Home Telugu Articles నరేంద్రుని మాట–యోగి బాట

నరేంద్రుని మాట–యోగి బాట

0
SHARE

ఐదుసార్లు వరుసగా పార్లమెంటుకు ఎన్నికైన జనాదరణగల నేత యోగిపై మోపిన ఆరోపణల్లో ఒక్కటీ రుజువు కాలేదు. నేటి యోగి విమర్శకులంతా… మోదీ ప్రధాని అయినప్పుడు ‘మైనారిటీలకు ముప్పు’ అంటూ గగ్గోలు పెట్టినవారే. మత కల్లోలాలు రేగుతాయని నాడు ఆశ పెట్టుకుని భంగపడ్డారు. నేడు యోగి పాలనలోని యూపీలో మత ఘర్షణలు చెలరేగుతాయని ఆశపడుతున్నారు. కానీ ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర, మణిపూర్‌లో బీరేంద్ర, యూపీలో యోగీంద్ర ఎవరైనా సమాజ హితానికి, మత సామర స్యానికి, అందరి అభివృద్ధికి అంకితమైన నరేంద్రుని కేంద్ర ప్రభుత్వం అడుగుజాడలలో నడిచేవారే.

–రామ్‌ మాధవ్‌

ఇటీవల నేను బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో ఆ సంస్థ విలేకరి ఒకరు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు గురించి, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య నాథ్‌ ఎంపిక గురించి పలు ప్రశ్నలు అడిగారు. ఉదారవాద మేధావి వర్గంగా పిలిచే వారిలో గత కొన్ని రోజులుగా అవి చర్చ నీయాంశాలుగా ఉన్నాయి. సహజంగానే ఆ బీబీసీ విలే కరి వేసిన ప్రశ్నల్లో గతంలో యోగికి ఆపాదించిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు మొదలుకుని, రామ జన్మ భూమి, యాంటీ రోమియా దళాలు తదితర మైన నానా రకాలవి ఉన్నాయి.

ఆ ప్రశ్నలు అడుగుతుండటానికి కారణాలూ ఉండ వచ్చు, యోగి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సీ ఉండొచ్చు. అయితే ఆయన సమాధానాలు మీడియా ప్రకటనల రూపంలోనో లేదా మాటల రూపంలోనో ఉండాల్సిన అవసరమేం లేదు. ముఖ్యమంత్రిగా తాను చేపట్టే చర్యల ద్వారానే ఆయన వాటికి సమాధానాలను చెప్పవచ్చు. యోగిని గురించి సాధారణంగా ఏర్పడి ఉన్న, ప్రత్యేకించి ఆయనపట్ల వ్యతిరేకతో ఉన్న మీడి యాలో ఉన్న మూసపోత అభిప్రాయంకంటే ఆదిత్య నాథ్‌ భిన్నమైనవారు అని ఆయనను ఎరిగిన వారు ఎవరైనా కచ్చితంగా చెప్పగలరు. ఎలాంటి వివక్షకు లేదా దురుద్దేశాలకు తావే లేని రీతిలో ప్రజలలో పనిచేయ డంలో పేరు మోసిన విలక్షణ రాజకీయ వేత్త ఆయన. భారత్‌–నేపాల్‌ సరిహద్దుల్లోని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ నుంచి వరుసగా ఐదుసార్లు ఆయన పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.

పీఠాధిపతి కావడం దోషమా?

ఆయన ఆధిపతిగా ఉన్న గోరక్‌నాథ్‌ పీఠం ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రం. అటు నేపాల్, ఇటు భారత్‌లోని ప్రజలకు గత వెయ్యేళ్లుగా సేవలను అందిస్తున్న చరిత్ర దానిది. సుప్రసిద్ధమైన గోరక్‌నాథ్‌ ఆలయం సహా పలు సంస్థలకు అది నెలవు. సార్వలౌకిక ఉదారతకు, మత వైభవానికి పేరెన్నిక గన్న ఆ పీఠం హిందూయేతరులు సహా వేలాదిమందికి జీవనోపాధిని కల్పిస్తుంది.

