Home Press Release స్వామి సత్యమిత్రానంద.. భారతీయ ధార్మిక ప్రపంచానికి మూలస్తంభం: ఆర్.ఎస్.ఎస్

స్వామి సత్యమిత్రానంద.. భారతీయ ధార్మిక ప్రపంచానికి మూలస్తంభం: ఆర్.ఎస్.ఎస్

0
SHARE

స్వామి సత్యమిత్రానంద గిరిజీ మహారాజ్ పరమపదం చేరుకున్నారన్న వార్త మమ్మల్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఆయన భారతీయ ధార్మిక ప్రపంచపు ఒక మూల స్థంభం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలకు ఆయన ప్రియమైన మార్గదర్శి. ఆయన స్వచ్చమైన, స్నేహపూర్వకమైన, సేవాభావంతో కూడిన జీవితం ఆయన విశుద్ధమైన, సంతులిత సామాజిక జీవనానికి మూలం. సామాజిక దురాచారాలను, అసమానతలను నిరసించిన ఈ సాధుపుంగవుడు సామాజిక సమరసతను సమర్ధించారు. ఈ రంగాలలో ఆయన లేని లోటును తీర్చేందుకు కృషి చేయడం మనందరి కర్తవ్యం. ఆయనను మనం భౌతికంగా చూడలేకపోయినా ఆయన ఆత్మ మాత్రం మనలను నడిపిస్తూనే ఉంటుంది. స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది. ఆయన దివ్య స్మృతికి కన్నీటితో కూడిన, భావపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.

– మోహన్ భాగవత్ (సర్ సంఘచాలాక్)

– సురేష్ (భయ్యా)జోషి, (సర్ కార్యవాహ)