Home News సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలి – శ్రీ చలసాని నరేంద్ర

సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలి – శ్రీ చలసాని నరేంద్ర

0
SHARE
శ్రీ చలసాని నరేంద్ర

నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిచేవారు వాటిని జాతీయత దృష్టితో వివరించే వారు అవసరం అని అందుకు ప్రతి ఒక్కరు ఒక సిటిజన్ జర్నలిస్ట్ గా మారి,  జాతీయత, సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలని సేనియర్ జర్నలిస్ట్ శ్రీ చలసాని నరేంద్ర గారు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

నరేంద్ర గారు ఆదివారం నాడు విశ్వ సంవాద్ కేంద్రం, సమాచార భారతి ఇందూర్ ( Nizamabad) అధ్వర్యంలో నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో దేవర్షి నారద జయంతి – ప్రపంచ పాత్రికేయ దినోత్సవంలో ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

జాతీయత, సమాజహితం కోసం రచనలు చేసే వారిని ఏకం చేసే ప్రయత్నం విశ్వ సంవాద్ కేంద్ర చేస్తుందన్నారు.  రచనలు చేయడంలో ఉత్సాహవంతులు అయిన వారి కోసం కార్యశాలలు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని కూడా నరేంద్ర గారు వివరించారు.

నారద జయంతి కార్యక్రమానికి సభాధ్యుక్షులుగా వ్యవహరించిన శ్రీ టి శ్రీనివాస్ , ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, నాగారం, మాట్లడుతూ మీడియాకి స్వేఛ్చ అవసరమని, స్వేచ్చగా సమాచారాన్ని ప్రజల వద్దకు చేర్చే వాతావరణాన్ని మీడియా యాజమాన్యాలు ఏర్పరచాలని, సామాన్య ప్రజల భావాలకు పత్రికలల్లో అవకాశం కల్పించాలని కోరారు. సమాజంలోని పాత్రికేయులు, పాఠకుల సమాజ హితం కొరకు  పాటు పడాలని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమ నిర్వాహకులు శ్రీ దిగ్గాయి ఆనంద్ గారు మాట్లాడుతూ సమాచార భారతి లక్షలను, అదే విధంగా విశ్వ సంవాద్ కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సనాతన సంప్రదాయంలో దేవర్షి నారదుడు లోకహితం కొరకు సమాచారాన్ని అందరికి తెలియ పరచారని  వారి జయంతి ని పురస్కరించుకొని ప్రపంచ పాత్రికేయ దినోత్సవం నిర్వహించడం ఒక ఆనవాయతి అని అన్నారు.

ఈ సందర్బంగా పలువురు విలేఖరులకు జ్ఞాపిక, శాలువా తో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీమన్నారాయణ, నాగ శ్రీనివాస్,  సురేందర్, శ్రీనివాస్, చక్రధర్, సత్యం  తో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.