Home News దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం: మాతృభూమి సేవలో 72 సంవత్సరాలు

దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం: మాతృభూమి సేవలో 72 సంవత్సరాలు

0
SHARE

ఎక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉందో… అక్కడ దేశభక్తి ఉంటుంది. ఈనాడు విద్యార్థి పరిషత్ (ABVP) పని దేశంలోని మారుమూల ప్రాంతాలలో సహితం వ్యాపించింది. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” అంటూ నినదిస్తూనే ఉంటారు. ఇవి వారికి నినాదాలే కాదు జీవన నిష్ఠ కూడా. ఈ కారణంగానే ఎక్కడైతే విద్యార్థి పరిషత్ అడుగిడిందో అక్కడి వారిలో జాతీయ భావం ప్రబలంగా పెరిగింది. అంతేకాక అంతర్జాతీయ మరియు దేశానికి విఘాతం కలిగించే సమూహాల మాయాజాలం సమాప్తం కావడం ప్రారంభమైంది.

ఈరోజు జమ్మూకాశ్మీర్ లోని పూంచ్, రాజౌరీ, కిష్ త్ వాడ్ (దోడా) మొదలైన తీవ్రవాద ప్రభావిత క్షేత్రాలలో పరిషత్ క్రియాశీలంగా ఉందంటే కారణం అది అక్కడ ఉన్న యువకుల మనస్సులో దేశం ఐకమత్యంగా ఉండాలనే సంకల్ప సంఘటిత శక్తియే కారణం. పరిషత్ 1990లో శ్రీనగర్ లో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగితే దానికి జవాబుగా “ఎక్కడైతే త్రివర్ణ పతాకానికి అవమానం జరిగిందో, అక్కడే దానికి సన్మానం చేస్తాం” అని నినదించింది. నిర్వాసితులైన విద్యార్థినీ, విద్యార్థులను పరిషత్ దేశం నలుమూలలకు పంపి తమకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థుల ముందుంచడానికి అవకాశం ఇవ్వడంతో, వారి బాధాపూరితమైన గాథలు విన్న విద్యార్థులు ఆక్రోషితులై ఐకమత్యంతో వారికి అండగా నిలబడి దేశవ్యాప్తంగా ఆందోళనలు, జన జాగరణలు నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడితెచ్చారు. 11 సెప్టెంబర్ 1990లో జరిగిన చారిత్రాత్మకమైన ర్యాలీ, తీవ్రవాద ప్రాబల్యం ఉన్నా, దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది విద్యార్థులు శ్రీనగర్ వైపు దూసుకొని పోయారు.

1965లో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అరుణాచల్ ప్రదేశ్ వెళ్లారు. దూర ప్రాంతానికి వెళ్లడం, అనేక కష్టాలను ఎదుర్కోవడంతో పాటు మానసికంగా కూడా అక్కడి ప్రజలతో కలవడానికి కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడి ప్రజలు కూడా ఇక్కడ నుండి వెళ్లిన వారితో త్వరగా పరిచయాలు ఏర్పరచుకోలేకపోయారు. కానీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు దీనిని ఎలాగైనా పరిష్కరించాలనుకొని తలంపుతో అంతర్జాతీయ ఛాత్ర్ జీవన్ దర్శన్ ( SEIL ) ప్రకల్పాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా 1966 నుండి అక్కడి నుండి విద్యార్థులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సాంస్కృతిక ఐక్యతను అనుభవిస్తూ భావాత్మకంగా లీనం చెందారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు అక్కడికి వెళ్లడం ప్రారంభించారు. ఈ పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నది. చైనా నిరంతరం అరుణాచల్ ప్రదేశ్ పై వివాదాలు చేస్తూ అక్కడి యువకులను ప్రలోభానికి గురిచేస్తూ వారిని భ్రమలోకి నెడుతూ భారత్ వ్యతిరేకులుగా తయారు చేయాలని సంకల్పించినప్పుడు, విద్యార్థి పరిషత్ నిర్వహిస్తున్న ఛాత్ర్ జీవన్ దర్శన్ ( SEIL ) ప్రేరణతో అక్కడి విద్యార్థులు భారత్ కు వ్యతిరేకంగా గలమెత్తలేకపోయారు. SEIL నిర్వహిస్తున్న మహత్వపూర్ణమైన భూమిక కారణంగానే ఇది సాధ్యపడింది.

