Home News పాల్ఘర్ సాధువుల హత్యోదంతం: నిజ నిర్ధారణ కమిటి విచారణలో బయటకొస్తున్న వాస్తవాలు

పాల్ఘర్ సాధువుల హత్యోదంతం: నిజ నిర్ధారణ కమిటి విచారణలో బయటకొస్తున్న వాస్తవాలు

0
SHARE

దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో సాధువుల దారుణ హత్య ఘటన జరిగి రెండు నెలలు అయింది. ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్ను నడిరోడ్డు మీద కర్రలతో కొట్టి పైశాచికంగా కొట్టి హత్య చేసిన ఈ ఘటనను కరోనా లాక్ డౌన్ హడావుడి పేరుతో ప్రధాన మీడియా చాప కిందకు తోసేసింది.

కానీ మహారాష్ట్రకు చెందిన వివేక్ విచార్ మంచ్ అనే స్వచ్ఛంద సంస్థ మాత్రం ఈ దారుణంపై స్పందించింది. ఈ హత్య తాలూకు వాస్తవాలను శోధించేందుకు నిజ నిర్థారణ కమిటీ ను నియమించింది.  నిజ నిర్ధారణ కమిటి విచారణలో అనేక వాస్తవాలు బయటకొస్తున్నాయి.

బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంబదాస్ జోషి అధ్యక్షతన ఏడుగురు సభ్యుల కమిటీ ఏర్పడింది. న్యాయవాదులు సమీర్ కాంబ్లీ, ప్రవర్తక్ పాథక్, పాత్రికేయులు కిరణ్ షేలార్, సామాజిక వేత్త సంతోష్ జనథ్, మాజీ పోలీసు అధికారి లక్ష్మణ్ ఖార్పడే, స్వచ్చంద  సేవకులు శ్రీమతి మాయా పోతేదార్ లు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు.

ఘటన జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి, గ్రామస్తులను, సర్పంచ్ స్థాయి నాయకులను కలిసి వివరాలు సేకరించింది. సాధువులను చంపాలన్న క్రూరమైన ఆలోచన వెనుక కారణం ఏమిటి, ఈ విధంగా ప్రేరేపించినది ఎవరు, ఆదివాసీల ముసుగులో ఉన్న విద్రోహ శక్తులు ఎవరు అనే విషయాలపై కూలంకుషంగా జరిపిన విచారణలో దిగ్భ్రాంతిని కలిగించే అనేక విషయాలు బయటపడ్డాయి. మరెన్నో లోతైన అనుమానాలు కూడా కలిగాయి:

1. హత్యాకాండ జరిగిన వెంటనే ప్రభుత్వం ఒక నాటకానికి తెరదీసింది. “పిల్లల కిడ్నాపర్లు అనుకొని సాధువులను హతమార్చారు” అంటూ అప్పటికప్పుడే ఓ కథ అల్లి తమ యంత్రాంగం సహాయంతో ప్రచారం చేసేసింది. ఏమాత్రం విచారణ జరపకుండా ఈ విధమైన నిర్థారణకు ఎలా వచ్చారు?

2. హత్యకు సంబంధించిన వీడియో చూస్తే.. కాపాడమని సాధువులు ప్రాథేయపడుతుంటే పోలీసులు పట్టించుకోకుండా హంతకులకు వారిని అప్పగించినట్లు అర్థం అవుతోంది. హంతకులతో ప్రభుత్వ యంత్రాంగం చేతులు కలిపినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

3. ఘటన జరిగిన తరువాత, సమీపంలోని కాసా పోలీసు స్టేషన్ సిబ్బంది అందరినీ గుట్టుచప్పుడు కాకుండా ఇతర పోలీసు స్టేషన్లకు బదలీ చేసేశారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా రాబట్టడం ఎలా సాధ్యం అవుతుంది?

