Home News దేశ భవిష్యత్తు… పాఠశాల తరగతి గదిలో – శ్రీ లింగం సుధాకర రెడ్డి

దేశ భవిష్యత్తు… పాఠశాల తరగతి గదిలో – శ్రీ లింగం సుధాకర రెడ్డి

0
SHARE

బెంగళూరులో స్థిరపడిన శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల తెలుగు రాష్ట్రాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బెంగళూరులోని జైగోపాల్ గరోడియా రాష్ట్రోత్తాన విద్యాలయం(కల్యాణనగర్) ప్రాంగణంలో, జూన్ 29, 2019న ఎంతో వైభవంగా జరిగింది.

దాదాపు 130మంది పాఠశాల పూర్వ విద్యార్థులు, తమకుటుంబాల నుండి వచ్చిన చిన్నారులతో కలిసి, తమ చిన్ననాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. వారి జీవితాలను విజయవంతం చేయడానికి, అగ్రశ్రేణి ఉద్యోగాలు చేస్తున్నందుకు దోహదపడిన వారి ఉపాధ్యాయుల ఆచార్య బృందాన్ని, తమకు “విలువల ఆధారిత” విద్యను ప్రసాదించిన పాఠశాలను, ఎంతో అభిమానంతో గుర్తుచేసుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో,  ఉపస్థిత పూర్వవిద్యార్థులందరూ తమకు నిర్మాణాత్మక విద్యను ప్రసాదించిన పాఠశాల అనుభవాలను, తమ కృతజ్ఞతాపూర్వక అభిప్రాయాలను అందరితోపంచుకొన్నారు. పూర్వ విద్యార్థుల సభలో ప్రసంగించిన ముఖ్య ఉపన్యాసకులైన విద్యాపీఠం దక్షిణమధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి (“అఖిల భారతీయ శిక్షాసంస్థాన్ అనుబంధంగా ఉన్న సంస్థ విద్యాభారతి) శ్రీ లింగం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ, “తరగతి గది భవిష్యత్తులోనే, దేశం తన భవిష్యత్తును రచనాత్మకంగావిస్తుంది” అన్నారు.

వారు ప్రస్తుత విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ, “ఇది అద్భుతమైన వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు, ఉపాధ్యాయులు మరెన్నో నిపుణులను ఉత్పత్తి చేస్తుంది గాక, కాని వారందరినీ మానవ విలువలను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్న నిపుణులుగా వ్యక్తి నిర్మాణంగావిస్తున్నదా?”అని ప్రశ్నించారు.            

 “ప్రస్తుత విద్యావిధానం పిల్లలకు సంస్కారాలను ముఖ్యధారలో అందించనందున, తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించడం అత్యంత అవశ్యకం. తీవ్ర పనిఒత్తిడిలో నిమగ్నమై ఉన్నా, తల్లిదండ్రుల చురుకుగా తమ పిల్లల సంపూర్ణ అభివృద్ధి గురించి బాధ్యతవహించాలి”, అన్నారు. సుమారు పది వేలకు పైగా ఉపస్థితులయ్యే సరస్వతి శిశుమందిరాల పూర్వవిద్యార్థుల బృహత్ సమావేశాన్ని డిసెంబర్ 29, 2019 న భాగ్యనగరంలో నిర్వహింపబోతున్నామనీ, ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలక్  పరమ పూజనీయ శ్రీ మోహన్ జీ భగవత్  విచ్చేయడం మనమందరి అదృష్టంఅనీ,   కావున ఈ బృహత్కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి బెంగళూరులో స్థిరపడ్డ శిశుమందిర్ పూర్వ విద్యార్థులంతా ఒక్కటై పనిచేయాలనీ, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్థిరపడిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పూర్వ విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక ఆహ్వానాన్నిఅందించాలని ఆయన కోరారు.

శిశుమందిర్ పూర్వ విద్యార్థి సంఘం (తెలంగాణ, ఆంధ్రప్రాంతాలపూర్వవిద్యార్థిపరిషత్) అధ్యక్షులు శ్రీ హరిస్మరణ్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ ఇతిహాసాన్ని సంరక్షించేందుకు పాఠాశాలలలో భారతీయ ఇతిహాసాన్ని బోధించే దిశలో పాఠాశాలలు మరింత ప్రముఖ పాత్రవహించాలని, రాబోయేతరానికి శిశుమందిర పూర్వవిద్యార్థులను, ఉపాధ్యాయులూ కలిసిపనిచేయాలని కోరారు.

హిందూ సంప్రదాయానికి అనుగుణంగా, పూర్వ విద్యార్థులు గురువందనం చేస్తూ శాలువతో అతిథులను సత్కరించారు. శిశుమందిర్ ఆచార్యలు వారి ఆశీర్వాదానికి చిహ్నంగా, ప్రతి పూర్వవిద్యార్థికీ నాలుగుపుస్తకాలను బహుమతిగా ఇచ్చారు:

కార్యక్రమాన్నిశాంతిమంత్రం తరువాత భోజనం ద్వారాముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here