Home Telugu Articles బుద్ధుడు బోధనలతో ప్రభావితమైన అనేక దేశాలు

బుద్ధుడు బోధనలతో ప్రభావితమైన అనేక దేశాలు

0
SHARE

వైశాఖ మాసంలో గౌతమ బుద్ధుడు జన్మించిన తిథిని బుద్ధపూర్ణిమగా పరిగణిస్తారు. బుద్ధుడు క్రీ.పూ. 563-483 సంవత్సరాల ప్రదేశ్‌లో ఉన్న ”కుసినగర్‌”లో దేహపరిత్యాగం చేశారు. ఆయన జన్మించిన లుంబినితోపాటు, బిహార్‌లోని బుద్ధగయను బౌద్ధులు పవిత్రంగా భావిస్తారు. బుద్దుడు మొదటి సారి సారనాద్‌లో ధర్మం గురించి బోధించారు. బుద్ధుడు బోధనలతో భారత దేశంతో పాటు, అనేక దేశాలలో ప్రభావితం అయ్యారు. ఈనాటికి చైనా, మంగోళియా, శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలు, జపాన్‌లలో బౌద్ధ మతం అనుసరిస్తున్నారు. సమాజంలో దురాచారాలు, మూడ విశ్వాసాలు ఉన్న సమయంలో వాటికి పరిష్కారంగా బుద్ధుడి బోధనలు ఆకట్టుకొని బౌద్ధమతం విస్తరించింది. ఆయన నిర్యాణం తర్వాత బౌద్ధులు అనుసరించిన అహింస సిద్దాంతం, ప్రతీదీ మాయ అనే కల్పనవల్ల భారత దేశం చాలా నష్ట పోయింది. గాంధారం నుండి కన్యాకుమారి వరకు విదేశీయులు అవలీలగా దాడిచేయ గలిగారు. సామాన్య ప్రజానీకానికి దూరమ వడంతో  బౌద్ధమతం భారత దేశంలో క్రమంగా కను మరుగయ్యింది. అయితే గౌతమ బుద్ధుదు ప్రవచించిన ”ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది” సర్వకాల సర్వావస్థల యందు అనుసరణీయమే. 

బుద్ధ జాతక కథలలో బుద్ధుడిని శ్రీరాముడి పలుకు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడుగా చెప్పబడింది. హిందూధర్మంలో చాలామంది గౌతమ బుద్ధుడిని శ్రీమహా విష్ణువు తొమ్మిదవ అవతారంగా భావిస్తారు.