Home News శ్రీ పరిపూర్ణనంద స్వామిపై విధించిన నగర బహిష్కరణ ఎత్తివేయాలి – హిందూ ఐక్య వేదిక

శ్రీ పరిపూర్ణనంద స్వామిపై విధించిన నగర బహిష్కరణ ఎత్తివేయాలి – హిందూ ఐక్య వేదిక

0
SHARE

ఆద్యాత్మిక వేత్త, శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణనంద స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని హిందూ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని కరీంనగర్, వరంగల్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు విమర్శించారు.

కరీంనగర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న పలు ధార్మిక, ఆద్యాత్మిక సంస్థలు, దేవాలయాల పాలక వర్గ ప్రతినిధులు దేశ సౌబాగ్యం, ధర్మ నిరతి కోసం పాటుపడుతున్న స్వామీజీ పై మోపిన అభియోగాలు ఉపసంహరించుకుని ప్రభుత్వం హిందూ సమాజానికి  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్, బాబు గోగినేని పై తగు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా tv9 చానల్ ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ , వెంటనే తగు చర్యలు చేపట్టాలని,  లేకపోతే హిందువుల ఆగ్రహానికి గురికావలసివస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ గౌతం రావు, వికాస తరింగిణి అధ్యక్షులు, కోమల్ల రాజేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి శ్రీ, గజెందర్ రెడ్డి, ప్రముఖ కవి, ఎలుగందుల సత్యనారాయణ, ప్రజ్ఞా భారతి, ఉప్పులేటి లక్ష్మణ్, ఎస్ సి ఎస్ టి పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలుకపాటి హనుమంత రావు, అంజానాద్రి గుట్ట ధర్మకర్త, ఎస్ కోదండరాములు, బి సి వెల్ఫేర్ అధ్యక్షులు, వేముల విష్ణు, పద్మశాలి జిల్లా అధ్యక్షులు, దారం వినోద్, సుందర సత్సంగ్ అధ్యక్షులు, డా రఘు రామన్, ప్రముఖ వైద్యులు, రోడ్రోజు స్వప్న రాణి, ప్రిన్సిపాల్, న్యాలమడుగు శంకరయ్య, నవనీత రావు, పుల్లూరు రామారావు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వరంగల్ :

హన్మకొండలోని రాజ రాజనరేంద్ర భాషా నిలయంలో ప్రముఖ న్యాయవాది తూర్లపతి మహేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మరో  రౌండ్ టేబుల్ సమావేశంలో  హిందూ సంఘాల, ధార్మిక సంఘాల, కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. స్వామీజీని  నగర బహిష్కరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను గాయపరించిందని అంతా నిరసన వ్యక్తం చేశారు.  అసాంఘిక శక్తులకు విధించాల్సిన శిక్షను పూజ్య స్వామీజీ కి విధించడం దారుణమని ముక్తకంఠంతో ఖండించారు. రానున్న రోజుల్లో తెలంగాణాలో హిందువుల మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ సమావేశం లో మార్వాడి సంఘం నాయకులూ వెను గోపాల్ మూన్డద, కురుమ సంఘం నాయకులూ మండల మొగిలి, గంగాపుత్ర సంఘం నాయకులూ శ్రీ పాక ఓంప్రకాష్, మున్నూరు కాపు సంఘం నాయకులూ శ్రీ గందే కృష్ణ, కె యు ప్రొఫెసర్ శ్రీ విజయబాబు, ప్రముఖ కవి శ్రీ రాజ మోహన్, విశ్వ హిందూ పరిషత్ నాయకులూ శ్రీ జయపాల్ రెడ్డి, శ్రీ కట్ట రమేష్, అర్ ఎస్ ఎస్ భాద్యులు శ్రీ  పెద్ది రెడ్డి మల్లా రెడ్డి, డా సి హెచ్ సుధాకర్ రావు, శ్రీ మంద శ్రీనివాస్, లెక్చరర్, లాయర్ ఆదిరెడ్డి, వివిధ ధార్మిక  సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.