Home News కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని దేశప్రజలకు విజ్ఞప్తి చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

0
SHARE

ఎన్నడూ లేనటువంటి వరదల మూలంగా కేరళలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది నిర్వాసితులయ్యారు. లక్షలాదిమంది ఇప్పటికీ వరద నీటిలో చిక్కుకుని ఉన్నారు.

అనేక అడ్డంకులు, అవరోధాలు ఉన్నప్పటికి సైన్యం, జాతీయ విపత్తు సహాయ బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులను రక్షించి, వారికి తగిన సహాయాన్ని అందించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వీరితోపాటు సంఘ స్వయంసేవకులు, సేవభారతి కార్యకర్తలు, ఇతర స్వచ్ఛంద సంస్థలకు చెందినవారు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరు సమయానికి ప్రతిస్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసించదగిన విషయం.

వనరులు పరిమితంగా ఉండడంతో కేరళ వరద బాధితుల సహాయ కార్యక్రమం అవసరమైన స్థాయిలో సాగడంలేదు. పెనువిపత్తు ఎదుర్కొంటున్న కేరళ ప్రజలకు అండగా నిలబడి, బాధితులకు చేతనైన సహాయాన్ని అందించాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపునిస్తోంది.

– సురేశ్ జోషి, సర్ కార్యవాహ,
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

(rss.org సౌజన్యం తో)