Home Telugu Articles ఇస్లామిక్ ఉగ్రవాదులు, క్రైస్తవ మత ప్రచారకులు, మావోయిస్టుల ‘ధ్వంస రచన’ దేశ విభజనకేనా?

ఇస్లామిక్ ఉగ్రవాదులు, క్రైస్తవ మత ప్రచారకులు, మావోయిస్టుల ‘ధ్వంస రచన’ దేశ విభజనకేనా?

0
SHARE

రాజకీయ లబ్ధి కోసం దేశద్రోహానికి నేతలు సిద్ధపడవచ్చునా? 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాథమిక హక్కులను హరించింది. గత నెల 25న మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మహారాష్టల్రో మాట్లాడుతూ ‘ముస్లింలు తమ మతస్థులకే విధిగా వోట్లు వేయాల’ని డిమాండ్ చేశాడు. ఈ రెండు సంఘటనలూ రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు ఇలా చేయవచ్చునా? అతివాద పార్టీ ‘మజ్లిస్’ నాయకుడిగా అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ‘ఐదు నిమిషాలు సైన్యాన్ని పక్కనపెడితే, నా తడాఖా చూపిస్తా..’- అని లోగడ ఆయన అన్నాడు. మతోన్మాద నాయకులందరిలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇటీవల రంజాన్ పర్వదినం సందర్భంగా కాశ్మీరులో భారత సైన్యం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటిస్తే- మతోన్మాద తీవ్రవాదులు కాశ్మీరు లోయను బీభత్సంగా మార్చారు. ఈ ఉదంతాలను పరిశీలించగా సారాంశమేమంటే- 1947లో దేశ విభజనతో ఇస్లామిక్ ఉగ్రవాద సమస్య భారత్‌కు తప్పిపోయిందని భావించడానికి వీలులేదు. ఈమధ్య కర్నాటకలో జయానగర్ ఉపఎన్నికలో ముస్లింలంతా కాంగ్రెస్‌కే వోటు వేయాలని కొందరు మతపెద్దలు పిలుపునిచ్చారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ కూడా ముస్లింలంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని హుకుం జారీ చేసింది. ఈ సంఘటనలపై ‘కుహనా సెక్యులరిస్టులు’ ఏమంటారు?

కేరళలో పిఎఫ్‌ఐ-ఐసిస్, ముస్లిం లీగ్ వంటి ఉగ్రవాద సంస్థలు నిర్భీతితో పనిచేస్తున్నాయి. సిరియాకు చెందిన ఐసిస్‌కు కాశ్మీర్‌లో, హైదరాబాద్‌లో, కేరళలో బ్రాంచి ఆఫీసులున్నాయి. ఇక్కడ కార్యకర్తల రిక్రూట్‌మెంటు జరుగుతున్నది. వారిని దుబాయి, శ్రీలంకల మీదుగా సిరియా వంటి దేశాలకు చేరుస్తున్నారు. ఇటీవల మనదేశ సరిహద్దులో ఒక సంఘటన జరిగింది. అది పత్రికల్లో అంత ప్రముఖంగా రాలేదు. ఉగ్రవాది అయిన ఓ మహిళ భారత జవాన్‌ను చిత్రహింసలకు గురిచేసి హతమార్చింది. ఒక స్ర్తి ఈ ఘాతుకానికి ఎలా పాల్పడింది? అని ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం. బలహీనులైన వారిని సైతం ఉగ్రవాదులుగా మార్చడం (రాడికలైజేషన్) అంటే ఇదే! భారత్‌ను మరోసారి ముక్కలు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇలాంటి ఉదంతాలు సర్వసాధారణం.

ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటికి ఐదుసార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. 2004లో బిహార్ నుండి వచ్చిన ఇజ్రత్ జహానాను అహమ్మదాబాద్ చేరేసరికి గుజరాత్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అప్పుడు ఇజ్రత్ జహానాకు సుశీల్‌కుమార్ షిండే, పి.చిదంబరం, రాజా, దిగ్విజయ్ సింగ్, లల్లూప్రసాద్ యాదవ్, వేణీప్రసాద్‌వర్మ వంటి రాజకీయ నాయకులు బహిరంగంగా మద్దతునిచ్చారు. అప్పుడు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి. ఎప్పటికైనా మోదీ ప్రధాని కాగలడని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఊహించి, ఆయన అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఇజ్రాత్ జహానా అనే విషకన్యను బిహార్ నుండి ప్రయోగించారు.

