Home Telugu Articles విశిష్టమైనది భారతీయ కాలగణన – ఉగాది ప్రత్యేకం

విశిష్టమైనది భారతీయ కాలగణన – ఉగాది ప్రత్యేకం

0
SHARE

గ్రహ నక్షత్ర గణనే నిజమైన కాలగణన. కాలం  దైవస్వరూపం, అనంతమైనది. ఈ సృష్టి అన్వేషణకు కాల గణనే మూలం.  మనదేశంలో కాలగణన ఎంతో శాస్త్రీయమైనది. ‘అసు సృష్టి ప్రారంభమై ఇప్పటికి నూట తొంబై ఐదు కోట్ల యాభై ఎనిమిది ల‌క్ష ఎనబది ఐదువేల ఎనభై ఒక‌టి సంవత్సరాలు (195,58,85,081) అయినట్లు లెక్క తెలుపుతున్నది. ఆధునిక శాస్త్రపరిజ్ఞానం లెక్క ప్రకారం కూడా దాదాపు మన పూర్వులు చెప్పిన లెక్కకు  దగ్గరగా ఉన్నది. మన కాలగణనలో మన్వంతరము, యుగాులు, సంవత్సరాలు, మాసాలు, పక్షము; రోజులు ఉంటాయి. అందులో 14 మన్వంతరాలు. ఆ మన్వంతరాల క్రమంలో ప్రస్తుతం 7వదయిన వైనస్వత మన్వంతరం నడుస్తున్నది. ఒక మన్వంతరము అంటే 71 మహాయుగాలు;  ఒక మహాయుగము అంటే నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు). ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగము ప్రారంభమై ఇప్పటికి 5123 సంవత్సరము పూర్తి అయింది. ఈ ఉగాదితో 5124 సంవత్సరములోకి ప్రవేశిస్తున్నది.

మన కాలగణనలో సంవత్సరము ఆవర్తము ఉన్నది. 60 సంవత్సరాు ఒక ఆవర్తము. ఈ అరవై  సంవత్సరా ఆవర్తములో  35వ సంవత్సరమైన ప్ల‌వ‌ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ ఉగాదితో 36 సంవత్సరమైన శుభకృతనామ సంవత్సరంలో ప్రవేశిస్తాము.

కలియుగము ఎప్పుడు ప్రారంభమైంది ?

మహాభారత సంగ్రామం తరువాత 36 సంవత్సరాలకు భగవాన్‌ శ్రీకృష్ణునిచే నిర్మింపబడిన ద్వారకపట్టణము సముద్ర గర్భంలో కలిసిపోయిన అర్థరాత్రి నుండి కలియుగం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రచారములో ఉన్న క్రీస్తుకు పూర్వము; క్రీస్తు శకము లెక్కల ప్రకారం క్రీస్తుపూర్వము 3101 ఫిబ్రవరి 20వ తేదీ అర్థరాత్రి 2 గం. 27 ని॥ 30 సెకండ్లకు అంటే 3101+2022 = 5123 సంవత్సరాు ఇప్పటికే పూర్తి అయ్యి 5124 లో ఈ ఉగాది నాడు ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 02 ఉగాది నుండి శుభకృతనామ సంవత్సరం ప్రారంభమౌతుంది. ఇంతటి శాస్త్రీయమైనది మన కాలగణన.

దేశచరిత్రలో కొన్ని తిరుగులేని విజయాలను మనవాళ్ళు శకాలుగా పేర్కొన్నారు. అందులో ప్రసిద్ధమైనవి 1) యుధిష్ఠిర శకము, 2) విక్రమార్క శకము, 3) శాలివాహన శకము. భారతదేశానికి ఉత్తరభాగం వారు విక్రమార్క శకమును, దక్షిణాపథం వారు శాలివాహన శకమును చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేశ చరిత్రల మలుపు త్రిప్పిన ఘట్టాను పదేపదే జ్ఞాపకం చేసుకొంటూ మనలో ధర్మనిష్టను;  పౌరుష పరాక్రమాలను పెంపొందించుకోవటం ప్రధాన లక్ష్యం. ఆ శకాల గురించి సంక్షిప్తంగా తెలుసుసుకునే ప్రయత్నం చేద్దాం.

