Home News ఆర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటన: రాహుల్ గాంధీ అసత్యాలు

ఆర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటన: రాహుల్ గాంధీ అసత్యాలు

0
SHARE

ఆర్ ఎస్ ఎస్ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసిన పత్రిక ప్రకటన స్వేచ్చానువాదం:

ఆర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటన:

కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసత్యాలు, మోసపూరితమైన ప్రకటనలతో సమాజాన్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ అధికారిక  ఫేస్ బుక్ పేజీలో సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ మరియు నా పేరు మీద ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేయడం జరిగింది. అందులో ఆయన భారత రాజ్యాంగం ద్వార ఎస్ సి / ఎస్ టి  వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లను అంతం చేయాలనీ  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పూర్తి అసత్యం మరియు నిరాధారమైన ఆరోపణలు. రాహుల్ గాంధీకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, తాను చేసిన ఈ వ్యాఖలకు సంబంధించి సాక్ష్యాధారాలు  వెల్లడించాలి.

హిందూ సమాజంలో దురదృష్టవశాత్తూ ఉన్న సామాజిక అసమానతల కారణంగానే భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు/తెగల వారికి రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్లు కొనసాగాలన్నది ఆర్ ఎస్ ఎస్ అధికార వైఖరి. అఖిల భారతీయ ప్రతినిధి సభ కూడా ఎప్పటికప్పుడు తన తీర్మానాల ద్వారా ఈ విషయన్ని పునరుద్ఘాటిస్తూ వచ్చింది.

మన దేశంలో సామరస్యంతో, సామజిక అంతరాలు లేని  సమసమాజ స్థాపన కోసం  ఆర్ ఎస్ ఎస్  అంకితభావంతో కృషి చేస్తోంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అసత్యాలు, అబద్ధాలతో నిండిన రాజకీయ మోసం. వారి చేస్తున్న అనుచితమైన,  దుశ్చర్యల పై ప్రవర్తన పట్ల నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

డా మన్మోహన్ వైద్య
సహా సర్కార్యవాహ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 

Source: rss.org