Home News హైదరాబాద్: ముగ్గురు రోహింగ్యా శరణార్థుల అరెస్ట్

హైదరాబాద్: ముగ్గురు రోహింగ్యా శరణార్థుల అరెస్ట్

0
SHARE
ముగ్గురు రోహింగ్యా శరణార్థులను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లిములైన ఇబ్రహీం, నూర్ ఉల్ అమీన్ మరియు షేక్ అజార్ అక్రమంగా  భారతీయ ఓటర్, ఆధార్ మరియు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు భారతీయులుగా చెలామణి అయ్యేందుకు గుర్తింపు కార్డుల సహాయంతో పాస్ పోర్ట్ ల  కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో మహ్మద్ అజార్ అనే వ్యక్తి 2012లో భారతదేశంలో కాలపరిమితికి మించి అక్రమంగా నివాసం ఉన్న కేసులో అరెస్ట్ అయ్యి జైలుశిక్ష కూడా అనుభవించాడు. అనంతరం అతడు తన పేరుని షేక్ అజార్ గా మార్చుకుని ఇక్కడ నివాసం ఉంటున్నాడు.
వీరిలో మరొక వ్యక్తి ఇబ్రహీంతో పాటు నూర్ ఉల్ అమీన్ 2015 నుండి హైద్రాబాదులో నివాసం ఉంటున్నారు.
ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. నిందితులు మొదట కరెంట్ బిల్లుల ఆధారంగా ఓటర్ గుర్తింపుకార్డు మరియు డ్రైవింగ్ లైసెన్సులు సంపాదించి, వాటి ఆధారంగా ఆధార్, రేషన్ మరియు ఇతర గుర్తింపు కార్డులు  సంపాదించారని, ఇప్పుడు వాటి ద్వారా ఏకంగా పాస్ పోర్ట్  కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.
హైదరాబాద్ బాలాపూర్ ప్రాంతంలో ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరాల్లో 18 వేల మంది రోహింగ్యాలు అధికారికంగా నివాసం ఉంటున్నారు.

Source: The News Minute