Home News భారత్ ను సంతోషకరమైన దేశంగా మార్చేందుకు కృషిచేద్దాం – ప్రణబ్ ముఖర్జీ

భారత్ ను సంతోషకరమైన దేశంగా మార్చేందుకు కృషిచేద్దాం – ప్రణబ్ ముఖర్జీ

0
SHARE

ప్రజానీకం  హింసాత్మక ప్రవృత్తి  నుండి దూరంగా ఉండవలసిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ  అన్నారు. “మనం కోపం, హింస, ఘర్షణ నుండి సమరసత, సౌఖ్యం వైపు వెళ్ళాలి. ఇందుకోసం స్వయంసేవకులు వారధిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే వీటి ద్వారానే మనం ఒక సంతోషభరితమైన భారతదేశాన్ని నిర్మించగలుగుతామని ఆయన సూచించారు.  తృతీయ వర్ష సమారోప్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు.

జాతీయత, జాతి, దేశభక్తి వంటి అంశాల పట్ల తనకున్న అవగాహనను పంచుకోవడానికే సంఘ ఆహ్వానాన్ని స్వీకరించానని ప్రణబ్ తెలిపారు

“భారతదేశం ఎంతో మంది వ్యాపారులు, జ్ఞానులు, ఋషుల ద్వారా సంస్కృతిని ఇతరులతో పంచుకుంది, సముద్రాలు దాటి వెళ్లింది. 1800 సంవత్సరాల పాటు ప్రపంచానికి విద్యాదులు నలందా,తక్షశిల,విక్రమశిల ,వలభి,సోమాపుర విశ్వవిద్యాలయాల ద్వారా అందించింది. శాంతి ,సమరసత ,సౌఖ్యం వీటి ఆవశ్యకత మన దైనిక జీవనంతో పాటు పాలక వ్యవస్థ లో కూడా మార్పులు తేవాలి.

దీని ద్వారానే ఒక జాతీయత కలిగిన సంతోషకరమైన దేశాన్ని నిలుపగలుగుతాము.” అని అన్నారు

సంప్రదాయానికి భిన్నంగా సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ముఖ్య అతిధి కన్నా ముందు మాట్లాడారు.  “ప్రణబ్ లాంటి ఒక మేధావి, అనుభవజ్ఞుడు దేశం మొత్తం నుండి వచ్చిన స్వయంసేవకుల్ని ఉద్దేశించి మాట్లాడడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు. సంఘం వివిధత్వంలో ఏకత్వాన్ని దర్శించడమనే భారతీయ ప్రాచీన పద్ధతిని అంగీకరిస్తూ అనుసరిస్తుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ “భారత వాసులే” భాష, సంప్రదాయ, రాజకీయ సిద్ధాంత భేదాలు నిలువలేవు. సంఘం వివిధాత్వాన్ని గౌరవిస్తుంది అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని దర్శిస్తుంది” ఆని అన్నారు.

సంఘశక్తి ని గురించి చెప్తూ “సంఘ శక్తి సమాజాన్ని దబాయించడానికో, విడదీయడానికో, విధ్వంసృష్టించడానికో కాదు. అది ఈ మాతృ భూమిసేవ  కోసం మాత్రమే. ఏం చేసినా లక్ష్యం మాత్రం మాతృభూమి సేవే. సంఘం సమాజ ఉన్నతికి కట్టుబడి ఉంది. సమాజంలో చాలా తేడాలు ఉన్నప్పటికీ సంఘం ఒక శీలసంపన్నులైన వ్యక్తుల్ని తయారు చేస్తుంది. స్వయంసేవకులకు ఇది అనుకూలమైన సమయమే కానీ విశ్రాంతి సమయం కాదు.” అన్నారు

అంతకు ముందు వర్గ శిక్షార్ధులు శారీరక ప్రదర్శనలు చేశారు. వర్గ సర్వాధికారి సర్దార్ గజేంద్ర సింగ్ సంధు ప్రణబ్ ముఖర్జీ కు  సరసంఘచాలక్ మోహన్ జీ కు స్వాగతం పలికారు.

వర్గ కార్యవహ శ్యామ్ మనోహర్ వర్గ నివేదిక ఇచ్చారు. నాగపూర్ మహానగర్ సంఘచాలక్ రాజేశ్ లోయ వచ్చిన విశిష్ఠ అతిధులని పరిచయం చేశారు.

సమారోప్ కు ముందు ప్రణబ్ ముఖర్జీ డాక్టర్జీ ఇంటిని దర్శించి అక్కడి పుస్తకంలో “నేను ఈ రోజున భరతమాత గొప్ప సంతాన మైన డా. కేశవబలిరామ్ హెడ్గేవార్ కు అంజలి సమర్పించడానికి వచ్చాను.“ అని రాశారు.

విశిష్ఠ అతిధులుగా సునిల్ శాస్త్రి దంపతులు, సుభాష్ చంద్ర బోస్ కుటుంబ౦ నుండి అర్ధెన్దు బోస్ దంపతులు, రాజీవ్ మల్హోత్రా ,సి.రాజేంద్ర ప్రసాద్, విశాల్ మఫత్ లాల్, రాష్ట్ర సేవిక సమితి ప్రముఖ్ సంచాలిక శాంతక్క, గజేంద్ర చౌహాన్ లు విచ్చేశారు.