Home News అక్కడ బయటి నుండి వచ్చిన ముస్లింలు నివాసం ఉండటంపై నిషేధం! కారణం?

అక్కడ బయటి నుండి వచ్చిన ముస్లింలు నివాసం ఉండటంపై నిషేధం! కారణం?

0
SHARE

27 ఏళ్ళ జర్నలిస్ట్ తనకు కాబోయే భార్యతో పాటు కలిసి ఉండేందుకు ఇంటర్నెట్లో ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అపార్ట్మెంట్ యజమానురాలికి ఫోన్ చేశాడు. నా పేరు మహ్మద్ అవ్వాద్.. మీకు చెందిన అపార్ట్మెంట్ అద్దెకివ్వాలనుకుంటున్న విషయం ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాం. వివరాలు తెలియజేయగలరా అని అడిగాడు. 

యజమానురాలి వచ్చిన ఊహించని సమాధానం విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.. “క్షమించాలి.. ఇక్కడి మునిసిపాలిటీ నియమాల ప్రకారం ఇతర ప్రదేశాల నుండి వచ్చిన ముస్లిములకు ఇళ్ళు అద్దెకు ఇవ్వరాదు” అని  అటునుండి సమాధానం. ఈ ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి తాను విన్నమాట నిజమేనా అని తన భార్యకు ఫోన్ ఇచ్చాడు. మళ్ళీ అదే సమాధానం… “క్షమించాలి.. ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించలేం” అని అటునుండి స్పష్టమైన సమాధానం. 

లెబనాన్ దేశంలోని దక్షిణ బెయిరట్ పట్టణంలో జరిగిన ఘటన ఇది. ఇది నిజామా కాదా అన్న విషయం రూడీ చేసుకునేందుకు అతడు స్థానిక హాదత్ నగర మునిసిపాలిటీకి కాల్ చేయగా.. “బయటి నుండి వచ్చిన ముస్లిములు ఈ పట్టణంలో నివాసం ఉండటంపై నిషేధం ఉంది” అని వారు సమాధానం ఇచ్చారు. 

లెబనాన్ దేశంలో క్రైస్తవ, ముస్లిముల మధ్య విభజన వాతావరణం ఏవిధంగా ఉందో తెలియజేసేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ. గత 15 ఏళ్ల పాటు ఇరువర్గాల మధ్య జరిగిన పౌరయుద్ధం ఈ ప్రాంతంలో లక్షలాది మంది మరణానికి కారణమైంది. ముస్లిముల జనాభా విపరీతంగా పెరగడం, ఈ అత్యధిక భూమి వారి ఆధీనంలోకి చేరుకోవడం వంటి కారణాల కారణంగా ఈ ప్రాంతంలోని క్రైస్తవులు భయానక వాతావరణంలో గడుపుతున్నారు.

Source: Tribune India