Home News కులవివక్షతను కవితా ఖడ్గంతో ఎదిరించిన మహనీయులు బోయి భీమన్న, గుర్రం జాషువా, దున్న ఇద్దాసు –...

కులవివక్షతను కవితా ఖడ్గంతో ఎదిరించిన మహనీయులు బోయి భీమన్న, గుర్రం జాషువా, దున్న ఇద్దాసు – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జయంతి ఉత్సవాలు 

0
SHARE

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 19 సెప్టెంబర్ నుండి 29 వరకు భీమన్న, జాషువా, దున్న ఇద్దాసుల జయంతి ఉత్సవాలు ‘సమరసత – జాతీయ  ప్రచార ఉద్యమం’ పేరిట సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 

“దున్న ఇద్దాసు, గుర్రం జాషువా, బోయి భీమన్నలు.. నిమ్న వర్గాల మధ్య జన్మించిన ఈ ముగ్గురు మహనీయులు సమాజంలో విస్తరించిన అంటరానితనం, కులవివక్షతలను తమ కవితా ఖడ్గంతో ఎదిరించారు. వీరు ముగ్గురూ జాతీయ భావాలను, సమరసతా సందేశాన్ని ప్రజలకు అందించిన మహానుభావులు” అని ప్రముఖ కవి శ్రీ భాస్కర యోగి అన్నారు. వీరి జయంతి ఉత్సవాలను పది రోజుల పాటు ‘సమరసత – జాతీయ ఉద్యమం’గా ప్రచారం చేస్తూ సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాస్కరయోగి మాట్లాడారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ముఖ్యవక్తగా పాల్గొన్న అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ “గుర్రం జాషువా అస్పృశ్యతపై యుద్ధం ప్రకటించడంతో పాటుగా శివాజీ, వివేకానందపై పద్యాలు కూడా రాసినట్లు తెలిపారు. భారతదేశంపై చైనా దాడిని ఖండిస్తూ జాతీయ భావాన్ని, సమరసత భావాన్ని సమాజంలో నాటారని తెలియజేశారు. అదే విధంగా బోయి భీమన్న ‘పాలేరు’ నాటకం ద్వారా పిల్లలచేత పనిముట్లు కాకుండా విద్యా గంధాన్ని అందించవలసిందిగా తల్లిదండ్రులకు గుర్తు చేసినట్లు చెప్పారు. నల్గొండ జిల్లాలో జన్మించిన దున్న ఇద్దాసు భక్తి తత్వాలు ప్రచురించి సామాన్య ప్రజానీకంలో ఆధ్యాత్మిక భావాల్ని చాటిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

సిద్దిపేటలో జరిగిన సుమారు 200 మంది విద్యావంతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వ్యాసరచన పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు.

వరంగల్ జిల్లాలో 22 గ్రామాల పాఠశాలల విద్యార్థులకు ఈ ముగ్గురికి సంబంధించిన సాహిత్యంలోని పద్యాలపై పఠన పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్బముగా విజేతలకు బహుమతులు అందచేశారు.

ఆత్మకూరులో తల్లితండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటున్న శివారెడ్డి, సర్పంచి రాజు, ఉపసర్పంచి పార్వతి భగవాన్ లను కార్యక్రమంలో భాగంగా సన్మానించారు. 

మెదక్ జిల్లా రంగంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ‘సమరసత – జాతీయ సమైక్యత’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచనలో నాలుగు ఉన్నత పాఠశాలు, ఒక డిగ్రీ కళాశాలకు చెందిన 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

సెప్టెంబర్ 27వ తేదీన శ్రీనివాస డిగ్రీ కళాశాలలో ఈ ముగ్గురి జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్థి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానవక్తగా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ ప్రసంగించారు. వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు అందచేశారు.

కరీంనగర్, జగిత్యాల జిల్లా గోదూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ముగ్గురి సాహిత్య పద్య పఠన పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు.

నిజామాబాద్ లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ముగ్గురి జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో సమ్మేళనం నిర్వహించి.వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు అందచేశారు.

జయంతి ఉత్సవాల నేపథ్యంలో కామారెడ్డిలో ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించారు.

భాగ్యనగర్ బర్కత్ పురాలో జరిగిన కార్యక్రమంలో భీమన్న, జాషువా, ఇద్దాసుల చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి సమర్పించారు.