిఉంది.

విజయక్రాంతి సౌజన్యం తో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here