Home News ఛత్తీస్గఢ్ : మావోయిస్టు అగ్రనేతల కీలక సమావేశం

ఛత్తీస్గఢ్ : మావోయిస్టు అగ్రనేతల కీలక సమావేశం

0
SHARE
ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నక్సలైట్లు, మావోయిస్టుల కార్యకలాపాలు మళ్ళీ  పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులకు కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తోంది.
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు,  నక్సలైట్ల అగ్రనాయకుల సమావేశం జరుగుతున్నట్లు  తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ అధికారులకు తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
సమావేశంలో సిపిఐ (ఎంఎల్)కేంద్ర కమిటీకి చెందిన మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో వారు దేశంలో  భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికల సమాచారం.
సమావేశంలో కటకం సుదర్శన్, కోసా అలియాస్ సత్యనారాయణ రెడ్డి, దేవ్జీ అలియాస్ టిప్పారి తిరుపతి, అక్కి రాజు అలియాస్ రామ్ కృష్ణ, చంద్రన్న అలియాస్ పుల్లారి ప్రసాద్, గణేష్ యుకే అకా గజల్ రవి పాల్గొన్నారు.  
6 నెలల క్రితం మావోయిస్టు నాయకులు శ్రీనివాస్ అలియాస్ రామన్న మరణంతో సంస్థ  నాయకత్వం దెబ్బతింది. అతని స్థానంలో గణేష్ యు.కె అలియాస్ సాక హనుమంతుకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాల్సి ఉండగా వృద్ధాప్యం కారణంతో బాధ్యతలు స్వీకరించలేనని తిరస్కరించారు. కానీ కేంద్ర భద్రతా బలగాలు మావోయిస్టు కార్యకలాపాలు నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలకు భయపడి గణేష్ నాయకత్వాన్ని తిరస్కరించినట్టు కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నంబాల కేశవ్ రావు అలియాస్ గగన్నకు ప్రస్తుతం సంస్థను నడిపే బాధ్యతను ఇచ్చారు. ఈ విషయం ఇంకా అధికారికంగా  ప్రకటించలేదు.

చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం:

బస్తర్ లో మావోయిస్టు, నక్సలైట్ అగ్ర నేతల సమావేశాలు జరుగుతున్నాయని ఇంటెలిజెంట్ వర్గాల నుండి  పక్కా సమాచారం ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు ఎలాంటీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సమావేశం జరుగుతున్న చోటు,  సమయం తెలిసినప్పటికీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. .
గత నెలలో సుకుమా జిల్లాలోని మావోయిస్టులు బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో పది వేల  మందికి పైగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో డబ్బులు కూడా సేకరించారు.