Home Telugu Articles సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం బోనం

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం బోనం

0
SHARE

తొలకరి జల్లులతో ప్రకృతి పచ్చని కోకను సింగారించుకునే వేళ వస్తుంది ఆషాఢ మాసం! ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసే హిందువులకు ఇది శూన్యమాసం! నేటి నుంచి మొదలయ్యే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలకు అవకాశం లేకున్నా, పల్లెలకు మాత్రం బోనాల పండుగొచ్చిం ది. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీసంప్రదాయాలకు ప్రతిరూపమైన ఈ వేడుక శ్రావణం దా కా కొనసాగనున్నది. గ్రామదేవతలైన గంగ మ్మ, మైసమ్మ, పోశమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మకు గడప గడప నుంచీ బోనం సమర్పించనుండగా, శివసత్తులపూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ప్రతి పల్లే హోరెత్తనున్నది. ఇప్పటికే మొదలైన వేడుకలతో పండుగ వాతావరణం నెలకొన్నది.ఈ నైవేద్య ఉత్సవంతో పట్టణాల్లోనూ సందడి ఉండనున్నది.

బోనాల నేపథ్యం..

బోనం అంటే భోజనం.. ఆహారం అని అర్థం. విస్తారంగా వ ర్షాలు కురిపించి పంటలు పండేలా కరుణించి, ఇంటిల్లిపాదీ కడు పు నిండేలా చూడాలని గ్రామదేవతలకు కృతజ్ఞతగా భోజనం పెట్టడ మే బోనం. అన్నం ప్రసాదిస్తున్న అమ్మకు నైవే ద్యం పేరుతో భ క్తులు చేసే వేడుకే బోనాల ఉత్స వం. ఇది తెలంగాణకు ప్రత్యేకం. కాకతీయుల కా లం నుంచే ఇక్కడి పల్లెల్లో బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తోందన్నది చరిత్రకారుల అభిప్రాయం. పూర్వం వ ర్షాకాలంలో వానలు బాగా కురిసేవి. పారిశుధ్యం లోపించి కలరా, ప్లేగు, తట్టు, మశూచి, ఇతర రోగాలు వ్యాపించేవి. ఇలాంటి భ యంకర వ్యాధులతో ప్రజలు అల్లాడేవారు. శక్తి స్వరూపిణి అయి న అమ్మవారిని కాపాడుమని కొలిచేవారు. తమ పిల్లా పాపలను, గొడ్డూగోద ను, పంటలతో పాటు ఊరు మొత్తాన్ని కాపలా కా యాలని మొక్కులు చెల్లించేవారు. ఊరంతా ఒకే రోజున పసుపు అన్నంతో బోనం చేసి సమర్పించేవారు. మహిళలు కొత్తబట్టలు ధ రించి బోనాన్ని తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు గా బయలు దేరి అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు. దుష్టశక్తులను పారదోలాలని పూర్వం దున్నపోతులను బలిచ్చేవారు. ఇప్పుడు మేకలు, గొర్రెలు, కోళ్లను బలిస్తున్నారు.

పండుగలు..

శనివారం నుంచి ఆషాఢం మొదలై, వ చ్చే నెల 11తో ముగుస్తుంది. మొదటి రోజు నుంచే ఆషాఢ నవరాత్రులు ప్రారంభమవుతాయి. తెలంగాణవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు షురూ అవుతాయి. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుండడంతో గ్రామాలు, పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తి పారవశ్యంతో మునిగిపోతాయి.

అమ్మ కరుణ కోసం శాక..

అమ్మవారికి బోనంతో పాటు శాకను సమర్పిస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి చక్కెర లేదా బెల్లం వెసి తీర్థం తయారు చేస్తారు. అందులో వేపకొమ్మలు ఉంచి, బోనంపై పెట్టుకుని అమ్మ వారి ఆలయానికి చేరుకుని సమర్పిస్తారు. కొన్నిచోట్ల కల్లుతో శాక చేసి గ్రామ దేవతకు ముట్టజెబుతారు. తర్వాత ఇంటిల్లిపాది తీర్థంలా తీసుకుంటారు. శాకను వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రకాలుగా తయారుచేస్తారు.

గావువట్టుడు..