గోరక్ష లేదా గోవులను కాపాడటం, పునర్‌ మత మార్పిడి, రామజన్మ భూమి వంటి ఉద్యమాలతో సన్ని హిత సంబంధం ఉన్న ఒక ప్రముఖ హిందూ పీఠానికి యోగి అధిపతిగా ఉన్నారు. కాబట్టి ఉదారవాద మీడి యాకు చెందిన అధికార వ్యవస్థలోని అత్యుత్సాహుల విభాగం విమర్శకులకు ఆయన లక్ష్యం కావడం సహ జమే. ఆ పీఠానికి విశ్వహిందూ పరిషత్‌తో చాలా కాలంగానే సంబంధం ఉంది. నేపాల్‌ రాజ కుటుంబా నికి, పీఠానికి మధ్య కూడా సంబంధం ఉంది. ఢిల్లీలోని అధికార, శిష్ట వర్గ ప్రాంతాల ఉదారవాద ఉన్నత తర గతుల వారికి ఇది సైతం భరింపశక్యంకానిదే.

వక్రభాష్య నైపుణ్యానికి లక్ష్యమైన యోగి

యోగికి ఆపాదించిన వ్యాఖ్యలు ఎలాంటివో ఆయన తప్ప మరెవరూ వివరించలేరు. పూర్తి అరాచకం నిండి, ప్రజలను పీల్చి పిప్పి చేస్తుండే మునుపటి తూర్పు ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతంలో కేవలం మంచిని రక్షించడం కోసం ఆవసరమైన చేపట్టిన పలు చర్యలు, పనులు సైతం వివా దాస్పదం కాగలిగేవి. దీనికి తోడు మన మేధావి వర్గం యోగిలాంటి నేతల ప్రకటనలను వాటి సందర్భం నుంచి విడదీసి, మెలితిప్పే కళలో ఆరితేరినది. దేశ ప్రజ లంతా ఐక్యంగా నిలిచి, దేశం కోసం, దేశ సంస్కృతి కోసం కృషి చేయాలని కోరుతూ ఆయన చేసిన లెక్క లేనన్ని ఉపన్యాసాలు, పార్లమెంటు చర్చల్లో చేసిన ప్రసం గాలు, బహిరంగంగా చెప్పిన మాటలు అన్నిటినీ మరు గునపడేసి, వివాదాస్పదంగా ధ్వనిస్తున్నట్టు అనిపించే ఓ రెండు ప్రకటనలను మాత్రం వారు భద్రంగా పెట్టెలోంచి బయటకు తీశారు.

వాళ్లు ఇలా యోగి విషయంలో మాత్రమే చేయ లేదు. వారికి నచ్చని వారెవరి విషయంలోనైనా ఇదే చేశారు. ఆయనపట్ల వారికి ఉన్న ఆయిష్టత, యోగి ధరిం చిన కాషాయాంబరాలు సహా ఎన్నో అంశాల వల్ల ఉత్ప న్నమైనది కావచ్చు. కుహనా నైతిక ఆధిక్యతాభావపు ముసుగును ధరించి వారు ప్రతి ఒక్కరిపైనా, ప్రతి దాని పైనా తీర్పులు చెప్పే అధికారాన్ని తమకు తామే కట్ట బెట్టేసుకున్నారు.

జనాదరణగల నేతపై అడ్డగోలు ఆరోపణలు

కాకపోతే ఈసారికి వచ్చేసరికి వారు… తమ బాపతు మేధావులు వేగంగా క్షీణిస్తుండటాన్ని, తమ ప్రభావం పెద్ద ఎత్తున అంతరించిపోతుండటాన్ని చూడాల్సి వస్తుండటమే విషాదం. యూపీ ఎన్నికల ఫలి తాల వల్ల త్రిశంకు శాసనసభ ఏర్పడుతుందని, తద్వారా ఏదోలా బీజేపీని అధికారానికి దూరంగా ఉండేలా చేయ గలుగుతామని వారు ఆశించారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చి, వారికి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. బీజేపీ విజయం బ్రహ్మాండ ప్రమాణం లోనిది. దాన్ని వెన్నంటే యోగి సీఎం స్థానానికి ఎదగ డాన్ని చూడాల్సి వచ్చింది. దీంతో వారు దూషణలకు దిగారు.