4. సాధువులపై దాడిని ప్రోత్సహిస్తూ వీడియోల్లో కనిపించిన కాశీనాథ్ చౌధరి అనే స్థానిక నేత జోలికి పోలీసులు వెళ్లడం లేదు. ఘటన జరిగిన తర్వాత అక్కడ పర్యటించిన రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్.. ఇదే వ్యక్తిని వెంటతీసుకుని తిరిగారు. అంటే నిందితులను ప్రభుత్వం ఏ విధంగా కాపాడుతోందో అర్థం చేసుకోవచ్చు.

5. హత్య జరిగిన గడ్చించలే గ్రామంలోని కొంత భాగం మహారాష్ట్రలో ఉంటే, మరికొంత భాగం కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో ఉన్నది. నిందితులు అక్కడ దాక్కుంటే ఈ కుంటి సాకును చూపించి స్థానిక పోలీసులు సరిహద్దులు దాటడం లేదు.

..ఈ వాస్తవాల్ని బట్టి చూస్తుంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం అవుతోంది. అసలు దోషుల్ని దాచిపెట్టి స్థానిక ఆదివాసీ యువకుల మీద తూతూ మంత్రంగా కేసులు పెట్టి కాలక్షేపం చేస్తోంది.

వాస్తవానికి ఈ ఘటనకు ముందు నుంచే పాల్ఘర్ జిల్లా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్యూనిస్టు ప్రభావిత సంస్థలు, నక్సలైట్ ఉద్యమకారులు చురుగ్గా పనిచేస్తున్నారు. వీరికి నిధులు సరఫరా చేస్తూ క్రైస్తవ మిషనరీ సంస్థలు మతమార్పిడిలకు పాల్పడుతున్నాయి. అమాయక ఆదివాసీలను తమ వైపు తిప్పుకోవటమే ఈ సంస్థల లక్ష్యం. ఇందులో భాగంగా అక్కడ వివిధ రకాల విద్రోహపూరిత చర్యలకు పాల్పడుతున్నాయి.

నిజనిర్ధారణ కమిటీ విచారణ సందర్భంగా  ఈ క్రింది విషయాలు దృష్టికి వచ్చాయి:

1. భారత రాజ్యాంగాన్ని, భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నది ఈ సంస్థల ఉద్దేశ్యం. ఇందుకు అనుగుణంగా స్థానిక ప్రజల్లో దేశం పట్ల, సమాజం పట్ల వ్యతిరేకతను పెంచుతూ వచ్చారు.

2. ప్రజా ప్రతినిధులు, అధికారులను అటువైపు రాకుండా అడ్డుకొంటుంటారు. గ్రామాల్లో అడుగు పెడితే దాడుల చేయటం, వాహనాలను తగల బెట్టడం వంటివి చేస్తుంటారు.
3. ఆదివాసీలకు మేలుచేసే అభివృద్ది పనులను ఈ సంస్థలు మూకుమ్మడిగా అడ్డుకొంటాయి. సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను బెదిరించి పంపించేస్తుంటారు.

4. ఈ గ్రూపులు చేసే అతి ముఖ్యమైన పని హిందుత్వంపై విషాన్ని చిమ్మటం. పురాణాలు, హిందూ దేవుళ్ల పై వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. మత మార్పిడికోసం ప్రజలకు ఈ విషాన్ని నూరిపోస్తుంటారు.

ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న సంస్థలను నిజనిర్థారణ కమిటీ గుర్తించింది. పేర్లతో సహా బయట పెట్టింది. కష్టకారీ సంఘటన్, భూమిసేన, ఆదివాసీ ఏక్తా పరిషత్, కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ సంస్థలకు చెందిన కొందరు నాయకులు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తించింది. సాధువుల హత్యకు కూడా ఇటువంటి నాయకులే కారణమని నిర్ధారణ చేసింది. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే వీరి బాగోతాలన్నీ బయట పడతాయి. దోషులు హాయిగా తిరుగుతుంటే, కొందరు ఆదివాసీల మీద మాత్రమే కేసులు పెట్టారని నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. సీబీఐతో కానీ, ఎన్ ఐ ఎ తో కానీ సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.

Source: www.organiser.org