Home Telugu Articles మతం ముసుగులో యధేచ్చగా చట్టాల ఉల్లంఘన

మతం ముసుగులో యధేచ్చగా చట్టాల ఉల్లంఘన

0
SHARE

ఒకవైపు దేశం యావత్తు కరోనా మహమ్మారిపై తీవ్రంగా పోరాటం సాగిస్తున్న సమయంలో ఢిల్లీ మర్కజ్ మసీదు వర్గాలు మాత్రం తమ కార్యక్రమం పూర్తికావడమే ధ్యేయంగా వ్యవహరించాయి. మార్చి 13, 16 తేదీల్లో ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ జారీ చేసిన నిబంధనలు కూడా తుంగలో తొక్కాయి.

మరోవైపు దేశీయ తబ్లిగ్ వర్గాల అండతో విదేశీ ఇస్లామిక్ ప్రచారకులు భారత వీసా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. విదేశీయులు ఎటువంటి వీసాతో అయినా సరే భారతదేశంలో తబ్లిగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదు అన్నది స్పష్టమైన నియమం. ఇది  భారత హోంశాఖ అధికారిక వెబ్ సైట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది.
Link: https://mha.gov.in/PDF_Other/AnnexI_01022018.pdf

విదేశీయులు తబ్లిగ్ కార్యకలాపాల్లో పాల్గొంటే 500 అమెరికన్ డాలర్ల జరిమానా కూడా విధించే విధానం భారతదేశంలో ఉంది. కానీ ఈ నియమాలు, విధానాలు కేవలం వెబ్ సైట్ లకు మాత్రమే పరిమితం అవుతున్నట్టు కనిపిస్తోంది.

Link: https://indianfrro.gov.in/eservices/Financial_Penalty.pdf

ఫారినర్స్ యాక్ట్ 1946లోని సెక్షన్ 7(1) ప్రకారం భారతదేశంలో విదేశీయులు ఎక్కడైతే బస చేస్తారో ఆ హోటల్ లేదా ఇంటి యజమానులు విదేశీయుల వివరాలు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలి. కానీ ఢిల్లీ మర్కజ్ మసీదు వర్గాలు మాత్రం విదేశీయుల వివరాలు గోప్యంగా దాచివుంచాయి.

ఇదీ వీళ్ళ తీరు: 

ఈ దేశ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించడాన్ని తమ జన్మహక్కుగా  కొందరు ముస్లిం వర్గానికి చెందినవారు భావిస్తున్నారు. పైగా దీన్ని ఒక రకమైన సాహసోపేతమైన చర్యగా అభివర్ణించడం కూడా చూస్తున్నాం. ఒకవేళ చట్టాలకు దొరికిపోతే, రాజకీయ నాయకుల మద్దతుతో ఏదో ఒక విధంగా తప్పించుకుంటున్నారు. ఎటూ తప్పించుకోవడం కుదరని పక్షంలో.. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, వెనుకబాటు అంటూ తమ తప్పులకు కారణాలు చూపిస్తారే తప్ప తాము చేసింది తప్పు అని మాత్రం ఒప్పుకోరు. సమాజంలో తాము చేసిన తప్పులపై చర్చ మొదలైన మరుక్షణం దీన్ని ఇస్లాంపై జరుగుతున్న దాడిగా చూపిస్తూ, తమను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు కావాలని డిమాండ్ చేసే స్థాయికి వెళ్లారు.

భారత ఇమ్మిగ్రేషన్ వర్గాల బాధ్యతారాహిత్యం!:

1990 నుండి ఇప్పటి దాకా మిషనరీ వీసా మీద భారతదేశాన్ని సందర్శించిన విదేశీయుల వివరాలు ఇవ్వాల్సిందిగా “లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్”  2015వ సంవత్సరంలో ఒక సమాచార హక్కు దరఖాస్తు అప్పటి కేంద్ర హోంశాఖకు పంపింది. హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఆ దరఖాస్తుని ఫార్వార్డ్ చేయడంతో అక్కడి నుండి సమాచారం రావడం మొదలైంది. అయితే ఇందులో బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్, కైమూర్ జిల్లాల నుండి వచ్చిన సమాచారం నివ్వెరపరిచింది.

