Home News ప్రజాస్వామ్యనికి ప్రతీక హైందవ ధర్మం

ప్రజాస్వామ్యనికి ప్రతీక హైందవ ధర్మం

0
SHARE

‘గంగా నదీ’ సంగమంలా అన్ని కల్మషాలను తనలో కలుపుకుంటూ వెళ్తుంది హిందూమతం. తనో చెత్తాచెదారం ఇతరులు కలిపినా తన ప్రవాహం ఆగకుండా గంగ ప్రవహించినట్లు హిందూమతం ముందుకు వెళ్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం, కమ్యూనిజం, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ, జైనం… ఇలా ఎన్నో రకాల వైవిధ్యాలను హిందువులు ఈ దేశోం భరిస్తారు. కారణం హిందూ ధర్మంలో మౌలిక ప్రజాస్వామ్య సూత్రాలే.. హిందూమతంలో అంతర్భాగాలైన శైవ,వైష్ణవ, బౌద్ధ, జైన, సిఖ్ఖు మతాలకు ఎలా ప్రాధాన్యం ఇస్తుందో ఇతర దేశాల నుండి దిగుమతి అయిన మతాలకు హిందూత్వం అంతే ప్రాధాన్యం ఇస్తుంది. అదే హిందూమతంలోని ప్రజాస్వామ్యానికి నిదర్శనం.

హిందూమతంలో ఆచరణాత్మక ప్రజాస్వామ్యం..
సాకార – నిరాకారాలు

హిందుత్వం సాకార – నిరాకారాలను అంగీకరిస్తుంది. మనం ఇచ్చిన నిరాకారమే ఇతర మతాలు అవలంభిస్తున్నాయి.  వయసుల వారీగా, శరీరాలవారీగా చొక్కాలు కుట్టించుకోవడం సరైంది. కానీ అందరికీ ఒకే చొక్కా కుట్టించి తొడుక్కో అనడం అప్రజాస్వామ్యం. అందుకే మనుషుల మనసు పరిపక్వతలను బట్టి మన ఆరాధన పద్ధతులున్నాయి. సాకారం నుండి మొదలు పెట్టి నిరాకారం వరకు చేరి మోక్షాన్ని పొందడం మన ధర్మ ప్రబోధం.

 పండుగ – పర్వం

హిందువులను ఫలానా పండుగ ఈరోజే చేసుకోవాలి అని ఏ స్వామీజీ చెప్పడు- ఆదేశించడు. ఖగోళ విజ్ఞానం తెలిసిన మన పండితులు పంచాంగంలో ఎలా రాస్తే, అలాగే ప్రజలు ఆచరిస్తారు. అతిసహజంగా తమ ఉత్సవాలను హిందువులు జరుపుకుంటారు. ప్రతీ పండుగలో తాత్విక, ఆధ్యాత్మిక, సామాజిక, ఖగోళ విజ్ఞానం నిక్షిప్తమై ఉంటుంది. అవన్నీ తెలియకుండానే హిందువులను ప్రభావితం చేస్తాయి.

జీవన విధానం

మనకు కుటుంబ వ్యవస్థ సామాజికపరంగా వచ్చిన జీవన విధానం దానిో బంధాలు – అనుబంధాలు మన స్వంతం. అవి చట్టపరమైన వాటికన్నా నైతికపరంగా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. నైతిక బంధంలోనే కుటుంబ సంబంధాలు వెల్లివిరుసాుు్త. మన ఆచార – సంప్రదాయాలు అన్నీ నిత్యజీవన విధానోం భాగమే. అందుకే భారత అత్యున్నత న్యాయస్థానం ‘హిందూత్వం ఓ జీవన విధానం’ అని తీర్పును ఇచ్చింది. ఇంత వైవిధ్యం హిందువుల్లో – హిందూత్వంలో ఉంది కాబట్టే భాష, కులం, ప్రాంతం, మతం  అనే వాటిని సులభంగా అధిగమిస్తున్నారు హిందువులు. అదే మన ప్రజాస్వామ్య విజయానికి కారణం.

 మన ఆధ్యాత్మికం

హిందువుో్ల ఫలానా దేవుణ్ణి మాత్రమే పూజించాలనే నిర్దేశం – ఆదేశం లేదు. మత విషయం మనిషి స్వేచ్ఛకు పరిమితం అని హిందూత్వం భావించింది. అలాగే జీవితమంతా ఆధ్యాత్మ్యం, తత్వం నిండి ఉంటుంది. మన ప్రతి పనిలో ఆధ్యాత్మికత, తాత్వికత కన్పిస్తుంది. పుట్టినప్పటి నుండి మనం చేసే ప్రతి పనిలో ఆధ్యాత్మికత వెతుకవచ్చు. హిందూత్వంలోని మూల సూత్రాలు ప్రజాస్వామ్య, లౌకిక భావాలకు తగినట్లుగా హిందువులను మార్చివేశాయి. ఇప్పుడు మనకు ప్రబోధలు చేసే సోకాల్డ్ సెక్యులరిస్టులు మనకేం చెప్పాల్సిన అవసరం లేదు. మన రక్తంలోనే ప్రజాస్వామ్యం ఉంది. అది ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది.

“హిందూధర్మం గంగా ప్రవాహం…
ఇది ఎప్పటికీ ఆగదు
మలినాలు 
కలగలుపుకొన్న గంగమ్మ
ఆగకుండా ప్రవహించే
అమృత ఝరి!
అలాగే సృష్టిలోని సమస్త
ఆధ్యాత్మిక సూత్రాలను
తన పునాదిరాళ్లుగా
కలిగిన హిందూత్వం
ప్రపంచ ప్రజాస్వామ్య భావనకే
వసుధైకకుటుంబకమ్
అని పాఠం చెప్పింది..

-డా. పి భాస్కరయోగి

(విజయక్రాంతి సౌజన్యం తో)