Home Telugu Articles హిందూ ఉగ్రవాద కల్పిత కర్తలను గుర్తించండి

హిందూ ఉగ్రవాద కల్పిత కర్తలను గుర్తించండి

0
SHARE

ఫిబ్రవరి 19, 2007.. భారత్ నుండి పాకిస్థాన్ వెళ్తున్న సంజౌతా ఎక్స్ ప్రెస్ రైలులో జరిగిన శక్తివంతమైన పేలుళ్ల వల్ల దాదాపు 70కి పైగా ప్రయాణికులు, గార్డ్ లు చనిపోయారు . హఠాత్తుగా పానిపట్ వద్ద పేలుడు సంభవించింది. మారణకాండ సాగించిన పాకిస్థాన్ సైనిక దళాలపై భారత సైన్యం, ముక్తిబాహిని సమైక్య దళాల 1971 విజయానికి గుర్తుగా , భారతదేశం-పాకిస్థాన్ రైలు సేవ జూలై 22, 1976 న ప్రారంభమైంది. యుద్ధంలో పాకిస్థాన్ పూర్తిగా ఓటమి పాలయ్యింది. యుద్ధ ఖైదీలను బేషరతుగా వదిలిపెట్టాలని పాకిస్తాన్ ప్రధాని భుట్టో భారత ప్రధాని ఇందిరా గాంధీని కోరారు. అందుకు అంగీకరించిన భారత్ 93 వేలమంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను భారత్, బంగ్లాదేశ్ సైనిక కోర్ట్ లో మారణకాండకు సంబంధించి ఎలాంటి విచారణ జరపకుండానే బేషరతుగా వదిలిపెట్టింది.

జమ్మూ & కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణకుగానీ, 1965 లో తాష్కెంట్ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ కు ఇచ్చిన హాజీ పీర్ ను తిరిగి భారత్ కు అప్పగించేందుకు గాని ప్రధానమంత్రి భుట్టోను ఒప్పించలేకపోయారు. చాలా కాలంగా పాకిస్తాన్ జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పలువురు ఖైదీలను (సాయుధ దళాల సభ్యులతో సహా) విడిపించేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం యుద్ధరంగంలో సంపాదించిపెట్టిన విజయాలను భారత్ చర్చల పేరుతో వదిలిపెట్టుకుంది. ఈ చర్చల్లో కూడా ప్రధాని భుట్టో నుండి షాలిమార్ అత్తరును తప్ప మరేమీ పొందలేకపోయింది. ఒకసారి ఆర్మీ స్టాఫ్ జియా-ఉల్-హక్ ఛైర్మన్ పదవి నుండి తొలగించబడి, ఉరితీయబడ్డాడు. అతను ఖలీస్తాన్ ఉద్యమాన్ని భారతదేశంలో ప్రారంభించే ప్రక్రియలో సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను తరచుగా ఉపయోగించాడు, ఇది ఒక దశాబ్దం కన్నా ఎక్కువ పంజాబ్ లో అల్లకల్లోలం సృష్టిస్తుంది అని భావించాడు. జాతీయ భద్రతకు సంబంధించిన అనేక సంఘటనలు భారతదేశంలో జరిగాయి. స్థానిక ఉద్యోగులను ఉపయోగించి, GHQ రావల్పిండి ఆదేశాలపై పేలుడు జరిగిందని సాక్ష్యం ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంగా ఒక విచారణ ప్రారంభమైంది. రెండు సంవత్సరాల క్రితం సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో జరిపిన పేలుళ్లలో పాకిస్థాన్ దేశీయుడు ఆరిఫ్ ఖాన్ హస్తం ఉందని అమెరికా జరిపిన స్వతంత్ర విచారణలో తేలింది.
పాకిస్తాన్ ఎంత త్వరితంగా ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా మారుతోందో వివరించే వ్యాసాలను ది సన్డే గార్డియన్ ప్రచురించింది. అందులో రావల్పిండి అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల విధానాన్ని బయటపెట్టింది. తమ నుండి ప్రపంచ దృష్టిని మళ్ళించటానికి, GHQ రావల్పిండి భారతదేశం కూడా ఒక ఉగ్రవాద కేంద్రంగా మారిందంటూ ప్రచారం ప్రారంభించింది. ముఖ్యంగా, ఉగ్రవాద ముఠాలు మెజారిటీ వర్గానికి చెందినవని ప్రచారం చేసింది. పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో వహాబీ సమూహాలు ఎలాగైతే హత్యాకాండకు పాల్పడుతున్నాయో భారత్ లో మెజారిటి వర్గానికి చెందిన ముఠాలు అలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నాయని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది. కొన్ని చర్చిలపై దాడులు చేయడానికి, గొడ్డు మాంసం దొంగరవాణా చేయడానికి తప్ప ఈ ఉగ్రవాదులు ఎందుకు పనికిరారని వ్లాదిమిర్ పుతిన్ కూడా అన్నారు. వీళ్ళకు తాము ISI కోసం పనిచేస్తున్నమనే సంగతి కూడా తెలియదు. భారతదేశంలో ఐఎస్ఐ నియమించిన వారిలో ఆరవవంతు హిందూ లేక ముస్లిమేతర వర్గాల నుండి వచ్చారని, మరో ఐదు శాతం ముస్లిం సామాజిక వర్గం నుండి ఉన్నారని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలను అధ్యయనం చేసేవారు అంటున్నారు. వీరంతా తమకు తెలియకుండానే ISI కార్యకలాపాల్లో పాల్గొంటారు. భారతదేశంలోని నగరాల్లో ISI ఎజెంట్ మరియు అధికారులు భాద్యతాయుతమైన పదవులలో కొందరు ఉన్నారు. వీరు ISI కార్యకలాపాలకు తగినట్లుగా భారతదేశంలో విధానాలను సైతం ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. ఈ కార్యకలాపాలను రెండు రకాలుగా విభజించవచ్చును :

