Home News ఆర్ఎస్ఎస్ గురించి గతంలో న్యాయస్థానాలు ఏమన్నాయి?

ఆర్ఎస్ఎస్ గురించి గతంలో న్యాయస్థానాలు ఏమన్నాయి?

0
SHARE

ఆర్ఎస్ఎస్ గురించి పలు న్యాయస్థానాలు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు:

1. “ఏ తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగిని కూడా, ఆ వ్యక్తి ఆర్ఎస్ఎస్ సభ్యుడనే కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించరాదు”
– కృష్ణలాల్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు(1955)

2. “ఆర్ఎస్ఎస్ సభలో ఇచ్చిన ఉపన్యాసం, `భారతీయ శిక్షా స్మ్రితి’ సెక్షన్ 153 కింద నేరంగా పరిగణిoచబడదు”. 
– 1961 ఎం.ఎస్. గోల్వాల్కర్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో పాట్నా హైకోర్టు తీర్పు.

3. “ఏ ప్రభుత్వ ఉద్యోగి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్నాఅది ప్రమాదకరమైన చర్య కాదు మరియు ఈ కారణంతో ఆ వ్యక్తిని  ఉద్యోగం నుంచి తొలగించడానికి వీలు లేదు”.
– 1962 చింతామణి నుర్గావున్కర్ వర్సెస్ నాగపూర్ పోస్ట్ మాస్టర్ జనరల్ కేసులో బొంబాయి ఉన్నత న్యాయస్థానం తీర్పు.
4. “ఒక ప్రభుత్వ ఉద్యోగిని  కేవలం ఆర్ఎస్ఎస్ సభ్యుడనే కారణo వల్ల తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడానికి వీలు లేదు”
– 1963 జైకిషన్ మెహ్రోత్రా వర్సెస్ అకౌంటెంట్స్ జనరల్ ఆఫీస్ కేసులో ఉత్తరప్రదేశ్ హైకోర్టు తీర్పు.
5. “ఆర్ఎస్ఎస్ లో పాల్గోవడమనే కారణం వల్ల ప్రభుత్వ ఉద్యోగిని పనినుంచి  తొలగించడం కోర్టులో ఎంత మాత్రం నిలబడదు”
–  1964 కేదార్ లాల్ అగ్రవాల్ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం మరియు ఇతరుల కేసులో జోధపుర్ (రాజస్థాన్) ఉన్నత న్యాయస్థానం తీర్పు.

6. “ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గోవడాన్ని ‘ప్రమాదకరమైన చర్య’ అనలేము, అది చట్ట విరుద్ధం కూడా కాదు. ఈ కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడం కుదరదు”  
– 1965 మనోహర్ అమ్బేకర్ వర్సెస్ భారత ప్రభుత్వం మరియు ఇతరుల కేసులో పంజాబ్ ఉన్నత న్యాయస్థానం.

7. “ఆర్ఎస్ఎస్ సభ్యత్వం అనే కారణం వల్ల న్యాయమూర్తిగా  నియామకాన్ని నిరాకరించడం ఎంత మాత్రం చెల్లదు”
 – 1966 రంగనాథాచార్ అగ్నిహోత్రి వర్సెస్ మైసూరు రాష్ట్రం మరియు ఇతరుల కేసులో బెంగళూర్ లోని మైసూరు ఉన్నత న్యాయస్థానం తీర్పు.
8. “ఆర్ఎస్ఎస్ సదస్సుకి హాజరవడం  అనే కారణం వల్ల, ఏ ప్రభుత్వ ఉద్యోగిని పని నుంచి తొలగించడానికి వీల్లేదు”
– 1967 రామఫల్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం మరియు ఇతరుల కేసులో చండీగఢ్ లోని పంజాబ్ & హర్యానా ఉన్నత న్యాయస్థానం తీర్పు.

9. “ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గోవడo అనే కారణాల వల్ల, ఏ ఉద్యోగి పదవీ కాలం రద్దు చేయడం కుదరదు’. వేరే కారణాలు చూపించి ఇటువంటి ఉద్దేశంతో జారీ చేసినా ఏ ఆదేశాలు చెల్లవు”
– 1973 భరత్ ప్రసాద్ త్రిపాఠీ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇతరుల కేసులో జబల్పూర్ లోని మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పు

10. “ప్రభుత్వ ఉద్యోగ పదవీకాలంలో, పౌరుల `ప్రజా సంబంధాల హక్కు’ రద్దు చేయబడదు”
– 1971 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ మరియు ఇతరులు వర్సెస్ రేవత్ ప్రకాష్ పాండే కేసులో ఉత్తరప్రదేశ్ హైకోర్టు తీర్పు.

11. “ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ ఉద్యమమని ఎక్కడా నిర్దారితమవలేదు. ఈ కారణం వల్ల ప్రభుత్వ ఉద్యోగులని పదవి నుంచి తొలగించడానికి వీలు లేదు” 
–  1970 డిబి. గోహెల్ వర్సెస్ భావనగర్ జిల్లా న్యాయమూర్తి మరియు ఇతరుల కేసులో అహ్మదాబాద్ హైకోర్టు తీర్పు.

12. “ప్రభుత్వ పాఠశాల భవనాలు, ఇతర వసతులు ఆర్ఎస్ఎస్ తమ కార్యకలాపాలకి వాడుకోవడాన్ని నిరాకరించడానికి వీలు లేదు”
– 1981 టి.బి. ఆనందన్ మరియు ఇతరులు వర్సెస్ కేరళ రాష్ట్రం మరియు ఇతరుల కేసులో ఎర్నాకులంలోని కేరళ ఉన్నత న్యాయస్థానం తీర్పు.

13. “ఆర్ఎస్ఎస్ సభ్యత్వం కారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో  నియామకాన్ని నిరాకరించడం ఎంత మాత్రం చెల్లదు”
– 1982 శ్రీమతి త్యాద్దమ్కర్ వర్సెస్ ముఖ్య అధికారి, కేరళ టేలికమ్ విభాగం కేసులో  ఎర్నాకులంలోని కేరళ ఉన్నత న్యాయస్థానం తీర్పు.

14.“ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గోవడం అనే కారణం వల్ల, ఏ ఉద్యోగిని పని నుంచి తొలగించడానికి వీల్లేదు”
 – 1983 మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రామ్ శంకర్ రఘువంశి  మరియు ఇతరుల కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు.
15. “ఆర్ఎస్ఎస్ చట్టవ్యతిరేకం అని ప్రకటించేందుకు తగినన్ని ఆధారాలు లేవు”
–  1993 కేంద్ర ప్రభుత్వం వర్సెస్ ఆరెస్సెస్ కేసులో అక్రమ కార్యకలాపాల నిరోధక ప్రత్యేక కోర్టు తీర్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here