Home News సంస్కృత భారతి ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ

సంస్కృత భారతి ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ

0
SHARE
సంస్కృత భాషా సంబంధిత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో శనివారం బెంగళూరులోని సంస్కృత భారతి కార్యాలయం ‘అక్షర’లో జరిగింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి సుధామూర్తి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ క్రింది గంథాలు ఆవిష్కరించబడ్డాయి.

– కన్నడ శతావధాని డా. శ్రీ ఆర్. గణేష్ రాసిన సంస్కృతంలోకి తర్జుమా చేసిన ‘మహాబ్రాహ్మణ’ (కన్నడ మూలం: శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి రాసిన నవల)
– డాక్టర్ జనార్దన్ హెగ్డే రాసిన ‘ఇందులేఖ’
– డాక్టర్ జనార్దన్ హెగ్డే, శ్యామల రాసిన ‘గ్రంథిల’.
కార్యక్రమంలో సభ్యులనుద్దేశించి సుధామూర్తి ప్రసంగిస్తూ.. సంస్కృతి కవి కాళిదాసు మరియు సంస్కృతి నాటక రచనలను విద్యావిధానంలో చేర్చాల్సిన అవసరాన్ని వివరించారు. సంస్కృత సాహిత్యం యొక్క ఔన్నత్యాన్ని భావి తరాలకు వివరించడంలో మనం విఫలమవుతున్నామని అన్నారు. ఇకపై ఎవరికైనా బహుమతులు ఇచ్చే సందర్భంలో సంస్కృత మరియు కన్నడ భాషా సాహిత్యానికి చెందిన పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాల్సిందిగా సూచించారు.
నాగపూరుకు చెందిన కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ శ్రీనివాస్ వరఖేడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమం మొత్తం సంస్కృత భాషలో సాగటం విశేషం.