యుధిష్ఠిర శకం

యుధిష్ఠిర శకం కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ద్వాపర యుగ అంతంలో ప్రారంభమైంది. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించారు. తరువాత ధర్మరాజుకు సామ్రాట్టుగా పట్టాభిషేకము జరిగింది. ఆ రోజు నుండి యుధిష్ఠిర శకం ప్రారంభం అయింది. అది జరిగి ఈ ఉగాదికి 5159 సంవత్సరాలు పూర్తయి, 5160వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు 36 సంవత్సరాలు పరిపాలన చేసాడు. ఆ తరువాత కలియుగం ప్రారంభమైంది. అంటే కలియుగం ప్రారంభానికి 36 సంవత్సరాలకు పూర్వం యుధిష్ఠిర శకం ప్రారంభమైంది. యుధిష్ఠిర శకం మనకు ఇచ్చే సందేశం ఎప్పుడైనా అంతిమ విజయం ధర్మానిదే అని. మహాభారత సంగ్రామం ధర్మానికి,  అధర్మానికి మధ్య జరిగిన భీకర పోరాటం. అది ధర్మం జయించిన వేళ.

విక్రమార్క శకం

కలియుగంలో 3044 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పుడు 2078 సంవత్సరాు పూర్తి చేసుకొని 2079వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. విక్రమార్కుని కాలం నాటికి భారతదేశం మీద శకుల, హూణుల దండయాత్ర‌ జరుగుతుండేవి. చిన్న వయస్సులోనే విక్రమార్కుడు ఈ దాడులను త్రిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 5 సంవత్సరాల వయస్సులోనే అరణ్యంలోకి వెళ్లి  12 సంవత్సరా పాటు సుదీర్ఘ సాధన చేసి అద్భుత శక్తులు సంపాదించాడు. అతను మాళవ ప్రాంతంలోని ఉజ్జయినీని రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు. జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని ఒకటి.

విక్రమాదిత్యుడు శకులు హూణులను జయించటానికి భయంకరమైన యుద్ధాలు చేశాడు. శకులు హూణుల  భాధలు మనకే కాదు అరేబియా; బాబిలోనియా; పర్షియాకు కూడా ఉండేవి. విక్రమార్కుడు అక్కడకు కూడా వెళ్ళి శకులు హూణులను తరిమి కొట్టాడు. అరబ్బు ప్రజు విక్రమాదిత్యుడిని తమకు స్వేచ్ఛ స్వతంత్రం ప్రసాదించిన రాజుగా కీర్తించారు. అరేబియాలో మహాదేవుని మందిరం నిర్మాణం చేసారు. అట్లాగే విక్రమాదిత్య మహారాజు అయోధ్య పట్టణాన్ని అన్వేషించి అక్కడ రాముడు జన్మించిన స్థలము గుర్తించి అక్కడ భవ్యమైన రామమందిరం నిర్మాణం చేసాడు. ఈ విషయలు కాళిదాసు రచించిన గ్రంథాల ద్వారా మనకు తెలుస్తాయి. శకులు, హుణుల బారి నుండి ఈ దేశాన్ని కాపాడిన విక్రమాదిత్యుడి పేరుతో విక్రమార్క శకం ప్రారంభమైంది.

శాలివాహన శకం

ఇది కలియుగంలో 3179వ సంవత్సరంలో ప్రారంభమైనది. అంటే శాలివాహన శకం ప్రారంభమై ఇప్పటికి 1943 సంవత్సరాలు పూర్తి అయి, 1944 సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. శాలివాహనుడు విక్రమాదిత్యుని మునిమనుమడు. శాలివాహనుడు విదేశీయులైన శకులను సంపూర్ణంగా నాశనము చేసి దేశ సరిహద్దులు దాటి వారి రాజ్యాలలోకి ప్రవేశించి వాళ్ళు దోచుకొని పోయిన సంపదనంతటిని తిరిగి ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఈ దేశానికి మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుని ఒకే ఛత్రం క్రింద దేశాన్ని పరిపాలించిన ధీరుడు. శకులపై విజయానికి చిహ్నంగా శాలివాహన శకం ప్రారంభమైంది. ఆయన కాలంలో ఈ దేశంపై దాడిచేసిన విదేశీయులను సంపూర్ణంగా నాశనం చేసి భారత్‌ను శక్తివంతం చేశాడు.

ఆ విషయాలు జ్ఞాపకం  చేసుకోవటానికి విక్రమార్క, శాలివాహన శకాలు ఏర్పడ్డాయి. ఈ శకాలు మనకు ఇప్పుడు ఇచ్చే సందేశం ఏమిటంటే శతాబ్దాల భావదాస్యాన్ని వదిలించుకొని వేయి సంవత్సరాల విదేశీ దాడులకు చరమగీతం పాడాలి. మన దేశం స్వాభిమానంతో నిలబడి, ప్రపంచానికి శాంతి బాటలు వేసి, మరో క్రొత్త శకం ప్రారంభం కావాలి. ఈ ప్ల‌వ నామ సంవత్సరం అందరికీ ఇటువంటి ప్రేరణ ఇవ్వాలని కోరుకుందాం.

– రాంపల్లి మల్లికార్జునరావు