గత నెలలో పూణెలో లభించిన లేఖల ద్వారా మోదీ హత్యకు చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేయాలనుకుంటున్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయి. మావోయిస్టు అగ్రనేతలు కిషన్‌జీ మరికొందరు తమ పోలిట్‌బ్యూరో సమావేశంలో కొన్ని తీర్మానాలు ఆమోదించారు. భీంకోరెగాం అల్లర్ల పద్ధతిలో దేశవ్యాప్తంగా దళిత ఆందోళనలు రెచ్చగొట్టాలి. శ్రీపెరుంబదూరులో ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీని మానవ బాంబును ఉపయోగించి హత్యచేసినట్లు మోదీని రోడ్ షోలో హత్యచేయాలి. అంబేద్కర్ మనవడైన ప్రకాశ్ అంబేద్కర్‌ను ఒక విలేఖరి ‘మీరు మావోయిస్టులా?’ అని ప్రశ్నిస్తే, ఆయన కోపంతో- ‘మోదీ ప్రభుత్వాన్ని ఆరునెలలలో కూల్చివేస్తాను’ అని అన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ పట్టణ మావోయిస్టులు సాగిస్తున్న కార్యకలాపాల పట్ల సంతృప్తిని వ్యక్తంచేసింది. మావోయిస్టు సానుభూతిపరులు పలు ప్రాంతాల్లో విధ్వంస చర్యలకు వ్యూహరచన చేస్తున్నారు. వీరికి కుహనా సెక్కులరిస్టుల మద్దతు ఉంది. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్‌కు 2013లో రాసిన లేఖలో- ‘మావోయిస్టు నాయకుడు మహేశ్ రౌత్ నరేంద్ర మోదీని హత్యచేయడానికి వ్యూహరచన చేశాడు.’ అని ఉంది. కేరళకు చెందిన ఉగ్రవాది రోనా విల్సన్ ఢిల్లీలో ఉంటూ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. అర్బన్- రూరల్- జంగిల్- ఇంటర్‌నేషనల్ ఉగ్రవాదుల మధ్య ఇతను సమన్వయకర్తగా ఉన్నాడు. ఇతని లాగే మరికొందరు విప్లవ నాయకులు వివిధ చోట్ల చురుగ్గా పనిచేస్తున్నారు. సుధీర్ థావలే మరాఠీ పత్రిక ‘విద్రోహి’కి సంపాదకుడు. పాంథర్ జన జాతి చానల్ సంస్థ స్థాపించాడు. ‘రాడికల్ అంబేద్కరిజం’ అనే ఉద్యమం మొదలుబెట్టాడు. సురేంద్ర గడ్లింగ్ నాగపూర్‌కు చెందిన న్యాయవాది. ఉగ్రవాద కార్యకలాపాల నేరాలపై అరెస్టయిన వారికి ఇతడు న్యాయ సహాయం అందిస్తున్నాడు. షోమాసేనా నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త తుషార్ కాంత్ భట్టాచార్య మావోయిస్టు అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధం ఉన్నవాడు. మహేశ్‌రౌత్ పట్టణ-వనచర ఉగ్రవాదులకు సంధానకర్త. ఇతని సహాయకుడు హర్షాలీ పోద్దార్. వీరు గడ్చిరోలీ పోలీసులచేత అరెస్టు చేయబడ్డారు. హేమా మిశ్రా, ప్రశాంత్ రాహి, మహేశ్ తిర్కి, పాండు నరోలె పోలీసులకు పట్టుబడిన తర్వాత పలు అభియోగాలపై శిక్షలు పడ్డాయి.

అభయ్ దేవదాస్ నాయక్ మావోయిస్టు ప్రచార కమిటీ సభ్యుడు.వయస్సు 34 సంవత్సరాలు. 15 దేశాలు తిరిగాడు. న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇటీవల పట్టుబడ్డాడు. సాగర్‌గోరఖే, రమేశ్ గాయ్‌నోర్ అనే వారు ఎల్గార్ పరిషత్‌లో కీలక సభ్యులు. చందాలియా అనే విప్లవ నాయకుడు కబీర్ కళామంచ్ అనే కళాసాంస్కృతిక సంస్థ స్థాపకుడు. ప్రశాంత్ కామ్లే, సంతోష్ షెలార్ కళాకారులుగా కబీర్ కళామంచ్- దేశభక్తి యువమంచ్ (పూణె) సభ్యులు. పాటలు, ఆటల ద్వారా వీరు ఉగ్రవాదాన్ని ప్రజలలోకి తీసుకుపోతారు. వీరు దళితోద్యమాన్ని మహారాష్టల్రో నడుపుతున్నారు. 23 మంది దళితులను మావోయిస్టులు మహారాష్టల్రో హత్యచేసినప్పుడు కబీర్ కళామంచ్ సభ్యులు ప్రశాంత్ కామ్లే, సుధీర్ షెలార్ మిన్నకుండిపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రోహిత్ వేముల తల్లి రాధికకు కేరళ ముస్లిం లీగ్ 25 లక్షల మొత్తం రెండు చెక్కుల రూపంలో అందజేసింది. మన దేశంలో ఐసిస్ ఉగ్రవాదులు మస్లింలీగ్ (కేరళ) నుండి ఆవిర్భవిస్తున్నారు. ‘అంబేద్కర్‌ను ముసుగుగా వాడుకోండి. దళితులను, గ్రామీణ నిరుపేదలను రెచ్చగొట్టండి. విప్లవమార్గం పట్టించండి’ అని వీరు తీర్మానించారు.