యోగి ఐదుసార్లు వరుసగా తన నియోగవర్గం నుంచి ఎన్నికలైన జనాదరణగల నేత. యోగికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ ఏ న్యాయస్థానంలోనూ ఇతమిత్ధంగా రుజువుకాలేదనేదీ వారికి పట్టదు. ‘వివా దాన్ని రాజేసే వ్యాఖ్యలను ఆయన చేయకపోయినా, అదే వేదిక నుంచి మరో వ్యక్తి వాటిని చేస్తే యోగి అందుకు అభ్యంతరం తెలపలేదంటూ వాళ్లు తమ వాదనను ఎప్ప టికప్పుడు ఒక చోటి నుంచి మరొక చోటికి మార్చు కుంటూ వస్తున్నారు.

మత మార్పిడులకు సంబంధించి ‘ఒక హిందువును ఇస్లాంలోకి మారిస్తే, మేం వంద మంది ముస్లింలను హిందూ మతంలోకి మారుస్తాం’ అనే వ్యాఖ్యను యోగికి ఆపాదించారు. దాన్ని తీసుకుని బీబీసీ కరెస్పాండెంట్‌ ఒకరు నాతో వాదనకు దిగారు. ఆయన ఆ మాటలు అన్నారో లేదో ధ్రువీకరించాల్సినది యోగి మాత్రమే. అయినా నేను, ఆ ప్రకటనలో రెచ్చగొట్టే భాగం ఏముం దని ఆ విలేకరిని అడిగాను! ఒక మతం నుంచి ఇంకొక మతం లోకి మారడం సరైనదైతే, ఆ మత మార్పిడి మరో దిశగా సాగినప్పుడు అది ఎలా తప్పవుతుంది? అప్పుడా యన ‘ఒకరికి వంద మంది అని ఆయన ఎలా అనగలు గుతారు’ అని అడిగారు. అంటే ఘనమైన ఉదారవాద వాదన అంతా అంకెల లెక్కలకు సంబంధించినదే తప్ప ఏ సూత్రానికీ చెందినది కాదా? మత మార్పిడిని సరైన దిగా భావించేట్టయితే పునర్‌ మతమార్పిడిని కూడా సరైనదిగానే భావించాలి.

సమాజ హితానికి, మతసామరస్యానికి పట్టం

నేటి యోగి విమర్శకులంతా… మోదీ ప్రధాని అయిన ప్పుడు ‘మైనారిటీలకు ముప్పు’ అంటూ గగ్గోలు పెట్టిన వారే. దేశవ్యాప్తంగా మత కల్లోలాలు రేగుతాయోమో నని, ఆ కల్లోలాలను అడ్డుపెట్టుకుని, వాటిపై ఆధారపడి బతికి బట్టగట్టొచ్చని వారు అలాంటి ఆశే లేదని తెలిసీ ఆశపడ్డారు. కానీ ప్రధాని మోదీ వారి ఆశలను అడి యాసలు చేశాలు. ఏదో అక్కడొకటి ఇక్కడొకటిగా జరి గిన ఓ రెండు ఘటనలు మినహా దేశం ప్రధానంగా శాంతియు తంగా, సామరస్యంగా నిలచింది.

ఇప్పుడు వాళ్లు యోగి పాలనలో యూపీలో మత ఘర్షణలు జరుగుతాయేమో తమ వాదనను రుజువు చేసుకోవచ్చని మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే, దేశ అజెండాను నిర్దేశించేది ప్రధాన మంత్రి మోదీయేనని, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ మోదీ దృక్పథంలో, సంక ల్పంలో అంతర్భాగమేననని వారు విస్మరిస్తున్నారు. ఉత్త రాఖండ్‌లో త్రివేంద్ర అయినా లేక మణిపూర్‌లో బీరేంద్ర ఆయినా లేదా యూపీలోని యోగీంద్ర అయినా ఢిల్లీలోని నరేంద్రుని అడుగుజాడలనే అనుసరిస్తారు. పారదర్శ తపై ఏకాగ్రదృష్టిని, అభివృద్ధిపై కేంద్రీకరణను నిలిపిన నరేంద్రుని కేంద్ర ప్రభుత్వం సామాజ హితానికి, మత సామర స్యానికి, అందరి అభివృద్ధికి అంకితమై ఉంది.

-రామ్‌ మాధవ్‌

వ్యాసకర్త బీజేపీ జాతీయ కార్యదర్శి

(సాక్షి సౌజన్యం తో)