ఎ) దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు

(బి) భారతదేశం “హిందూ ఉగ్రవాదం” పిడికిలిలో ఉందనే ఐఎస్ఐ ప్రచారానికి దోహదపడే విధంగా బూటకపు ఆపరేషన్లు (గొడ్డు మాంసాన్ని రవాణా చేయడానికి లేదా నిల్వ చేసే అనుమానం ఉన్నవారి హత్యకు సంబంధించిన కొన్ని కేసులు వంటివి) సృష్టించడం.

పాకిస్థాన్ లో కార్యకలాపాలపై భారత్ లో ఏజెన్సీలకంటే చైనా, అమెరికాలు ఎక్కువ నిఘా పెడుతున్నాయి. భారత్ లో మెజారిటీ వర్గం తివ్రవాదులనే ముద్ర వేయడం కోసం పాకిస్తాన్ 2007 నుంచి ప్రణాలికాబద్దంగా ప్రచారం చేస్తోందనే విషయాన్ని ఈ రెండు దేశాలు గ్రహించాయి. తమ దేశంలో వహాబీ మూకలు ఎలా ఉన్నాయో భారత్ లో మెజారిటి వర్గానికి చెందినా తీవ్రవాద ముఠాలు అలా ఉన్నాయని ప్రచారం చేసేందుకు, చిత్రించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందనే విషయాన్ని సండే గార్డియన్ అనేకసార్లు నిర్ధారించింది.

సంఝౌతా పేలుడుకు ISI పాల్పడడానికి చాలా కారణాలు ఉండవచ్చును. ఒకటి ఆ రైలులో ఎక్కువమంది పాకిస్థాన్ పౌరులు ప్రయాణిస్తుంటారు. కాబట్టి పేలుడుకు తాము కారణమనే అనుమానం తమపైకి రాకుండా ఉంటుంది. రెండవది, పేలుడుకు హిందూ తీవ్రవాదులే కారణమనే ప్రచారానికి మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే భారత్ లో ఉన్న తమ ఏజెంట్ల ద్వారా ఇలాంటి మరిన్ని పేలుళ్లు జరిపించవచ్చని ISI భావించింది. అయితే ఈ కార్యకలాపాలు వహాబీ సమూహాలు సృష్టించే భీభత్సం ముందు చాల చిన్నవి. ముంబై దాడుల్లో ఉగ్రవాదులకు సహాయపడింది ఈ వహాబీ సమర్ధకులేనని విచారణలో తేలింది. దాడులు జరపాల్సిన ప్రదేశాల పూర్తీ వివరాలు ఉగ్రవాదులకు వీరే అందించారు. దాడులతో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్ పదేపదే నిరాకరించినప్పటికీ వీటి వెనుక ఉన్నది ISI సంస్థే అని అమెరికా వర్గాలకు తెలుసు. కసాబ్ పట్టుబడినా ముంబై, డిల్లీలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాత్రం దాడుల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే విషయం అంగీకరిచలేకపోయారు. కొందరైతే `పాకిస్థాన్ కు చెడ్డపేరు తేవడం కోసం భారతీయ సంస్థలే ఈ దాడులకు పాల్పడ్డాయని’ ప్రచారం కూడా చేసారు. ఇలాంటి వాళ్ళే ISI కి పనికివచ్చే `మూర్ఖులు’.

