Home Telugu Articles మైనార్టీ సంతుష్టీకరణ కోసం బెంగాల్ లో విద్యాభారతి పాఠశాలలకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్య

మైనార్టీ సంతుష్టీకరణ కోసం బెంగాల్ లో విద్యాభారతి పాఠశాలలకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్య

0
SHARE

అల్పసంఖ్యాక వర్గాల ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడానికి వారి సంతుష్టీకరణ విధానాన్ని మార్క్సిష్టులు మరియు తృణమూల్ కాంగ్రెస్ అవలంబిస్తూ ఉంటాయి.ఈ సంతుష్టీకరణ విధానంలో భాగంగానే విద్యాభారతికి చెందిన పాఠశాలలను మూసివేస్తామనడం, మరోపక్క మదర్సాలకు 2,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది.విద్యాభారతి ద్వారా నడపబడుతున్న 350 విద్యాలయాల్లో జాతీయవాదం మరియు  నిజమైన భారతదేశ చరిత్ర (మార్క్సిష్టు చరిత్రకారులు దురాక్రమణ దారులను గొప్పగా చేసి చూపించినట్టు కాకుండా) నేర్పబడుతుంది. ఈ విద్యాలయాల్లో చదువుతున్న 60,000 లకు పైగా విద్యార్థులకు పెద్దలయెడ గౌరవభావం, ప్రకృతిని సేవించడం, ధర్మ మార్గంలో నడవడం వంటి విలువలతో కూడిన విద్య నేర్పబడుతుంది. స్వామి వివేకానంద చెప్పినట్టు బుద్ధి వికాసానికి, శారీరిక వికాసం చాలా ముఖ్యము. అందుకే తరగతి గదిలో పాఠాలతో పాటు మైదానంలో అనేక రకాల శారీరిక శిక్షణ కూడా ఇవ్వబడుతుంది.

మరోపక్క బెంగాల్లో ఉన్న 2000 లకు పైగా నమోదు చేయబడని మదర్సాల్లో ఏమి నేర్పించబడుతుందో చూద్దాం!

పశ్చిమాసియా దేశాలు, ముఖ్యంగా సౌది అరేబియా ఆధారంగా పని చేసే వహాబీ సంస్థల ద్వారా వచ్చే డబ్బుతో చాలా వరకు మదర్సాలు నడపబడుతున్నాయి. మత ఛాందస వహాబీలు ఈ మదర్సాల్లో చిన్న పిల్లల హృదయాల్లో ద్వేషం నింపుతారు. ‘కాఫీరులను బ్రతకనివ్వకూడదు, విగ్రహారాధకుల తలలు నరకాలి, ముస్లిమేతరులను మతం మార్చాలి లేదా హింసించి చంపివేయాలి, వారి ఆడవాళ్ళను బలాత్కరించాలి మరియు బానిసలుగా మార్చుకోవాలి, అవిశ్వాస పాత్రులను రాళ్ళతో కొట్టి చంపాలి, దొంగలైన వారి చేతులు నరికివేయాలి’ వంటివి నేర్పించడం జరుగుతుంది. ప్రపంచం మొత్తాన్నిజిహాద్ ద్వారా ఇస్లామీకరణ చేయడం ప్రతీ ముస్లిం యొక్క బాధ్యతగా చెప్పబడుతుంది.

సరిగ్గా నిష్పాక్షికంగా ఆలోచిస్తే ఈ మదర్సాలను మూసివేసి అక్కడి వహాబీ మత ఛాందసవాదులను చెరసాలలో పెట్టాలి. ముస్లిం మదర్సాల్లో జరిగినట్టు విద్యాభారతి పాఠశాలల్లో ఎలాంటి మతపరమైన బోధనలు జరగవు. కాని మమత బెనర్జీ ప్రభుత్వం నీచమైన దురుద్దేశాలతో వ్యవహరిస్తుంది. మత ఛాందసవాదం, అసహిష్ణుత నేర్పుతున్నారన్న నెపంతో జాతీయవాద విద్యాలయాలను మూసివేసే ప్రయత్నం చేస్తుంది.

దీనికి కారణాలు ఏమై ఉంటాయి? మమత బెనర్జీ ప్రభుత్వం అవలంబిస్తున్న ముస్లిం మతగురువులను సంతుష్టీకరించి తద్వారా ముస్లిం ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడం ఒక కారణం.
గత రెండు సంవత్సరాలుగా ముస్లిం ప్రతినిధులు చాలా మంది మమత బెనర్జీని కలిసి విద్యా భారతి విద్యాలయాలలో చెప్పబడుతున్న నిజమైన చరిత్ర గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ‘ఔరంగజేబ్ ఒక నియంత, హిందువులను ఊచకోత కోశాడు, బాబర్ మరియు ఇతర ముస్లిం దురాక్రమణ దారులు వేల సంఖ్యలో హిందువులను వారి దేవాలయాలను ధ్వంసం చేసారు, భక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసాడు, అక్కడి అనేకమంది గురువులను సన్యాసులను, విద్యార్థులను ఊచకోత కోశాడు’ వంటి నిజమైన చరిత్రను బోధించడం ఆ ముస్లిం ప్రతినిధులకు నచ్చడం లేదు.

