Home News 370 అధికరణ రద్దుతో భారతదేశ సమైక్యత మరింత బలోపేతం

370 అధికరణ రద్దుతో భారతదేశ సమైక్యత మరింత బలోపేతం

0
SHARE

జమ్ము కాశ్మీర్‌లో 370 అధికరణ రద్దుతో భారతదేశ సమైక్యత మరింత బలోపేతమైనదని, ఈ నిర్ణయం వలన కాశ్మీర్ లోయలోని   వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి చరమగీతం పాడినట్లయినదని  రాష్ట్ర చేతన సంస్థ ఆధ్వర్యంలో  “జమ్మూ కాశ్మీర్ – ఏ హిస్టారిక్ కరెక్షన్ అఫ్ హిమాలయన్ బ్లండర్”  అనే కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

ఆగస్టు 24న  హైదరాబాద్  సోమజిగూడలోని హోటల్ కత్రియాలో “జమ్మూ కాశ్మీర్ – ఏ హిస్టారిక్ కరెక్షన్ అఫ్ హిమాలయన్ బ్లండర్”  అనే కార్యక్రమంలో శ్రీ దుర్గారెడ్డి, ఆర్.ఎస్.ఎస్ సికింద్రాబాద్ విభాగ సంఘచాలక్, కాశ్మీరీ పండిట్ లు శ్రీ రాహుల్ రాజ్ దాన్, శ్రీ సునీల్ ష్రాఫ్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రాకా సుధాకర్ పాల్గొని  370 అధికరణ రద్దుపై తమ అభిప్రాయాలను తెలిపారు.  

370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ నిజమైన విలీనం భారత్ తో జరిగిందని, మోదీ ప్రభుత్వం ధైర్యం వలన లోయలోని తీవ్రవాదానికి చరమగీతం పాడినట్లైందని వక్తలు అన్నారు.  కాశ్మీర్ విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను భారత ప్రజలకు తెలియనివ్వకుండా తప్పిదాలు చేసిందని అభిప్రాయ పడ్డారు. 370 ఆర్టికల్ వల్ల జమ్మూ కాశ్మీరులోని పలు సామాజిక వర్గాల ప్రజలు ఇబ్బందులకు, వివక్షకు గురైన సంగతి గత ప్రభుత్వాలు దాచి ఉంచాయని పేర్కొన్నారు.  1990  దశకంలో తీవ్రవాదం కారణంగా కాశ్మీర్ పండిట్ లు ఎలాంటి భయానక వాతావరణం లో కాశ్మీర్ ని వదిలివెళ్ళాల్సి వచ్చిందో రాహుల్ రాజ్ దాన్ కళ్ళకు కట్టినట్లు వివరించారు.

అప్పట్లో కాశ్మీర్ కోసం వేల మంది సైనికులు చనిపోయినా ఎవరూ  మాట్లాడలేదని కల్నల్ సుదర్శన్ అన్నారు.

రాకా సుధాకర్  మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్  అంశం హిందూ ముస్లింల గొడవ కాదు, ఇది జాతీయ వాదులు, జాతి వ్యతిరేకుల మధ్య పోరాటం అని పేర్కొన్నారు. డిల్లీ మారితే గానీ కాశ్మీర్ మారదు అనే నానుడి నిజమై  ఇప్పుడు ఢిల్లీ మారింది కాశ్మీర్ కూడా మారింది అని వివరించారు.