`హిందూ తీవ్రవాదం’ అనే అభూత కల్పనను సృష్టించిన కొందరు అధికారులు, రాజకీయనాయకులను గమనిస్తే, వారిలో కొందరు తప్పనిసరిగా ISI తో సహకరించి పనిచేస్తున్న ఏజెంట్లని మనకు తెలుస్తుంది. అధికారులు, రాజకీయనేతల ఈ విష వలయాన్ని ఛేదించడానికి బిజెపి ప్రభుత్వం తగిన విచారణ, దర్యాప్తు ఇప్పటివరకు చేపట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

`హిందూ తీవ్రవాదం’ అనే అభూత కల్పనాను సృష్టించడంలో తమతోపాటు పనిచేయడం లేదా సహకరించాలని ఒత్తిడి తెచ్చారని, హింసించారని కొందరు మాజీ ప్రభుత్వాధికారులు వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పత్రాలను మార్చడానికి కొందరు ప్రయత్నించారు. అఫిడవిట్లను తమకు తోచినవిధంగా తయారుచేసి హిందూ తీవ్రవాదాన్ని నిరూపించాలనుకున్నారు. కేవలం అధికారులే కాదు ఏకంగా ఇద్దరు హోమ్ మంత్రులు, వారి మాట తూచ తప్పక పాటించే అధికారులు హిందువులు తీవ్రవాదులు అని `నిరూపించేందుకు’ తమ శాయశక్తుల ప్రయత్నించారు. ఇవన్నీ బయటపడిన ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తగిన విచారణ మాత్రం చేపట్టలేదు. వీరే సంఝౌత పేలుడు కేసులో ISI పాత్ర నుంచి అందరి దృష్టిని మళ్లించడానికి మెజారిటీ వర్గానికి చెందిన కొందరు అమాయకులను బలిపశువులు చేయాలని చూశారు. క్రయోజెనిక్ ఇంజన్ తయారీ కార్యక్రమంలో కూడా ఇదే తరహా కుట్రను వారు అమలు చేశారు. విదేశీ గూఢచారి సంస్థ కోసం వీరు ఇంజన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న శాస్త్రవేత్తలపై బూటకపు కేసులు బనాయించారు. అయితే అన్యాయపు ఆరోపణలు ఎదుర్కొన్న నంబినారాయణన్ నిర్దోషి అని ఇటీవల కోర్టులు తేల్చినా ఇంతటి కుట్రకు పాల్పడినవారు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు.

మహాత్మా గాంధీ ఎంతటి సహనశీలి అంటే ఆయన అడాల్ఫ్ హిట్లర్ అకృత్యాలను కూడా క్షమించేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గాంధీని అనుసరిస్తూ రావల్పిండి గూఢచారి సంస్థ కనుసన్నల్లో మెలుగుతూ భారత దేశానికి, ఇక్కడి మెజారిటీ వర్గానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారిని క్షమించేసినట్లుంది. కానీ ఇలాంటి కుట్రదారుల బండారాన్ని బయటపెట్టి, శిక్షించకపోతే క్రయోజనిక్ ఇంజన్ తరహా, హిందూ తీవ్రవాదం తరహా కుట్రలు మరిన్ని జరిగే ప్రమాదం ఉంటుంది. అవి దేశ ప్రతిష్టను, బలాన్ని దెబ్బతిస్తాయి.

__ఎం డి నాల్పత్

(రచయిత డైరెక్టర్, జియోపాలిటిక్స్, మణిపాల్ విశ్వవిద్యాలయం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here