విద్యార్థి పరిషత్ పని అండమాన్, నికోబార్ మరియు లోహలో కూడా ఉంది. ఇది జాతీయ ఐక్యతను పెంపొందిస్తుంది. విద్యార్థి పరిషత్ యొక్క ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా దేశానికి విఘాతం కలిగించే శక్తులకు స్థానం లేకుండా పోయింది. నేడు సిక్కిం విద్యార్థులలో పరిషత్ యొక్క పనుల ప్రభావం నిరంతరం పెరుగుతున్నది. దీంతో పొరుగునే ఉన్న నేపాల్ లోని మావోయిస్టుల అనుకూల ప్రభావం వారిపై పడడం అసంభవంగా మారింది.

విద్యార్థి పరిషత్ నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు ఉత్తరాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్రను పోషించారు. విద్యార్థి పరిషత్ నేతృత్వంలో అనేక విద్యార్థి ఆందోళనలు రోజుల్లో నిర్వహించబడ్డాయి. ఎంతోమంది పరిషత్ కార్యకర్తలు లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు, పోలీస్ చర్యలను ఎదుర్కొన్నారు. ఈ విధంగానే జార్ఖండ్ మరియు తెలంగాణలో జరిగిన ఆందోళనలో పరిషత్ కార్యకర్తల క్రియాశీల భాగస్వామ్యం కారణంగా హింసావాదులైన నక్సల్స్ మరియు విఘటనకారీ శక్తుల చేతుల్లోకి ఈ ఉద్యమాలు వెళ్లకుండా కాపాడపడ్డాయి.

జాతీయ సమస్యలపై ఆందోళనలు చేస్తూనే సకారాత్మకమైన దేశభక్తి భావాన్ని జాగృతం చేయడంలో పరిషత్ ఎన్నో వ్యయప్రయాసలను అనుభవించింది.

వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా, డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని సామాజిక సమరసతా దినంగా ప్రతి సంవత్సరం వేలాది విద్యాలయాలలో విద్యార్థి పరిషత్ నిర్వహిస్తున్నది. ఇవే కాకుండా భగత్ సింగ్, సావార్కర్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఎందరో మహా పురుషుల ఆలోచనధారపై సాహిత్యాన్ని తయారు చేసి విద్యార్థులలో వాటిని ప్రచారం చేస్తూ అనేక కార్యక్రమాలు, స్పర్ధలు నిర్వహిస్తూ వారిని పరిషత్ కార్యంలో భాగస్వాములను చేస్తున్నది.

1857 స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించిన మహత్వపూర్వమైన స్మృతులను 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరిషత్ ఆనాటి వీరోచిత గాథలతో సాహిత్యాన్ని ముద్రించి ప్రచారం కోసం గాను దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించింది. వందేమాతరం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వందలాది మహా విద్యాలయాలలో స్వాతంత్య్ర సముపార్జన కోసం జరిగిన గౌరవపూర్వకమైన గాధలను వివరించడం జరిగింది. అంతేగాక సామూహికంగా వందేమాతరం గీతాన్ని భవ్యమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పాడించడం జరిగింది.

జాతీయ స్వాభిమానం లాంటి అనేక విషయాలపై పరిషత్ జనజాగరణ మరియు సంఘర్షణల మాధ్యమంగా పలు తరాలను దేశభక్తులుగా చేసే అమూల్యమైన కార్యాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నది.

(జూలై 9 – జాతీయ విద్యార్థి దినోత్సవం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here