పాకిస్థాన్ నుండి బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాకు 164 మంది పాకిస్థానీయులు, కైమూర్ జిల్లాకు 38 మంది పాకిస్థానీయులు మిషనరీ వీసా మీద వచ్చినట్టు తేలింది. దేశవ్యాప్తంగా సేకరించిన సమాచారంతో పోలిస్తే.. కేవలం గోపాల్ గంజ్ , కైమూర్ ప్రాంతాలకు మాత్రమే, మరే ఇతర ఇస్లామిక్ దేశం నుండి కాకుండా, కేవలం పాకిస్థాన్ నుండి మాత్రమే పాకిస్థానీయులు వచ్చినట్టు తెలిసింది. దీనిపై మరింత లోతుగా తెలుసుకునే ఉద్దేశంతో “మీ జిల్లాలను సందర్శించిన పాకిస్థానీయులు చేపట్టిన కార్యకలాపాలు ఏమిటి?” అని అడుగుతూ మరో సమాచార హక్కు చట్టం దరఖాస్తు గోపాల్ గంజ్, కైమూర్ జిల్లా పోలీస్ డిపార్టుమెంట్లకు పంపించడం జరిగింది.  “మా కార్యాలయంలో వారి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం లేదు’’ అని ఒకరు చెబితే.. “వారు తమ బంధువులను కలుసుకునేందుకు వచ్చారు’’ అని మరొకరు సమాధానం ఇచ్చారు.
(గమనిక: పాకిస్థానీయులు భారతదేశంలో తమ బంధువులను కలుసుకోవాలి అంటే టూరిస్ట్ వీసా మీద మాత్రమే రావాల్సి ఉంటుంది).

వీసా నిబంధనల ఉల్లంఘనపై భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసుల ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తూ.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించమని కోరుతూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ 2018లో నాటి కేంద్ర మంత్రులైన రాజనాథ్ సింగ్ (హోంశాఖ), సుష్మా స్వరాజ్ (విదేశీ వ్యవహారాలు)తో పాటు భారత ప్రభుత్వంలోని పలువురు కీలక అధికారులకు లీగల్ నోటీసులు జారీ చేసింది.  దీనికి సమాధానంగా కేంద్ర హోంశాఖలోని విదేశీ వ్యవహారాల డివిజన్, ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇమ్మిగ్రేషన్ శాఖను కోరినట్టు తెలియజేసింది. ఇప్పటికీ సంబంధిత శాఖలు వీసా ఉల్లంఘనను ఒక ప్రమాదంగా భావించడం లేదు అనే విషయం స్పష్టమవుతోంది.

భారత ముస్లిములను తమ మూలాల నుండి తప్పించడం!
`ఒక  ప్రదేశాన్ని ఆక్రమించడం మాత్రమే కాదు.. దాన్ని నిలబెట్టుకుంటేనే ముందుకు సాగగలం’ అనేది యుద్ధతంత్రం. ఇక్కడి వాళ్లను కేవలం మతం మార్చితే సరిపోదు, మూలాల నుండి వారిని దూరం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి అనేది తబ్లీగి జమాత్  కుతంత్రం.

ఒక సాధారణ పౌరుడు వివేకం కలిగివుండి, కనీస విచక్షణ ప్రదర్శిస్తూ, తన సమీపంలో జరుగుతున్న కార్యకలాపాలు తెలుసుకుంటూ, దాన్ని సంబంధిత భద్రతా సంస్థలకు చేరవేయడం అనేది కూడా ఎంతో ముఖ్యమైన కర్తవ్యం. తద్వారా తన కుటుంబంతో పాటు దేశాన్ని కూడా రక్షించుకోగలుగుతాడు.

Source: www.epaper.organiser.org

మొదటి భాగం కోసం క్లిక్ చేయండి: