Home News కేరళ ముస్లిం యువతలో `ఐసిస్’ వ్యామోహం

కేరళ ముస్లిం యువతలో `ఐసిస్’ వ్యామోహం

0
SHARE

అబ్దుల్ రషీద్ – ఒక కంపెనీలో పౌరసంబంధాల అధికారి, షాజీర్ మనగాలసేరి అబ్దుల్లా – కాలికట్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడు, రెఫాల – దంతవైద్యురాలు. వీరంతా బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు. అయిన వీరంతా `ఇస్లామిక్ స్టేట్’ తో సంబంధాలు పెట్టుకుని, ఆ పనిలో నిమగ్నమయ్యారు. `ఇస్లామిక్ స్టేట్’ కోసం పోరాటం చేయాలన్న విపరీతమైన ప్రచారం వీరి మనసుల్ని మార్చేసింది. అంతేకాదు తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా పురికొల్పింది.

ప్రపంచం నేడు `తీవ్రవాదపు’ గుప్పిట్లో ఉందని చెప్పాలి. 2006 – 2016 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 25వేల 621మంది తీవ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మనదేశంలోనే 25వేల 41మంది `తీవ్రవాదానికి’ బలయ్యారు. (సౌత్ ఆసియా టెర్రరిజం పోర్టల్) తీవ్రవాద దాడుల సంఖ్య, అందులో చనిపోయినవారు, గాయపడినవారి సంఖ్యను బట్టి చూస్తే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల తరువాతి స్థానం భారత్ దేనని ఒక అమెరికా నివేదిక వెల్లడించింది. 2016లో భారత్ లో ఒక దాడిలో సగటున 0.4శాతం మరణాలు సంభావిస్తే, ప్రపంచం మొత్తంలో ఈ సరాసరి 2.4శాతం ఉంది. భారత్ లో జరిగిన దాడులలో మూడవ వంతు (73శాతం) ప్రాణాంతకమైనవి కావు.

ఈ వివరాలను బట్టి తీవ్రవాద భూతం ఎంతగా విస్తరించిందో అర్ధమవుతుంది. ఈ తీవ్రవాదానికి మతమౌఢ్యం, వామపక్ష అతివాదం మొదలైన అనేక దారులు.

గత 20 ఏళ్లుగా భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్న 180 తీవ్రవాద సంస్థల జాబితాను సౌత్ ఆసియా టెర్రర్ పోర్టల్ ఇచ్చింది. ఇందులో చాలామటుకు సంస్థలు భారత్ కు చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ ల నుండే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో 38 సంస్థలను భారత ప్రభుత్వం నిషేధించింది కూడా.

Courtesy: SATP
తీవ్రవాదానికి కేంద్రమైన కేరళ

భగవంతుని భూమిగా పేరుపడిన కేరళ గత కొన్ని సంవత్సరాలుగా `తీవ్రవాదపు’ చీకటిలో చిక్కుకుంది. కాసరగోడ్, కన్నూర్ , కోజీకోడ్, వాయనాడ్, పాలక్కాడ్, కొల్లాం మొదలైన జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువ. ఈ జిల్లాల నుండే ఎక్కువమంది ముస్లిం యువత `ఇస్లామిక్ స్టేట్’ సంస్థలో పనిచేసేందుకు వెళ్లారు. ఒక్క 2016లోనే 21మంది యువకులు ఇల్లువదిలి `ఐసిస్’లో చేరారు. ఇది రాష్ట్రంలో సాగుతున్న తీవ్ర `ఇస్లామీకరణ’ను సూచిస్తుంది. బాగా చదువుకున్న, మంచి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ, పురుషులు `ఐసిస్’లో చేరడం ఆందోళన కలిగించే విషయం. ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలు, అరబ్ ప్రపంచంతో సంబంధాల వల్ల కేరళ నుండి ఎక్కువమంది `ఐసిస్’ వైపుకు ఆకర్షితులయ్యారు.

