Home News అయ్యప్ప భక్తుల శాంతియుత నిరసనల్లో మత కలహాలకు కుట్ర.. సీపీఎం నాయకుడు అరెస్ట్ 

అయ్యప్ప భక్తుల శాంతియుత నిరసనల్లో మత కలహాలకు కుట్ర.. సీపీఎం నాయకుడు అరెస్ట్ 

0
SHARE
శబరిమల వివాదం నేపథ్యంలో అయ్యప్ప భక్తులు చేస్తున్న నిరసనల ఆధారంగా హిందూ ముస్లిముల మధ్య మతకలహాలు సృష్టించడానికి ప్రయత్నించిన సీపీఎం నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. కోజికోడ్ జిల్లా పెరంబరలో  గత గురువారం శబరిమల కర్మ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు శాంతిపూర్వక నిరసన ప్రదర్శనలు చేస్తున్న సందర్భంగా సీపీఎం పార్టీ అనుబంధ సంస్థ డీ.వై.ఎఫ్.ఐ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు అతుల్ దాస్, అదే సమయంలో ప్రదర్శనల్లో ప్రవేశించి దారిలో ఉన్న జుమా మసీదుపై రాళ్లు రువ్వడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంలో అది పరిశీలించిన పోలీసులు అతుల్ దాస్ సహా మరికొందరు కమ్యూనిస్ట్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
నిందుతుడు కుట్రపూరితంగానే ఈ చర్యకు పాల్పడ్డాడని, మత ఉద్రిక్తతలు సృష్టించడమే అతడి ఉద్దేశమని పోలీసులు నిర్ధారించారు. సంబంధిత అభియోగాలతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
అరెస్ట్ అయిన అతుల్ దాస్ సీపీఎం కోజికోడ్ శాఖ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాడు.
Source: VSK Bharat