Home News తెలంగాణ: వరుస అత్యాచార ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ మహా ర్యాలీ  

తెలంగాణ: వరుస అత్యాచార ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ మహా ర్యాలీ  

0
SHARE

హైదరాబాద్ శివారులో జరిగిన ఘోర సామూహిక అత్యాచారం, పాశవిక హత్యను నిరసిస్తూ డిసెంబర్ 2న అఖిలభారత విద్యార్థి పరిషద్ బాగ్ లింగంపల్లి పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు వేలాదిమంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించింది.

ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నిధి త్రిపాఠి ప్రసంగిస్తూ “తెలంగాణలో జాతీయ జెండా కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన సామా జగన్ మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఏబీవీపీ ముందుకెళ్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దురదృష్టవశాత్తు తెలంగాణాలో జరుగుతున్న వరుస సంఘటనలను ఏబీవీపీ తమ దేశ వ్యాప్త నిరసనలతో తీవ్రంగా ఖండిస్తోందని,  కేవలం పోలీసుల, ప్రభుత్వ  ఉదాసీనత వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. 

వరంగల్ కేంద్రంగా 9 నెలల పసిపాపపై అత్యాచారం, హనుమకొండలో మానస సంఘటన, హైదరాబాద్ నగర శివారులో ‘దిశ’ అత్యాచార, పాశవిక హత్య.. ఈ వరుస ఘటనలన్నీ కేవలం పోలీసుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అలసత్వం కారణంగానే జరిగాయని తెలియజేస్తూ పోలీసుల , ప్రభుత్వ పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 

‘దిశ’ ఘటనపై తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి బాధ్యతరాహిత్య వ్యాఖ్యలు చేశారని, వారి యొక్క పనితీరుకు ఇది నిదర్శనమని పేర్కొంటూ..  రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండటం సరికాదన్నారు. హోం మంత్రిని వెంటనే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలన్నారు.ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గొప్పలకు పోయిన ముఖ్యమంత్రి తెలంగాణా ఆడపడచు ‘దిశ’ విషయంలో ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు.  

నేషనల్ క్రైమ్ రికార్ట్స్ బ్యూరో  నివేదిక ప్రకారం ఎక్కువ సంఖ్యలో  లైంగిక వేధింపుల  కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయని విశ్లేషించిన నిధి త్రిపాఠి..  శంషాబాద్ లో బాదితురాలు హత్యకు గురైన ప్రదేశానికి వెళ్ళినపుడు ‘దిశ’ గురైన ఆవేదనను అర్ధం చేసుకోగలిగానని, బాధితురాలికి రక్షణ కల్పించలేకపోయిన పొలిసు వ్యవస్థ, నిందితులకు మాత్రం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమేంటని ఈ సందర్బంగ ఆమె ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రారంభించిన షీ టీం కేవలం షో టీంగా మారిందని శ్రీనిధి త్రిపాఠి విమర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు  ఏబీవీపీ  ఈ ఆందోళనను ఇలాగే  దేశ వ్యాప్త ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తుందని, మహిళా భద్రతే దేశ భద్రత అని ఆమె తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ల ద్వారా  అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు వెంటనే మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేసారు.

కార్యక్రమంలో  అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి గుంత లక్ష్మణ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి నిరంజన్, సహ సంఘటన కార్యదర్శి శివకుమార్, జాతీయ కార్యదర్శి  ఐనాల ఉదయ్ , సెంట్రల్ వర్కింగ్ కమిటి మెంబర్ ప్రవీణ్ రెడ్డి , గ్రేటర్ హైద్రాబాద్ మహానగర కార్యదర్శి శ్రీహరి, జాతీయ కార్యవర్గ సభ్యులు అభిషేక్,  స్వరూప , ఎల్లస్వామి, శ్రావణ్ రెడ్డి, అంబికా, శిరీష,  తదితర నాయకులూ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here