గ్రామదేవతలకు సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే వ్యక్తి బోనాల పండుగ జరిపిస్తాడు. పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి ఒంటిపై పసు పు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు, ఎర్రని ధోవతి ధరించి వేపాకులను నడుముకు చుట్టుకు ని, కొరడాతో విన్యాసాలు ప్రదర్శిస్తాడు. బోనంతో వచ్చే మహిళలను అమవారి సమక్షానికి తీసుకెళ్తాడు. ఆలయం వద్దే తన దంతాలతో మేకపోతును కొరికి తలా మొండాన్ని వేరు చేసి అమ్మవారికి సమర్పిస్తాడు. ఈ ప్రక్రియనే గావు పట్టడం అంటారు. ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

మట్టిపాత్రలోనే నైవేద్యం..

గ్రామ దేవతలకు కొత్త మట్టిపాత్రలోనే నైవే ద్యం (బోనం) సిద్ధం చేయాలి. ఇందుకోసం పం డుగ రోజు తెల్లవారుజామునే మహిళలు భక్తిశ్రద్ధలతో కొత్త పాత్రలు తెచ్చి నైవేద్యం వండుతారు. కట్టెల పొయ్యిమీదే బోనం వండాలనే ఆచారం అనాదిగా వస్తున్నది. వండడం పూర్తయిన తర్వాత కుండను శుభ్రం చేసి, పసు పు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు.

ఊరూరా జాతర..

ఆషాఢ మాసంలో ప్రారంభమై శ్రా వణమాసం దాకా గ్రామాలు, పట్టణా ల్లో బోనాల జాతర్లు కొనసాగుతాయి. బోనాల సందర్భంగా ఏ గ్రామంలో చూసినా పచ్చటి మామిడి తోరణాలు, రంగులు, సున్నాలతో అలంకరించిన ఇంటి పరిసరాలు, బంధువుల రాకతో ఇల్లిల్లూ కళకళలాడుతాయి. ముఖ్యం గా ఆదివారం, గురువారం బోనాలు తీస్తారు. ఈ రెండు రోజులు అమ్మవారికి ఇష్టమైనవి కావడంతో ఆయా రోజుల్లోనే పండుగను నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లోనూ బోనాలు తీస్తారు. ఈ బోనాల పం డుగ రోజున శివసత్తులు, పోతరాజులు సందడి చేస్తారు. బోనాల ఊరేగింపు ముందు విన్యాసాలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అమ్మవారికి బోనం సమర్పించే సయయంలో గ్రామానికి సం బంధించి, ఇతర విషయాలపై భవిష్యవాణి వినిపిస్తారు. బోనం సమర్పించడంతోపాటు ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో కలిసి భుజిస్తారు. ఊరు శివారులో ఉన్న ఆలయాలు, అటవీ ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటారు. శ్రావణం లో బోనాలు తీసేవారు కూరగాయలతోనే విం దులు వినోదాలు నిర్వహించుకుంటారు.

శాస్త్రీయకోణం..

బోనాల ఉత్సవాన్ని శాస్త్రీయ కోణంలో చూసి నా అనేక ఉపయోగాలున్నాయి. వర్షాకాలంలోనే కొత్తనీరు చేరి, పారిశుధ్య సమస్యతో వ్యాధులు ప్ర బలే అవకాశముంటుంది. ఈ కాలంలోనే అమ్మవార్లకు బోనాలు తీస్తారు. నైవేద్యం తయారీకి పసుపు బియ్యం వినియోగిస్తారు. బోనాన్ని అలంకరించేటప్పుడు పసుపు, సున్నం వాడుతారు. ఇంటిని మామిడి తోరణాలు, వేపకొమ్మలతో అలంకరిస్తారు. శాకలోనూ వేపాకు వాడుతారు. వేప, పసుపు విరివిగా ఉపయోగించిన ఆహార ప దార్థాలు తీసుకోవడం వల్ల వాటిలోని యాంటీబయాటిక్స్‌తో రోగనిరోధక శక్తి పెరిగే అవకాశ ముం టుంది. గడపలను పసుపుతో అలంకరించడం, మామిడి తోరణాలు కట్టడం మూలంగా క్రిములు, బ్యాక్టీరియా, ఇతర వైరస్‌ను ఇళ్లలోకి రాకుండా చూసే వీలుంటుంది.

(నమస్తే తెలంగాణా సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here