Home News పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దెబ్బ

పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దెబ్బ

0
SHARE

భారత సైన్యం దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రజౌరీ సెక్టార్‌లోని సైనిక బంకర్లపై మెరుపుదాడి చేసింది. కొద్ది రోజుల క్రితం భారత బలగాలను దెబ్బతీసి నలుగురిని పొట్టన బెట్టుకున్న పాక్ సైనిక మూకలకు సర్జికల్ దాడులతో గట్టి గుణపాఠం నేర్పింది. భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు సోమవారం రాత్రి పాకిస్తాన్‌లోకి చొచ్చుకుపోయి పాక్ రేంజర్ల బంకర్లపై దాడి చేశాయ. పాక్ బంకర్లను తునాతునకలు చేయడంతో పాటు, నలుగురు రేంజర్లను హతమార్చి దెబ్బకు దెబ్బ తీశాయ. ఈ మెరుపుదాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఆస్తికి భారీ నష్టం వాటిల్లింది. దిగ్విజయంగా మెరుపుదాడులు పూర్తిచేసి భారత సైన్యం సురక్షితంగా వెనుక్కి తిరిగి వచ్చింది.

పాకిస్తాన్ సైన్యానికి చెంది న ‘బార్డర్ యాక్షన్ టీం’ గత శనివారం భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి సిఖ్ బెటాలియన్‌కు చెందిన ‘ఏరియా డామినేషన్ టీం’పై దాడి చేయడం తెలిసిందే. ఆ దాడుల్లో ఒక మేజర్‌తోపాటు ముగ్గురు సైనికులు ప్రాణాలు ఎదురొడ్డారు. పాక్ రేంజర్ల దాడిలో మేజర్ ప్రఫుల్ల అంబాదాస్, లాన్స్‌నాయక్ గుర్మేల్ సింగ్, సిపాయిలు పర్గత్‌సింగ్ అమరులయ్యారు.

భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు ఆదివారం రాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పాక్ రేంజర్ల బంకర్లపై దాడి చేసి ముగ్గురు సైనికులను హతమార్చి సురక్షితంగా తిరిగి వచ్చాయి. సైన్యానికి చెందిన ప్రత్యేక దళాల మెరుపుదాడిలో ముగ్గురు పాకిస్తాన్ రేంజర్లతోపాటు ఒక బంకర్ కూడా ధ్వంసమైందని చెబుతున్నారు.

పాకిస్తాన్ సైనికులు శనివారం దాడి చేయగానే, 48 గంటలు తిరగకుండానే భారత సైన్యం ప్రతిదాడులకు దిగి పాక్ సైన్యానికి బుద్ధిచెప్పటం గమనార్హం.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన విధానం మేరకే భారత సైన్యం పాకిస్తాన్ దాడులకు వెంటవెంటనే ప్రతిదాడులు నిర్వహిస్తోందని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పాకిస్తాన్ సైన్యం చేసే దాడులకు ప్రతిగా జరిగే దాడి పాక్ సైన్యాన్ని శిక్షించేదిగా ఉంటుందని ఆ అధికారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ సైన్యం కవ్వింపు లేకుండా జరిపే దాడిలో మన సైనికులు ఇద్దరు మరణిస్తే, అందుకు ప్రతిగా భారత్ జరిపే దాడిలో కనీసం ఐదుగురు పాకిస్తాన్ సైనికులను హతమార్చేలా మెరుపుదాడులు ఉంటాయని రక్షణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

దాడికి ప్రతి దాడి జరపడం వలన పాకిస్తాన్ పాలకులు దారికి రావటం లేదు. అందుకే దాడికి ప్రతిగా పెద్దదాడి చేయాల్సివస్తోందని రక్షణశాఖ అధికారులు అంటున్నారు.

పాకిస్తాన్ సైన్యం చేసే ఘాతులకు జవాబు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. పాక్ దాడులకు వెంటవెంటనే ప్రతిదాడులు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వం విధానమని సైనిక అధికారులే చెబుతున్నారు.

పాకిస్తాన్ దాడులకు జవాబుగా ప్రతిదాడులు జరపాలనే నిర్ణయం, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవటం స్థానిక అధికారులకే అప్పగించటం వలన మెరుపు దాడులు వెంటవెంటనే జరిగిపోతున్నాయని తెలుస్తోంది.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)