Home News దాదా వాస్వాని మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాప  సందేశం

దాదా వాస్వాని మరణంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాప  సందేశం

0
SHARE

సంత్ శిరోమణి శ్రద్ధేయ దాదా వాస్వాని హఠాత్తుగా పరలోకానికి పయనమవడం మనందరికీ చాలా బాధను కలిగించే సంఘటన. పవిత్రత, అందరిపట్ల ఆత్మీయత, దుఃఖితుల పట్ల కరుణ, సేవాభావం, తపశ్చర్యం మొదలైన దైవ గుణాలకు సాకార మూర్తిగా అందరి శ్రద్ధా, విశ్వాసాలను చూరగొన్న శ్రద్ధేయ దాదా వంటి సాధుసంతులవల్లనే ఈ సమాజం ఎన్నిరకాలైన ఇబ్బందులు, విపత్కర పరిస్థితులలోనైనా నిలిచి ముందుకు సాగగలుగుతోంది. నేడు అలాంటి అపారమైన భరోసా, ఆధారాన్ని మనం కోల్పోయాం.

ఈ పూడ్చలేని లోటు, తీర్చలేని బాధను తట్టుకుని శ్రద్ధేయ దాదా చూపిన మార్గంలో ముందుకు సాగడానికి వారి కృప మనకు లభించాలని కోరుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.

అర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్
డా. మోహన్ జి భాగవత్

సర్ కార్యవాహ్ –
భయ్యాజి జోషి

(rss.org సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here