Home News 11 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)

11 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)

0
SHARE
• ఐసీయూ గదులు, ఏసి వసతులతో ఆసుపత్రి నిర్మాణం
• వెంటిలేటర్ వార్డుకి కల్నల్ సంతోష్ బాబు పేరు
ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైమానిక దళ స్థావరం వద్ద  రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) 250 ఐసియూ గదులతో కూడిన వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. టాటా సన్స్ సంస్థ సహాయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో సాయుధ దళాలకు చెందిన వైద్య సిబ్బంది వైద్యసేవలు అందిస్తారు.

ఢిల్లీ కంటోన్మెంట్ లో  సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 ఆసుపత్రి పేరిట నిర్మించిన ఈ భవంతిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల సందర్శించారు. వీరితో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  డి.ఆర్.డి.ఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి కూడా ఉన్నారు.

ఐసీయూ, వెంటిలేటర్ వార్థులకు కల్నల్ సంతోష్ బాబు పేరు

ఇటీవల కాలంలో జరిగిన చైనా సరిహద్దు ప్రాంతంలోని గాల్వన్ వ్యాలీ లోయలో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జవానుల పేర్లను ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో పెట్టాలని నిర్ణయించినట్టు  డి.ఆర్.డి.ఓ సాంకేతిక సలహాదారు సంజీవ్ జోషి అన్నారు. అందులో భాగంగా తెలంగాణ లోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు పేరుని ఐసీయూ మరియు వెంటిలేటర్ వార్డుకి పెట్టారు.

ఇప్పటికే ఢిల్లీలో అత్యంత పెద్దదైన కరోనా సంరక్షణ కేంద్రం నిర్మించబడింది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు సమీపంలో ఉన్న చతర్పూర్ ప్రాంతంలోని రాధాస్వామి సత్సంగ్ బ్యాస్ ప్రాంగణంలో నిర్మించిన ఈ కరోనా సంరక్షణ కేంద్రంలో ఒకేసారి 10 వేల మందికి పైగా చికిత్స చేయగల సామర్థ్యం ఉంది. ఇందులో వైద్యులతో సహా 2 వేలకు పైగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Source: Hindustan Times