కేరళలో `ఐసిస్’ ఉద్యమం

ఇల్లు వదలి `ఐసిస్’లో చేరడం ప్రస్తుతం కేరళ ముస్లిం యువతలో ఒక ఫ్యాషన్ గా మారిందంటే అతిశయోక్తి కాదు. ఏమి తెలియని వారు కూడా ఇలా ఇల్లువదలి పోతున్నారు. 2016లో ఒకేసారి 21మంది ఇలా `ఐసిస్’ దారి పట్టడంతో ఈ `ఆన్ లైన్ ఇస్లాం’ ధోరణి బయటకు వచ్చింది. ఈ 21 మందిని మొదట ముస్లిములుగా మార్చి, ఆ తరువాత `ఐసిస్’ లో చేర్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఇళ్ల నుండి మాయమైన 21మంది యువకులలో కొద్దిమంది తమకు తెలుసని కనకమాల గ్రామంలో పట్టుబడిన ఐసిస్ సభ్యుల విచారణలో వెల్లడించారు. ఆ యువకులంతా ఆఫ్ఘనిస్తాన్ లోని తీవ్రవాద సంస్థలో చేరారని చెప్పారు. ఈ వివరాలు బయటపెట్టిన ఐసిస్ సభ్యులు ఆఫ్ఘనిస్తాన్ లోని తమ నాయకులతో వాళ్ళు సంభాషించారు కూడా. పట్టుబడిన సభ్యులలో తోడుపూజ నగరానికి చెందిన సుబాని హాజ్ మొయిదీన్ ను జాతీయ విచారణ సంస్థ (NIA) తిరువన్వేలీ లో అరెస్ట్ చేశారు. పేలుడు పదార్ధాలను కొనుగోలు చేయడానికి సుబానికి తీవ్రవాద నాయకుల నుండి రూ.20,000 ముట్టినట్లు విచారణలో తేలింది.


ఇప్పటివరకు ఐసిస్ లో చేరిన వారిలో ఎక్కువమంది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ లకు చెందినవారు. కానీ ఇటీవల ఒక్క కాసరగోడ్ జిల్లా నుండే 17మంది ఐసిస్ బాట పట్టారు. గత రెండేళ్లలో 40మంది ఐసిస్ ఆధీనంలో ఉన్న దేశాలకు వెళ్లారు. అలా వెళ్ళేనవారిలో ఎక్కువమంది కేరళ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా కేరళలో యువత మనస్సులను కలుషితం చేస్తున్నారు. వారిని ఐసిస్ వైపు ఆకర్షితులయ్యేట్లు చేస్తున్నారు.

ఐసిస్ ఏం చేస్తోంది?

మలయాళం బ్లాగ్ ‘ముహజిరో, `ఆషాబుల్ హక్’, `సమీర్ అలీ’ అనే ఫేస్ బుక్ పేజీల ద్వారా ఐసిస్ కేరళలో విషప్రచారం చేస్తోంది. `విశ్వాసులు’, `అవిశ్వాసుల’ మధ్య సంవాదాలు, ఇస్లాం గురించి చర్చలు ఈ పేజీల్లో కనిపిస్తాయి. మధ్య ప్రాచ్యంలో నివసించే కేరళీయులు ఈ బ్లాగ్ ను నిర్వహిస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ బ్లాగ్, ఫేస్ బుక్ పేజీల్లో కనిపించే చర్చలు ఇస్లాం మతనిబంధనలను సమర్ధించే విధంగా ఉంటాయి. ఇస్లాంకు సంబంధించినది మాత్రమే సత్యం. మిగిలినదంతా అసత్యం. తమవారు కానివారంతా `పరులే’. ఇలాంటి వాదనలే అందులో కనిపిస్తాయి. 50కి పైగా పత్రికలు ఈ వాదాలను ప్రచురిస్తాయి.

ఇస్లామిక్ స్టేట్ పట్ల యువత ఎందుకు ఆకర్షితులవుతున్నారు?

కేరళ యువత ఆకర్షితులయ్యే పిడివాద ఇస్లాంకు కేరళలో కనిపించే సంప్రదాయ ఇస్లాంకు తేడా ఉంది. పిడివాద ఇస్లాంను విశ్వసించే వారిలో చాలామంది చదువులకు స్వస్తి చెప్పడం కనిపిస్తుంది. ఇలా వారు ఇతర సమాజం నుండి వేరుగా, ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇటువంటి వారే ఐసిస్ కు దగ్గర అవుతున్నారు.

కొత్తవారిని చేర్చుకునేందుకు ఐసిస్ కు అనువైన పరిస్థితులు ఉన్నాయా?

