Home News క్రీడాభారతి 3కె రన్ విజయవంతం

క్రీడాభారతి 3కె రన్ విజయవంతం

0
SHARE

నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని (హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి) పురస్కరించుకుని క్రీడాభారతి అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 3k పరుగు “విజయదుందుభి” మోగించింది. ఉదయగంజ్ నుండి “డి.ఎస్.పి శ్రీ లక్ష్మినారాయణ” గారు జెండా ఊపి ఈ 3k రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం గంజ్ నుండి శిశుమందిర్ వరకు కొనసాగింది. కామారెడ్డి పట్టణంలోని అన్ని పాఠశాలల నుండి సుమారుగా 2600 మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

అదే విధంగా ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎల్లారెడ్డి “ఆర్.డి.ఓ శ్రీ రవీందర్” గారు మాట్లాడుతూ -ధ్యాన్ చంద్ గొప్పదనాన్ని వివరిస్తూ విద్యార్థులకు క్రీడలు చాలా ముఖ్యమని, విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకుని, శారీరక శ్రమ చేసి, మానసికానందాన్ని పొందాలని అలా చేయడం వల్ల మెదడు ఒత్తిడికి గురి కాకుండా,చురుకుగా ఉంటుందని విద్యార్థులను ప్రేరేపించారు.

కార్యక్రమంలో క్రీడాభారతి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొమిరెడ్డి మారుతి, ఉపాధ్యక్షులు మహిపాల్, నవీన్ లు కార్యదర్శి అంకుష్, కోశాధికారి దత్తాద్రి, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పి.డి.ఓ లు, పి.ఇ.టి లు, విద్యార్థులు పాల్గొన్నారు.