Home Telugu Articles దిగ్భ్రాంతికి గురిచేస్తున్న వరుస అత్యాచార ఘటనలు..  దేశవ్యాప్తంగా నిరసనలు

దిగ్భ్రాంతికి గురిచేస్తున్న వరుస అత్యాచార ఘటనలు..  దేశవ్యాప్తంగా నిరసనలు

0
SHARE

గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మహిళలపై అత్యాచారం, హత్య ఘటనలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దిశ  అనే 26 ఏళ్ళ వెటర్నరీ వైద్యురాలిపై నిందితులు జరిపిన అత్యాచారం, దహనం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన సెగలు రాజుకున్నాయి. పధకం ప్రకారం జరిపిన ఈ  అమానుష ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులు మహ్మద్ పాషా అనే ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వీరికి తక్షణమే మరణశిక్ష విధించాలంటూ అన్నివర్గాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

నిందితులు గత కొంతకాలంగా దిశ  కదలికలను గమనిస్తూ, పక్కా పధకం ప్రకారం ఈ చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో మహిళపై అత్యాచారం, హత్య:
తెలంగాణాలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన మరొక ఘటనలో బుడగజంగాల వర్గానికి చెందిన మహిళ అత్యాచారం, ఆపై  దారుణ హత్యకు గురైంది. స్థానికంగా వీధుల్లో చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.  నవంబర్  24 సాయంత్రం  ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్డుం అనే వ్యక్తులు ఒంటరిగా వస్తున్న మహిళను బలవంతంగా సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆపై గొంతుకోసి హత్యచేశారు.

ఈ ఘటనతో ఆసిఫాబాద్ జిల్లాలో బుడగజంగాల సంఘాల పిలుపు మేరకు భారీగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో ఆందోళనకారులు ఒక మోటార్ సైకిలు దగ్ధం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని పోలీసులు నిరసనకారులకు హామీ ఇచ్చారు.

శంషాబాద్ సమీపంలో మరొక ఘటన:
వెటర్నరీ వైద్యురాలు  దారుణ హత్య జరిగి 24 గంటలు గడవకముందే శంషాబాద్ సమీపంలో మరొక ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల మహిళ మృతదేహం స్థానిక నిర్మానుష ప్రదేశంలో అనుమానాస్పద స్థితిలో గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా కోసం స్థానిక ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. మానభంగం జరిగిన విషయంపై పోలీసులు ఏవిధమైన స్పష్టత ఇవ్వనప్పటికీ, మృతదేహంపై ఉన్న గాయాలు మాత్రం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

కేరళలో మహిళపై అత్యాచారం చేసి హత్యచేసిన అక్రమ బంగ్లాదేశ్ వలసవాది:
అసోం నుండి వచ్చి కేరళలో స్థిరపడిన ఉమర్ అలీ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ నెల 27న కొచ్చి సమీపంలోని పెరుంబవూర్ సమీపంలో 42 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్యచేసి, గుర్తించడానికి వీలులేకుండా ఆమె ముఖాన్ని ఛిద్రం చేసాడు. ఉమర్ అలీ నిజానికి బంగ్లాదేశ్ నుండి అక్రమంగా దేశంలో చొరబడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.

వార్తలు ఆండ్రాయిడ్ ఆప్ ద్వారా చదవడానికి క్లిక్ చేయండి 

రాంచీలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం:
జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర భయోత్పాతం కలిగిస్తోంది.  25ఏళ్ల న్యాయ విద్యార్థినిపై 12 మంది కత్తులు, తుపాకులతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, అక్రమ ఆయుధాల చట్టాల కింద కేసు నమోదు చేశారు.

మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి 

గడిచిన 2 దశాబ్దాల్లో కేవలం ఒక్క శిక్ష మాత్రమే అమలు!
దేశవ్యాప్తంగా కేవలం కొద్ధి రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలపై ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు విచారణల పేరుతొ కాలయాపన చేయకుండా తక్షణం మరణ శిక్షలు విధించి అటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందికుంది. దేశవ్యాప్తంగా ఇన్ని ఘటనలు జరుగుతున్నా గత రెండు దశాబ్దాల్లో నిందితులకు ఎలాంటి శిక్షలు అమలు జరగలేదు (ఒక్కటి మినహా).

1990లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమె రెండు కాళ్ళు నరికివేసిన కేసులో కోల్కత్తాకు చెందిన ధనుంజయ్ ఛటర్జీ అనే వ్యక్తిని 2004లో ఉరితీశారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అతడి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడంతోనే ఇది సాధ్యపడింది. అప్పటికీ అనేక వామపక్ష సంస్థలు,మానవహక్కుల సంఘాలు ఉరితీతను వ్యతిరేకిస్తూ నిరసనలు నిర్వహించారు.

Source: Organiser