“కేరళ యువతలో కనిపిస్తున్న ఐసిస్ అనుకూల ధోరణిని చాలా కాలంగా గమనిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం కేరళలో ఎక్కువమందికి గల్ఫ్ (పశ్చిమాసియా)తో సంబంధాలు ఉండడమే. పిడివాద ధోరణి, తీవ్రవాద ప్రణాళికలు, అందుకు అవసరమైన నిధులు ఇక్కడ నుండే కేరళకు వస్తున్నాయని మా పరిశోధనలో తేలింది.’’ అని జాతీయ విచారణ సంస్థ (NIA)కు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

కొన్ని ఉదాహరణలు

ఖతర్ లో తన తల్లిదండ్రులతోపాటు నివశిస్తున్న ఒక మలయాళీ ముస్లిం అబ్బాయి అథ్లెటిక్ క్రీడలో మంచి ప్రావీణ్యత కనపరచాడు. అతడిని మెరుగైన శిక్షణ కోసం పారిస్ పంపారు. అతని ప్రతిభను గుర్తించిన ఖతర్ క్రీడల మంత్రిత్వ శాఖ అతని చదువుతోపాటు శిక్షణ ఖర్చును కూడా భరించడానికి ముందుకు వచ్చింది. శిక్షణ కోసం వెళ్ళి వచ్చిన తమ 19ఏళ్ల కుమారుడి ధోరణిలో వచ్చిన మార్పు తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పారిస్ లో ఉన్నప్పుడు ఇంటర్ నెట్ ద్వారా తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ఆకర్షితుడైన ఆ పిల్లవాడు పూర్తిగా మారిపోయాడు. ఈ `ఆధ్యాత్మిక మేలుకొలుపు’ తో అతని ఆలోచనలో మార్పువచ్చింది. క్రీడలు `అపవిత్రమైనవనే’ భావం కలిగింది. ఆ కుటుంబం కేరళకు తిరిగివచ్చిన తరువాత పరిస్థితులు మరింత విషమించాయి. విద్యాసంస్థలన్నిటివల్ల ముస్లిములు `దారితప్పుతున్నారని’ భావించిన ఆ కుర్రవాడు తన చదువు కూడా కొనసాగించలేకపోయాడు.

ఆగస్ట్ 19న ఎర్ణాకులంలోని పెరంబూర్ కు చెందిన ఒక వ్యాపారి ఇంటిపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. వారికి ఆ ఇంట్లో 13లక్షల రూపాయల విలువైన బంగారం, ఇతర వస్తువులు కనిపించాయి. విచారణలో తెలినది ఏమిటంటే తీవ్రవాద గ్రూపులకు చెందిన కొందరు దొంగతనం చేసిన ఈ సొత్తును వ్యాపారి ఇంట్లో దాచారు. ఆ సొత్తును తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించాలన్నది వారి ప్రణాళిక.

అబ్దుల్ హలీమ్ : లష్కరే తోయిబా కమాండర్ అయిన అబ్దుల్ హలీమ్ ఉరఫ్ తడియంతవిడే నజీర్ 2009లో పోలీసులకు చిక్కాడు. కేరళలో తీవ్రవాద కార్యకలాపాలు సాగించడానికి బంగారం వ్యాపారులు, ఇతర వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశాడు.
ఐసిస్ పేరుతో తీవ్రవాద వ్యవస్థ

అబ్దుల్ రషీద్ అనే తీవ్రవాది కేరళలో 40మందికి మతమౌఢ్య సిద్దాంతాన్ని బోధించి వారిని తీవ్రవాదులుగా మార్చాడని, ఆ తరువాత అతను ఆఫ్ఘనిస్తాన్ కు పారిపోయి అక్కడ ఈ కార్యకలాపాలు సాగిస్తున్నాడని 28ఏళ్ల స్కూల్ టీచర్ యాస్మిన్ అహ్మద్ వెల్లడించింది. 2017 మే, జూన్ మాసాలలో కేరళ నుండి 21మంది మాయం కావడానికి రషీదే కారణమని అనుమానిస్తున్నారు. పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రషీద్ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసేవాడు. ఇతని గురించి సమాచారం ఇచ్చిన యాస్మిన్ కూడా అదే స్కూల్ లో పనిచేసేది. ఈమె కూడా దేశంవదలి వెళ్లిపోవాలనుకున్నా తన 4ఏళ్ల పిల్లవాడి వీసా ఆలస్యం కావడంవల్ల ఆగిపోయింది. అంతలోనే పోలీసులకు పట్టుబడింది.