ఇలాంటి చరిత్ర బోధించడం ద్వారా ముస్లిం దురాక్రమణ దారుల నిజస్వరూపం బైటపడుతుందని, హిందువుల్లో ముస్లింల ఎడ విపరీత భావన ఏర్పడుతుందని, అందుకే  విద్యాభారతి పాఠశాలలను మూసివేయాలని వీరి ఆలోచన. ముస్లిం రాజుల, దురాక్రమణ దారుల నిజమైన సిగ్గుమాలిన దమన కాండ గురించి తెలిస్తే మత సామరస్యం దెబ్బతింటుంది అని మమత బెనర్జీ కూడా ఆలోచిస్తుంది. అందుకే భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కించపరుస్తూ, ముస్లింల నిజమైన నియంతృత్వ పాలన, దురాక్రమణలను, వారి చీకటి కోణాన్ని దాచివేసి వారిని గొప్ప పాలకులుగా వక్రీకరించి చెప్పబడిన మార్క్సిష్టుల ద్వారా రాయబడిన చరిత్రను రాష్ట్రంలోని ఇతర పాఠశాలల్లో బోధించినట్టుగా విద్యాభారతి పాఠశాలల్లోనూ బోధించాలని  వారు కోరుకుంటున్నారు.

బెంగాల్ ప్రభుత్వం, వహాబీ ముస్లిం ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తూ, భారతీయ విలువల ఆధారిత విద్య అందించడం వల్ల లౌకికవాదానికి ముప్పువాటిల్లుతుందని వాదిస్తున్నది. హిందూ విద్యార్థులు నిజమైన చరిత్ర ద్వారా తమ ఔన్నత్యాన్ని తెలుసుకొని, ఇతర మతాలకు వ్యతిరేకంగా మారుతారు అని వీరి వాదన. కాఫీరుల తలలు నరకడం ప్రతి ముస్లిం యొక్క గురుతర బాధ్యతగా చెప్పే మదర్సాలకు, అందులో చదివే విద్యార్థులకు పై వాదన వర్తించక పోవడం విడ్డూరం!

బెనర్జీ ప్రభుత్వం విద్యాభారతి ద్వారా నడపబడుతున్న 125 పాఠశాలలకు నోటీసు ఇవ్వడం వెనుక మరియొక గొప్ప కారణం కూడా ఉంది. ఈ విద్యాలయాలు చాలా వరకు మారుమూల గ్రామాల్లో ఉన్నాయి, ముఖ్యంగా షెడ్యులు జాతులు మరియు తెగలవారు అధికంగా ఉండే ఉత్తర బెంగాల్లోని గ్రామాల్లో ఉన్నాయి. విద్యాభారతి పాఠశాలలు ఆయా ప్రాంతాల్లో ఉండడం మరియు వాటి ద్వారా విలువలతో కూడిన విద్య అందించడం వల్ల అక్కడ మత ప్రాప్తికోసం పని చేస్తున్న ఎన్నో క్రైస్తవ మిషనరీల ఆటలు సాగడంలేదు. మత ప్రాప్తి కార్యక్రమాలు తగ్గడం వల్ల వారికి పాశ్చాత్య దేశాలనుండి విరాళాల రూపంలో వచ్చే డబ్బు కూడా రావటం లేదు. అందువల్ల దాంతో ఆ క్రైస్తవ మిషనరీలు చాలా కోపంగా ఉన్నాయి.

బెనర్జీపై తమ ప్రభావం కలిగిన ఈ క్రైస్తవ మిషనరీలు, విద్యాభారతి పాఠశాలలను మూసివేయాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ ఉద్దేశ్యంతో అవి విద్యాలయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ విద్యాలయాల్లో నేర్పించే శారీరిక శిక్షణ వల్ల హిందూ ఉగ్రవాద సైన్యం ఏర్పడుతుందనీ, ఆ సైన్యం అతి త్వరలో అందరూ ముస్లిం మరియు క్రైస్తవులను అంతమొందిస్తుందనీ కొంతకాలం క్రితమే కొన్ని మిషనరీలు ఒక రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేసాయి. ఇలాంటి విషపూరిత ఆరోపణలు చేసి ఆ విద్యాలయాలను పూర్తిగా మూసివేయాలని, తదనంతరం తమ క్రైస్తవ కార్యకలాపాలకు అడ్డూ అదుపూ ఉండదని  ఈ మిషనరీలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, పకడ్బందీ వ్యూహంలో భాగంగా, కమ్యూనిష్ట్ పార్టీ ప్రజా ప్రతినిధి మానస్ ముఖర్జీ బుధవారం (8 మార్చ్, 2017) అసెంబ్లీలో, విద్యా భారతి పాఠశాలల్లో మత ఛాందసవాదం నేర్పుతున్నారు అని ప్రస్తావించడం, దానికి విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ 125 పాఠశాలల జాబితా చూపించడం జరిగింది. ఈ 125 పాఠశాలల జాబితా మమత బెనర్జీ ద్వారా ఇవ్వబడింది మరియు వీటికి నోటీసు పంపడం జరిగింది. దీని ద్వారా కమ్యూనిష్టులు మరియు తృణమూల్ కాంగ్రెస్ కలిసి కట్టుగా పక్కా వ్యూహంగా విద్యాభారతి పాఠశాలలను మూసివేయాలి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం అవుతుంది.