Home Uncategorized సామాజిక సమరసతా వేదిక అద్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

సామాజిక సమరసతా వేదిక అద్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

0
SHARE

సామాజిక సమరసతా వేదిక గత రెండు మూడు సంవత్సరాలు గా తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లా లలో వివిధ కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల మధ్య సామరస్య భావనలు నింపడానికి కృషి చేస్తున్నది. సమాజంలో అన్ని కులాల నుండి సామాజిక స్పృహ కలిగి,సమరసతా భావన కలిగిన కార్యకర్తలతో సమితులు ఏర్పడ్డాయి. డా అంబేద్కర్ ని ఒక జాతీయ వాదిగా, దేశభక్తుడిగా, అన్ని వర్గాలకు చెందిన వాడిగా ప్రచారం చేయటం లో కొంత సఫలీకృతం అయింది.

నవంబర్ 26 ఆదివారం రోజు న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని  సామాజిక సమరసతా వేదిక వారు తెలంగాణ రాష్ట్ర ములో 24 జిల్లా లలో ఘనంగా నిర్వహించారు. భారతీయులందరికి న్యాయం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, సోదరభావం అందించి, గణతంత్ర, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం గా రూపొందడానికి ప్రజలంతా సంకల్పం తీసుకుని కృషి చేయాలని, రాజ్యాంగ విలువలను గౌరవించాలని చాటి చెపుతూ , 1949 నవంబర్ 26  న రాజ్యాంగాన్ని ఆమోదించిన  సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2015 అక్టోబర్ లో ప్రభుత్వం నిర్ణయించింది.

సామాజిక సమరసతా వేదిక కార్యకర్తలు  గగ్గలపల్లి (నాగర్‌కర్నూల్), మహబూబ్‌నగర్, శంకర్ పల్లి(రంగారెడ్డి), మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ముత్యంపేట (సిద్దిపేట జిల్లా),ఆదిలాబాదు, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, ఖమ్మం లలో రాజ్యాంగ దినోత్సవం ఉత్సాహంగా జరిపారు.సుమారుగా 1000 మంది పాల్గొన్నారు. అలాగే నవంబర్ 26 ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవం భాగ్యనగర్, సికింద్రాబాద్ విభాగ్ లలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో 11 స్థలాలలో ఘనంగా జరిగింది. మెహదీపట్నం లోని పుల్లారెడ్డి కళాశాల లో, బర్కత్ పుర , దిల్ షుక్ నగర్, చార్మినార్‌, మహేశ్వరం, వీరపట్నం, ఉప్పల్, కుషాయిగూడా, సికింద్రాబాద్, బోయినపల్లి, జగదీర్ గుట్ట లో సుమారు 250 మంది పాల్గొన్నారు. ప్రముఖ కవి భాస్కర యోగి, ప్రముఖ సామాజిక సేవా నాయకురాలు బంగారు శృతి, సమరసతా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సమరసతా వేదిక నగర కార్యదర్శి రాఘవరావు, సుధాకర్ రెడ్డి, కుర్ర రాజు, చింత నగేశ్, డా వర్మ, నర్సింహం, హర్షవర్ధన్, ఆర్యుల శ్రీనివాస్,కొమరయ్య క్రిష్ణకుమార్, యాదయ్య, వేణుగోపాల్, నటరాజు, అనిల్ , ఫణిధర్, కొట్టె రవి తదితరులు పాల్గొన్నారు.