తూత్తుకుడి (తమిళనాడు) అల్లర్ల తర్వాత అక్కడి ఉగ్రవాద ముఠాలపై పోలీసులు దర్యాప్తుచేశారు. అందులో వెలుగులోకి వచ్చిన కొన్ని వివరాలు… ఓ స్వచ్ఛంద సంస్థకు అమెరికా నుండి నిధులు వస్తున్నాయి. ఈ విషయం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఫిబ్రవరి 2012లో నిర్ధారించారు. ఈ నిధులు మూడురకాల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయి. తమిళనాడులో మతం మార్పిడులకు, సమయం వచ్చినపుడు ఆందోళనలను రెచ్చగొట్టడానికి, ప్రత్యేక ద్రవిడ దేశ నిర్మాణం కోసం మావోయిస్టుల సహకారంతో ఉద్యమించడానికి ఈ నిధులను వెచ్చిస్తున్నారు. తిరుముగం గాంధీ అనే వ్యక్తి చెన్నై కేంద్రంగా ఉగ్రవాద ఆందోళనలు నిర్వహిస్తున్నాడు. ఇతడు వృత్తిరీత్యా లాయర్. జల్లికట్టు పేరుతో మెరీనాబీచ్‌లో జరిగిన మూడురోజుల ఆందోళనలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేశాడు. పుజినెడుమారన్ అనే వ్యక్తి తమిళ దేశీయ మున్నాని సంస్థ అధ్యక్షుడిగా, తెన్‌సితి పత్రికా సంపాదకుడిగా ఉంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. ఇదే రీతిలో తిమాగు, మణియరాసన్, రాజు అనేవారు వివిధ హోదాల్లో ఉంటూ ప్రాంతీయ వాదాన్ని పురికొల్పుతున్నారు. వీరి అంతిమ లక్ష్యం ‘తమిళ ఈలం’. అంటే భారత్ నుండి ద్రవిడ దేశాన్ని విడదీసి ప్రత్యేక రాజ్యం స్థాపించటం.

కాగా, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ప్రత్యేక దేశాన్ని తాము కోరుకుంటామని గతంలో మావోయిస్టులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆమధ్య హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌పై జాతినేతల విగ్రహాలను కొందరు ధ్వంసం చేశారు. ఇది మావోయిస్టుల పనే అని అప్పట్లో అనుమానాలు వ్యాపించాయి. మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం వంటి సంస్థల పేరుతో కొందరు నగరాలల్లో అలజడులు సృష్టిస్తున్నారు. మోహన్ సి లాజరస్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు తూత్తుకుడి ఆందోళనలో తెర వెనుక కీలక పాత్ర పోషించాడు. మత ప్రచారకునిగా నిరాడంబర జీవితం ఆరంభించిన లాజరస్ నేడు వేల కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేయండి అంటూ ఇతను తమిళనాడులో ప్రచారం సాగిస్తున్నాడు. అంటే భారతదేశపు రాజకీయాల్లో ‘వాటికన్’ నేతలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారా? అన్న అనుమానాలు లేకపోలేదు. హైదరాబాద్‌లో ఉంటున్న కంచె ఐలయ్య అనే క్రైస్తవ ప్రముఖుడు ‘హిందూ మతానంతర భారతదేశం’ అనే పుస్తకం వ్రాశాడు. భారతదేశంలో ఇప్పటికే హిందూమతం అంతరించి పోయిందని తీర్మానించాడు. ఇతనికి తెలంగాణ, ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలికాయి. ఉగ్రవాదం అనగానే జీహాదీలు, అడవులలో కనిపించే సాయుధ పోరాట దళాలు గుర్తుకువస్తాయి. అర్బన్ టెర్రరిజం ఇప్పుడు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ‘దళితులను రెచ్చగొట్టండి.. ప్రజాయుద్ధాన్ని సృష్టించండి’- అనే ఉగ్రవాదుల నూతన వ్యూహం ఇపుడు ప్రభుత్వాల దృష్టికి వచ్చింది. ఈ పెడధోరణులు ప్రభుత్వాధినేతలను అంతం చేసేందుకు, దేశంలో నరమేధం సృష్టించేందుకు దోహదం చేస్తున్నాయి.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్

(ఆంధ్రభూమి సౌజన్యం తో)