Home News హైదరాబాద్ లో అక్రమంగా ప్రవేశించి భారత పాస్‌పోర్ట్‌ను, ఆధార్‌కార్డును పొందిన రోహింగ్యా ముస్లింలు అరెస్టు

హైదరాబాద్ లో అక్రమంగా ప్రవేశించి భారత పాస్‌పోర్ట్‌ను, ఆధార్‌కార్డును పొందిన రోహింగ్యా ముస్లింలు అరెస్టు

0
SHARE

హైదరాబాద్ నగరంలోకి అక్రమంగా ప్రవేశించి భారత పాస్‌పోర్ట్‌ను, ఆధార్‌కార్డును పొందిన మయన్మార్‌కు చెందిన ఇద్దరు రోహింగ్యా ముస్లింలను బాలాపూ ర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రిమాండ్‌కు తరలిం చారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. సోమవారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

మయన్మార్‌కు చెందిన అబ్దుల్‌ఖైర్ అలియాస్ షేక్ యూసుఫ్(34) బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌కు చేరుకొని బాలాపూర్‌లోని రాయల్‌కాలనీ ఫాతీమా మసీదు సమీపంలో నిర్వహిస్తున్న శరణార్థుల క్యాంపులో తలదాచుకున్నాడు. క్యాంపులోనే ఉంటున్న జూర్ అలామ్ సహకారంతో అక్రమంగా భారత పాస్‌పోర్ట్‌ను సంపాదించాడు. గత ఏడాది నవంబర్‌లో 30 రోజుల వీసా సంపాదించి సౌదీ అరేబియాలోని ఉమ్రాకు వెళ్లాడు. ఆరు నెలలు అక్కడే ఉండటంతో అక్కడి అధికారులు అబ్దుల్‌ఖైర్‌ను అరెస్టు చేసి జెడ్డా జైలుకు పంపారు. విడుదలైన తర్వాత అతడు హైదరాబాద్‌కు వచ్చి బాలాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ విషయంపై విశ్వసనీయ సమాచారం అందడంతో ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమంగా ఆధార్‌కార్డు..

మయన్మార్‌కు చెందిన మహ్మద్ అయూబ్ అలియాస్ అయూబ్ (32) సైతం బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడు. హైదరాబాద్‌కు చేరుకొని బాలాపూర్‌లోని బిస్మిల్లాకాలనీలో ఉన్న శరణార్థుల క్యాంపులో చేరాడు. తర్వాత అక్రమమార్గంలో ఆధార్‌కార్డును పొందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

(నమస్తే తెలంగాణ సౌజన్యం తో)