Home News ఇమామ్ చేతిలో దాడికి గురైన పూజారి చికిత్స పొందుతూ మృతి

ఇమామ్ చేతిలో దాడికి గురైన పూజారి చికిత్స పొందుతూ మృతి

0
SHARE
వరంగల్: స్థానిక ఎల్బీ నగర్ మసీదు ఇమామ్ సయ్యద్ సాధిక్ హుస్సేన్ దాడిలో తీవ్రంగా గాయపడిన పోచమ్మ మైదానం శివసాయి దేవాలయ పూజారి సత్యనారాయణ ఈరోజు ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అక్టోబర్ 26వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో సత్యనారాయణ తన రోజూవారి దినచర్యలో భాగంగా సాయిబాబా ఖడ్గ హారతి సందర్భంగా మైక్ సిస్టమ్ వేశారు. అదే సమయంలో ఎల్ బి నగర్ కు చెందిన ఒక మసీద్ ఇమాం సయ్యద్ సాదిక్ హుస్సేన్ మైక్ ఆపాలంటూ గొడవకి దిగాడు. హారతి సమయం కావున మైక్ ఆపడం సాధ్యం కాదని చెప్పడంతో సయ్యద్ ఇమామ్ వృద్ధుడు అని కూడా చూడకుండా పూజారి మీద విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. దాడికి గురైన పూజారికి ప్రక్క ఎముకలు విరగడంతో పాటు కాలేయం దెబ్బతిని తీవ్ర రక్తస్రావం జరిగింది.
పూజారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో అతనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలంటూ హిందూ సంఘాలు, సామాజిక సంస్థలు అనేక వినతులు సమర్పించి, నిరసనలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేదు.
పూజారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత సాయంత్రం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పూజారి సత్యనారాయణ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
పూజారి హత్య వెనుక ఉన్న కుట్రదారులందరినీ అరెస్ట్ చేయాలని, హత్యకు పాల్పడిన మసీదు ఇమాంకి ఉరిశిక్ష విధించాలని విశ్వహిందూ పరిషత్ అర్బన్ అధ్యక్షులు కేశిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రాంత ఉపాధ్యక్షులు ఎన్. భాస్కర్ రావు, వరంగల్ జిల్లా కార్యదర్శి కె. రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.  రోజురోజుకూ హిందువులపైనా, హిందూ విశ్వాసాలపైనా జరుగుతున్న దాడులను అరికట్టేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం మైనారిటీ సంతుష్టీకరణ వీడి హిందూ ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు.
దాడిలో మరణించిన పూజారి సత్యనారాయణ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపడంతో పాటు శివసాయి దేవాలయానికి రక్షణ కల్పించాలని విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వాన్ని కోరింది.