సౌదీ అరేబియాలో పుట్టి, పెరిగిన యాస్మిన్ భర్త సయ్యద్ అహ్మద్ తో పాటు పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉద్యోగం కోసం మూడేళ్ళ క్రితం కేరళకు వచ్చింది. అక్కడే ఉపాద్యాయులకు శిక్షణ ఇచ్చే రషీద్ ను కలిసింది. ఆ తరువాత యాస్మిన్ భార్త సయ్యద్ తిరిగి సౌదీ వెళ్లిపోవడంతో యాస్మిన్, రషీద్ ల మధ్య స్నేహం పెరిగింది. దైవభక్తి కలిగిన యాస్మిన్ కు ఇంగ్లీష్ లో మంచి ప్రావీణ్యం ఉంది. రషీద్ మతఛాందస బోధలు ఆమెను ఆకర్షించాయి. ఖురాన్ తరగతుల పేరుతో రషీద్ అందరికీ ఐసిస్ గురించి చెప్పేవాడు. ఐసిస్ పత్రిక దాబిక్ ను క్రమంతప్పకుండా చదివే రషీద్ అందులోని విషయలు ఇంటర్ నెట్ ద్వారా అందరికీ పంపేవాడు. ఆ తరువాత అతను ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్ళి కొత్తవారిని ఐసిస్ లో చేర్చే పని చేపట్టాడు. యాస్మిన్ ఎప్పటికప్పుడు కేరళలో సమారాచాన్ని రషీద్ కు చేరవేసేది. ఈ సందేశాలను పసిగట్టిన పోలీసులు యాస్మిన్ ను అరెస్ట్ చేశారు. `నేను ఖురాన్ చెప్పిన ప్రకారం ఒక నిజమైన ముస్లింగా జీవించాలనుకున్నాను. కానీ ఇక్కడ అది సాధ్యపడదు’ అని యాస్మిన్ అహ్మద్ తన వాంగ్మూలంలో పేర్కొంది.

ప్రధాన కుట్రదారులు

యువతను ఐసిస్ వైపు ఆకర్షించి, ఆ తరువాత వారిని దేశం నుండి తరలించడంలో అర్షీద్ ఖురేషీ, రిజ్వాన్ ఖాన్ లు ప్రాధాన పాత్ర పోషించారు. వీరిని కేరళ, మహారాష్ట్ర లకు చెందిన సంయుక్త పోలీసు బలగాలు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర అంతా బయటకు వచ్చింది.

ఖురేషీ, ఖాన్ లు అనేకమందిని ఐసిస్ బాట పట్టించారు. తీవ్రవాదాన్ని ప్రేరేపించే సాహిత్యం, కొన్ని వివాహ గుర్తింపు పత్రాలు ఖాన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. 6గురు మహిళలు, 2 పిల్లలతో సహా మొత్తం 21మంది ఒక్క నెలలోనే మాయమవడంతో కేరళ పోలీసు వర్గాలలో కలకలం రేగింది. దేశం వదలి పోయినవారిలో చాలామంది ఉన్నత మధ్యతరగతికి చెందినవారు, బాగా చదువుకున్నవారు. వీరిలో 2పురుషులు, 3 స్త్రీలు ఇస్లాం మతం పుచ్చుకున్నారు. మతతత్వాన్ని వ్యాప్తి చేసే పాఠాలు బోధిస్తున్నారంటూ కేరళ ప్రభుత్వం పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ఇటీవల మూసివేసింది .

పీస్ ఇంటర్నేషనల్ స్కూల్
ఎం.ఎం . అక్బర్ అనే వ్యక్తి ప్రారంభించిన పీస్ ఇంటర్నేషనల్ స్కూల్ స్వతంత్ర మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. కేరళలో ఈ స్కూల్ కు 10 శాఖలు ఉన్నాయి. అలాగే తమిళనాడు, కర్ణాటక లలో  చెరొక శాఖ ఉన్నాయి. మొత్తం 7వేలకు పైగా విధ్యార్థులు ఈ స్కూళ్ళలో చదువుతున్నారు. స్కూల్ ను ప్రారంభించిన అక్బర్ పొన్నాని, కోజీకోడ్ లలో రెండు మతమార్పిడి కేంద్రాలను నిర్వహిస్తున్నాడు కూడా. అందుకనే ఇతన్ని `కేరళ జాకీర్ నాయక్’ అంటారు.

నేర్చుకోవలసిన పాఠాలు

ఐసిస్ వైపు యువతను ఆకర్షించడానికి వీరు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకున్నారు. కనుక తమ పిల్లలు సోషల్ మీడియా గుండా ఇలాంటి తీవ్రవాద శక్తుల వలలో చిక్కకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. స్కూల్ లో టీచర్లు కూడా పిల్లల వ్యవహార శైలిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. తీవ్రవాద బాట పట్టి దేశం వదిలి పోయినవారి ప్రభావం ఇక్కడ ఉన్నవారిపై పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.

న్యూస్ భారత్ సౌజన్యంతో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here